Ottesi chepava inkokasari song - Aatma bandham - by mee snehageetham
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...,,,,,
ఆసక్తికరమైన కథా కథనాలతో 90లలో వచ్చిన ఒక మంచి సినిమా ఆత్మబంధం. కలకాలం తోడుంటాడని ప్రాణంగా ప్రేమించి పెళ్ళిచేసుకున్న తన భర్త ఒక యాక్సిడెంట్ లో తనని వీడివెళ్ళిపోయాడనే దిగులుతో ఉన్న ఆమెకి అతను ఆత్మరూపంలో తనచుట్టూనే ఉండి కాపాడుకుంటున్నాడని తెలిసిన క్షణంలో నమ్మలేని ఆ నిజాన్ని ఒట్టి ఊహకాదని ఒట్టేసి చెప్పవా అంటూ భర్తనే అడిగే సంధర్బంలోని ఈ పాట చాలా అందంగా ఉంటుంది. మీరూ వినండి .
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒట్టి ఊహ కాదని.. ఈ కొత్త పూల గాలి ..
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని ..
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని ...
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ
అమావాస్య కొలువై మోయ మంటు రేయినీ...
సుదూరాల తారల్ని సుధా శాంతి కాంతుల్నీ
వలలు వేసి తెచ్చా కంటి కొనలో నింపనీ ..
చెదరని చెలిమి కి సాక్ష్యమా
హృదయము తెలుపగ సాధ్యమా ...
మాయని మమతల దీపమా... ఉదయపు తళుకులు చూపుమా ...
నా జాబిలి నీవేనని ...
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ..
తుదే లేని కధ కాని గతం కాని స్వప్నాన్ని
ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ ..
నువ్వే వున్న కన్నులతో మరే వంక చూడననీ
రెప్ప వెనక నిన్నే ఎల్లకాలం దాచనీ ...
యుగములు కలిగిన కాలమా ఈ ఒక ఘడియను వదులుమా
చరితలు కలిగిన లోకమా ఈ జత జోలికి రాకుమా ...
స్వప్నం చిగురించిందని .....
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి .......
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి .......
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి ..
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని ..
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచిందని ....
ఇంకొక్కసారి ...ఇంకొక్కసారి ...
మీ స్నేహ గీతం
Comments
Post a Comment