Manasuna Molichina Sarigamale ( koo koo chuku chuku Song) - Sankeerthana by mee snehageetham
మనసున మొలిచిన సరిగమలే
ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నిన్ను చేరి
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎదసడితో నటియించగా రా
స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
కుకుకు కుకుకు కీర్తన తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిల ఎట దాగున్నావో
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
మీ నృత్యం చూసి నిజంగా... ఊ నిజంగా..హహ..
మువ్వలరవళి పిలిచింది కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది మనసు కలను వెదికింది
వయ్యారాల గౌతమి ఈ ఈ ఈ ఆహాఅ..
వయ్యారాల గౌతమి ఈ కన్య రూప కల్పన
వసంతాల గీతమే నన్నే మేలుకొల్పిన
భావాల పూల రాగాలబాట నీకై వేచెనే
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ
సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
లలిత లలిత పదబంధం మదిని మృధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం
మరందాల గానమే...
మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వాలే నీ మ్రోల
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ
సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
మీ స్నేహ గీతం
Comments
Post a Comment