Malleswarive Song - Yuvasena Movie మీ స్నేహగీతం
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో
తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో
తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవా
చిక్కులు పెట్టే అల్లికవా
పోలికలో పసిబాలికవే
చురకత్తుల చూపులున్నా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
నీ కళ్ళ నింగిలో పున్నాల పొంగులో
వేవేల తారకలే జలకమాడుతున్నవో
నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో
సింగారి చెంపలో కెంజాయి సొంపులో
వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో
నిదరలో ఉదయం ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో
చూపుతోందె సోయగమా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే .. హో
కొల్లేటి సరస్సులో తుళ్ళేటి చేపలై
రంగేళి కులుకులెన్నోతళుకులీనుతున్నవే
నా కొంగ జపము చూసి ఉలికి పడుతు ఉన్నవే
ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా
ఏ వైపు చూపు తిప్పనీక చంపుతున్నవే
వదలదే హృదయం కదలదే నిమిషం
చిగురు పెదవి చిలిపి స్వరము
తెలపవె సౌందర్యమా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో
తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో
తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవా
చిక్కులు పెట్టే అల్లికవా
పోలికలో పసిబాలికవే
చురకత్తుల చూపులున్నా
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే .. హో
మీ స్నేహగీతం
Comments
Post a Comment