Ladies Tailor / missed song / లేడీస్ టైలర్ / vamsy director
"లేడీస్ టైలర్"
ఆ సినిమాలోని పాటలకి సాహిత్యం అందించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం అందించింది ఇళయరాజా గారు, దర్శకుడు వంశీ. కాబట్టి ఆ సినిమాలో పాటలకి ఒక్క స్థాయి ప్రజాదరణ పొంది ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు. అవును ఆ సినిమాలో చాలా పాటలు చాలా ప్రజాదరణ పొందాయి. ఇప్పటికి చాలా మంది వాటిని వింటూ పాడుతూ ఉంటారు కూడా. కానీ నేను చెప్పే పాట ఇప్పుడు మరుగున పడిపోయింది.
ఆ సినిమా విడుదలయ్యిన కొత్తలో ఆ పాట ఏమైనా ప్రజాదరణ పొంది ఉంటది ఏమో కానీ ఆ విషయం నాకు తెలీదు. తరువాత కాలంలో రేడియోలో, టేప్ రికార్డర్లలో, ఆ సినిమాలో వేరే పాటలు జనం వినడం చూసా కానీ ఈ పాట మాత్రం అంతగా ప్రాచుర్యం పొందలేదు
దానిలో "గోపి లోల నీ పాల పడ్డామురా", "ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందో లక్కులు తెచ్చే చుక్క", "అలవాటిది పొరపాటిది గుంజీలే తీసేయనా", "హాయమ్మ హాయమ్మ" ఈ పాటలు అన్ని హిట్ అయ్యాయి. కానీ చాలా మందికి "లేవరా లేవరా సుందర సుందర" అనే ఒక్క పాట ఉంది అని కూడా తెలీదు.
ఆడియో టేప్ మీద కూడా నాలుగు పాటల గురించే ఇచ్చారు కానీ, ఈ పాట పాట లేదు
ఆ పాటలో అంత గొప్ప సంగీతం కానీ దృశ్యాలు కానీ లేవు కాకపోతే పాటలోని సాహిత్యం, పల్లెటూరి పదాలు, యాస నాకు చాలా ఇష్టం. బద్ధకాన్ని వదలమనే నీతిని చెప్పే పాట అది. చలన చిత్రం మొదట్లో పేర్లు పడుతున్నప్పుడు బాక్గ్రౌండ్లో వచ్చే పాట అది.
ఈ పాటలో పల్లవి అనేది ఏది లేదు. ఏ వాక్యాలు మళ్లీ మళ్లీ రావు.
Comments
Post a Comment