Edho Cheppalanukunna Song Urmila movie by mee snehageetham
ఏదో చెప్పాలనుకున్నా ప్రియా నిను చూసిన చిరుక్షణం
నీవే కావాలనుకున్నా ప్రియా నిను చూసిన మరుక్షణం
మాటేమొ పెదవి దాటదు మనసేమొ దారి చూపదు
ఏమౌవుతుందో తెలియదూ ఏమౌతానో తెలియదూ
ఆ..ఏమౌతానో తెలియదు
ఏదో చెప్పాలనుకున్నా ప్రియా నిను చూసిన చిరుక్షణం
కలకాని కలలాంటి తొలిప్రేమలోన
కనుచూపులే చిలిపి కావ్యాలు కావా
ఎదచాటు సొదలేవో వినుకున్న నాడు
చిరు శ్వాసలే వలపు గీతాలు కావా
విరహల చినుకులలో ప్రియతమా
మనసార తడిపాను ఆ....మనసారా తడిచాను
ఏదో చెయ్యాలనుకున్నా ప్రియా నిను చూసిన మరుక్షణం
నీవే నేననుకున్నా ఓ ప్రియా నిను చూసిన మరుక్షణం
నిదురంచుదామన్న నిదురేమొ రాదు
మేల్కొన్న నా మనసు నను నిలువనీదు
నీకోసమే కళ్ళు వెతికేది నేస్తం
నీ ఉహలో నిలిచి ఉన్నాది ప్రాణం
పలికించు ప్రియమార ఓ ప్రియతమా
అదరాల మృదువీణా ఆ..అదరాల మృదువీణా
నీలో దాగాలనుకున్నా ప్రియా నిను చూసిన చిరుక్షణం
ఆ..నింగి నేల కలిసిందొ ప్రియా నిను చూసిన మరుక్షణం
మాటేమొ పెదవి దాటదు మనసేమొ దారి చూపదు
ఏమౌతుందో తెలియదు ఏమౌతానో తెలియదు
ఆ...ఏమౌతానో తెలియదు
మీ స్నేహ గీతం
Comments
Post a Comment