Oka Kommaku Video Song Jeevana Ragam by mee snehageetham
ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే
ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే
చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము
ఓ చెల్లెమ్మా... నీతోటిదే లోకము ||ఒక కొమ్మకు||
అన్నయ్యా... నీవేను నా ప్రాణము
ఓ అన్నయ్యా... నీతోటిదే లోకము
ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే
చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము
ఓ చెల్లెమ్మా... నీతోటిదే లోకము ||ఒక కొమ్మకు||
అన్నయ్యా... నీవేను నా ప్రాణము
ఓ అన్నయ్యా... నీతోటిదే లోకము
మా చెల్లి నవ్వు సిరిమల్లె పువ్వు
పలికించె నాలో రాగాల వీణ
మా అన్న చూపు మేఘాల మెరుపు
కురిపించె నాలో పన్నీటి వాన
ఇది కరగని చెరగని కలగా ఎద నిలిచెనులే కలకాలం
చిరునవ్వుల వెన్నెల సిరిగా చిగురించునులే చిరకాలం
ఈ బంధం సాగేను ఏనాటికీ ఆ దైవం దీవించు ముమ్మాటికీ

మా ఇంటి పంట చిన్నారి చెల్లి మాకంటి పాప బంగారు తల్లి
ఈ చోట ఉన్నా ఏచోట ఉన్నా ఎదలోన నిన్నే కొలిచేను అన్నా
మమకారం మనకే సొంతం విడరానిది ఈ అనుబంధం
ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ...
ఈ చోట ఉన్నా ఏచోట ఉన్నా ఎదలోన నిన్నే కొలిచేను అన్నా
మమకారం మనకే సొంతం విడరానిది ఈ అనుబంధం
ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ...
మీ స్నేహ గీతం
Comments
Post a Comment