Teneteega Songs - Kalalo Thera మీ స్నేహగీతం
’తేనెటీగ’ చిత్రం లో వెన్నెల కంటి రాసిన ప్రయోగాత్మక ప్రేమ గీతం
’తేనెటీగ’ అనే సినిమాలో ’కలలో తెర తీయాలా’ అనే తమాషా ప్రయోగం ఒకటి చేశారు వెన్నెలకంటి. ఇటువంటి ప్రయోగం అంతకుముందు ఎవ్వరూ చెయ్యలేదు. ఈ పాట పల్లవి లో ’కలలో తెర తీయాలా’ అని వుంది కదా ... ఆ ’తీయాల’ లో ’తీయ’ అనే పదాన్ని తీసుకుని ’తీయగ ఎద వేగాల’ అని ఆ తర్వాత వుంటుంది. ఆ ’ వేగాల’ తో ’వేగాలలో వేడి’ అని ఆ తర్వాత వుంటుంది. మొదటి లైన్ చివర వున్న ’తీయాల’ కి తర్వాత లైన్ లో వున్న ’తీయగ’ లో వున్న ’తీయ’ కి అర్ధాలు వేరు. ఇలా పాట మొత్తం వుంటుంది.
కలలో తెర... తీయాలా
తీయగ ఎద... వేగాలా
వేగాలలో వేడి
వేడింది వెన్నంటి
వెన్నంటి నా సోకు
సోకింది నిన్నంటి // కలలో తెర //
అంటుకున్న తీయని పగలుగ
పగలు రేయి కానీ చల్లగ
చల్లుతుంటె వలపుల జల్లుగ
ఝల్లుమంది హృదయం, అదరగ
అదరాల మధుకీల సిగ్గిల్లగా
గిల్లింది గిలిగింత తాపాలుగా
పాలించగా నీ వీక్షణం
క్షణమాగునా నా పయ్యెదా // కలలో తెర //
ఎదల సొదల కథలాపొద్దిక
పొద్దుపొడుపు అసలే ఒద్దిక
ఒద్దికైన ముద్దే వాడక
వాడుకైన వరసే తోడిక
తోడాలి నయనాలు సిరివెన్నెలా
నెలకొంది నెలవంక ఎద కోవెలా
వెల లేనిదీ విలువైనది
నది చేరిన కడలే ఇది // కలలో //
మీ స్నేహగీతం
Comments
Post a Comment