Chuttu Chengavi Cheera - Thoorpu Velle Railu - By Mee Snehageetham
ప్రపంచంలో స్త్రీ కట్టు.బొట్టుకు మన భారతీయ సంస్కృతి కి ఓ ప్రత్యేక స్థానం ఉంది.ఆడవారికి బొట్టు.కాటుక.నిండైన చీరె అందం.భారతీయుల దుస్తులలో దాదాపు ప్రామాణికమైన చీర సాహిత్యంలో, ముఖ్యంగా జానపద సాహిత్యంలో, పలు సందర్భాలలో ప్రస్తావించబడింది.భారత స్త్రీలు చీరను కట్టే విధానంలో కూడా ఒక విధమైన సౌకుమార్యం, అందం ఉంటుంది.చీరలోని నిండుతనం,ఆ సొగసు ని
దాదాపు 39 సంవత్సరాల క్రితమే చీర రంగులను పదాలలో ముంచెత్తిన గొప్ప మధుర గీతం.
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ
నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
వన్నె వన్నె చీరల్లోనా నీ వళ్ళే హరివిల్లూ
మీ స్నేహగీతం
Comments
Post a Comment