నంది పురస్కారాలు! తిరస్కారాలు ! By Mee Snehageetham
నంది పురస్కారాలు! తిరస్కారాలు !
తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన '' లేపాక్షి నంది '' పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది.చిత్ర నిర్మాణ సరళి, నాణ్యత, ప్రమాణాలు పాటిస్తూ ఇచ్చే మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పైగా పెరిగినవి.
ఎన్నడూ లేని విధం గా ఈ సారి ఈ నంది అవార్డ్స్ కి కులం రంగు పూసుకోవటం కాస్త సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపింది అనటం లో అతిశయోక్తి లేదు.పైగా ఒకటే సారి మూడు సంవత్సరాలకు గానూ సమయాభావం వలన ( ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ) ఇవ్వటం వలన దాంట్లో ఎక్కువ శాతం ఒక కులానికే నంది అవార్డ్స్ ఇచ్చారు అని నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలను తొక్కేసి,తమ వారికి మాత్రమే అవార్డులను ప్రకటించుకున్నారని అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అంటూ బహిరంగంగానే విమర్శలు మొదలయ్యాయి. తమ తమ చిత్రాలకు నంది పురస్కారం దక్కకపోవడంతో దర్శకుడు గుణశేఖర్, బన్నీ వాసు తదితరులు జ్యూరీపై బాహాటంగా విమర్శలు గుప్పించారు.
ఇక తప్పని పరిస్థితులలో రంగం లోకి దిగిన ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల ప్రకటనతో పరువు పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇంత రచ్చ అవుతుందని తాను అనుకోలేదని, ఇంత రాద్ధాంతం జరుగుతుందనుకుంటే ఇలా చేసే వాడిని కాదని అన్నారు.జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన వారికే అవార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ అవార్డులపై ఇంత గొడవ జరుగుతుందనుకుంటే పారదర్శకంగా `ఐవీఆర్ఎస్` సర్వే చేయించి ప్రజాభిప్రాయం ప్రకారమే నంది అవార్డులను ప్రకటించేవాళ్లమని చెప్పారు. ఆఖరికి అవార్డులకు కూడా కులాన్ని ఆపాదించడం దురదృష్టకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో అవార్డులు ప్రకటించడం ఆలస్యమైందని అందుకే మూడేళ్ల అవార్డులు ఒకేసారి ప్రకటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే ఈ విధంగా మూడు సంవత్సరాల అవార్డులు ఒకేసారి ఇచ్చి ఉండాల్సింది కాదని అందువల్లే ఈ వివాదాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.
ఇది ఇలా వుండగా మంత్రి లోకేశ్‌మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించటం తో పాటు ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తూ ఇద్దరుముగ్గురే మాట్లాడుతున్నారు. వాళ్లంతా ‘నాన్‌రెసిడెంట్ ఆంధ్రాస్’. హైదరాబాద్‌లో ఉంటూ నంది అవార్డులు, ప్రత్యేక హోదాపై విమర్శలు చేస్తున్నారు. వారంతా ఉదయం విజయవాడ వచ్చి ప్రత్యేక హోదా అంటూ హడావిడి చేసి మధ్యాహ్నానికి హైదరాబాద్ వెళ్లిపోతారు. హోదా కోసం అసెంబ్లీని ముట్టడిస్తే ఎలా? దేశ రాజధానికి వెళ్లాలి’ అని లోకేశ్ వ్యాఖ్యానించటంతో పాటు నంది అవార్డుల వివాదం మరింత ముదిరితే అవార్డులను రద్దు చేస్తామంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించటంపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి హైదరాబాద్‌లో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించి తనకు ప్రకటించిన టెంపర్ సినిమాకు తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డు తిరస్కరిస్తున్నానని... ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే, అప్పుడు తీసుకుంటానని ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రకటించిన నంది అవార్డులను రద్దు చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా మళ్లీ ఎంపిక చేయాలని పోసాని డిమాండ్ చేశారు.
చిలికి చిలికి గాలి వాన గా మారుతున్న ఈ నందుల వ్యవహారానికి అతి త్వరలో తెరవేస్తారని ఆశిస్తూ ...
మీ మాధవి రాజు
Comments
Post a Comment