Kalake Kala Nee Andamu,Amavasya Chandrudu Song మీ స్నేహగీతం


కళకే కళ ఈ అందమూ
ఏ కవీ రాయనీ తీయనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ


నీలి కురులు పోటీ పడెను... మేఘమాలతో

కోల కనులు పంతాలాడే .. గండుమీలతో
వదనమో జలజమో...  నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీశంఖము 



కళకే కళ ఈ అందమూ



పగడములను ఓడించినవి... చిరుగు పెదవులు .. హా
వరుస తీరి మెరిసే పళ్ళు...  మల్లె తొడుగులూ
చూపులో తూపులో...  చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు



కళకే కళ ఈ అందమూ


తీగెలాగ ఊగే నడుమూ...  ఉండి లేనిదీ

దాని మీద పువ్వై పూచీ...  నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో...  కాళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము



కళకే కళ ఈ అందమూ

మీ స్నేహగీతం 



Comments