Pucha Puvvula Song - Manoharam Movie - By Mee Snehageetham
“పుచ్చా పూవుల విచ్చే తావుల వెచ్చావెన్నెలలు
అచ్చా మీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు
వచ్చీనాయమ్మ విచ్చీనాయమ్మ
వచ్చీనాయమ్మ కలువలు విచ్చీనాయమ్మ”
అచ్చా మీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు
వచ్చీనాయమ్మ విచ్చీనాయమ్మ
వచ్చీనాయమ్మ కలువలు విచ్చీనాయమ్మ”
అనే పల్లవితో మొదలవుతుందీ పాట. ఇది శరద్రాత్రుల వెన్నెల గీతం. ఆహ్లాదం దీని లక్షణం. దీని వర్ణం తెలుపు. దీని రూపం ఏటిగాలి. అది మందం, మలయజం. నీలగిరి కన్నెలు నీలాలలో ఎగిరే తెల్లబారు కొంగలను చూసి తెల్ల కలువలలో మోము దాచుకుంటూ, సిగ్గుతో తమలో తాము పాడుకునే పాట.
గువ్వజంటలకు కువకువ
ఇటు కుర్రగుండెలకు మెలకువ
వీణమీటె సెలయేరు
చలి వేణువూదె చిరుగాలి
కలువ కనులలోన కలవరింతలాయే
చలువ తనువులోన జలదరింతలాయే”
ఇటు కుర్రగుండెలకు మెలకువ
వీణమీటె సెలయేరు
చలి వేణువూదె చిరుగాలి
కలువ కనులలోన కలవరింతలాయే
చలువ తనువులోన జలదరింతలాయే”
ఇంతలో శరద్రాత్రి. వినీలాకాశంలో వెన్నెల పింజెలా అన్నట్లు తెల్ల మబ్బులు హుటాహుటిని పరుగులు తీస్తుంటే పిండార బోసిన వెన్నెలలో ఆ కృష్ణాతీరంలో, నీరంలో,పులిన కేదారంలో మరెన్ని వింతలు, ఎన్నెన్ని కవ్వింతలు!
“పిండీ వెన్నెల వండీ వార్చిన
వెండీ ఇసుకల్లో
తెల్లా మబ్బులు వెల్లావేసిన
పిల్లకాలువల్లో
వచ్చీనాయమ్మా అలజడులొచ్చీనాయమ్మా”
వెండీ ఇసుకల్లో
తెల్లా మబ్బులు వెల్లావేసిన
పిల్లకాలువల్లో
వచ్చీనాయమ్మా అలజడులొచ్చీనాయమ్మా”
అప్పుడా చుట్టుప్రక్కల ప్రదేశము కర్పూరము. వెన్నెల జాలుపడ్డ నీలాల కృష్ణ తెల్లని శ్రీశైలగోపురానికి నిలువుటద్దం. పాల సముద్రపు సింధుశాఖ.
లేత పచ్చికల అణకువ నునులేత మచ్చికల కువకువ
నిండు అల్లికల నవనవ తలదిండు మల్లికల శివశివ
పట్టపగటి ఎండా పండు వెన్నెలాయె
నిట్ట నిలువ తపనే నిలువ నీయదాయే-“
నిండు అల్లికల నవనవ తలదిండు మల్లికల శివశివ
పట్టపగటి ఎండా పండు వెన్నెలాయె
నిట్ట నిలువ తపనే నిలువ నీయదాయే-“
దీనికి వ్యాఖ్యానం పొడిమాటలతో కుదిరేది కాదు. ఆ వెన్నెల లలో తడిసిన వాళ్ళకే తలకెక్కే విషయము.
“ఓరా, వాకిలి, తీసి తీయని దోరా వయస్సులో
మాఘూమాసపు మంచు బెబ్బులి పొంచే వేళల్లో
వచ్చీనాయమ్మా వలపులు విచ్చీనాయమ్మా”
మాఘూమాసపు మంచు బెబ్బులి పొంచే వేళల్లో
వచ్చీనాయమ్మా వలపులు విచ్చీనాయమ్మా”
అయితే మనోహరం సినిమాలో కృష్ణాతీరం లేదు. ఏ అందాలు చూసి ఈ గీతం వ్రాశానో వాటి ఆచూకీ కూడా ఉండదు. పాట బాగుందని అందులో వాడుకోటం జరిగింది. గ్రాఫిక్స్ తో చక్కగా తమ పరిధి మేరకు సందర్భానికి సమన్వయం చేసుకుంటూ చిత్రీకరించారు ఈ పాటను. ఇందుకు దర్శకుడు శ్రీ గుణశేఖర్ నిర్మాత శ్రీ మధుమురళి అభినందనీయులు.
సేకరణ :వేటూరి గారు బై మీ స్నేహ గీతం
Comments
Post a Comment