అలై పొంగేరా కన్నా / సఖి / ఊత్తుక్కాడు వేంకట కవి / వేటూరి
మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు తెలియకుండా కథనో, కధనం తోనో ముడిపడిపోయి ఉంటాము ..ఇలా ఫ్లో లో మనం కొట్టుకుని పోతున్నప్పుడు మన ముందు నుండి ఒక్కోసారి కొన్ని అద్భుతాలు మనకు తెలియకుండా జారిపోతాయి..కాస్త పాటల మీదనో , సంగీత సాహిత్యాభిలాష ఉంటె తప్ప మనలాంటి వారికి వాటిని పట్టుకోవటం సాధ్యం కాదు..
అలాంటి ఒక అద్భుతమే ఈ సఖి సినిమా లో ఉంటుంది..
ఈ సినిమా లో హీరో తన ఇంట్లో ఉన్న ఫంక్షన్ కి హీరొయిన్ ని రమ్మని పిలుస్తాడు కదా..ఆమె వస్తుంది..అప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట మాత్రం రెహ్మాన్ నో వైరముత్తు నో కాదు రాసి ట్యూన్ చేసింది...
18 శతాబ్దం లోని ఊత్తుక్కాడు వేంకట కవి అలియాస్ ఊత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్..
తమిళనాడు లోని దక్షిణ ద్వారకగా పేరుపొందిన మన్నార్ కుడి అనే ఊరిలో జన్మించారు. పుట్టినది తల్లిగారి స్వస్థలమైన మన్నారికుడి అయినా పెరిగినదంతా పాపనాశం సమీపానున్న దేనుజవాసపురం అనమ్బడే ఊత్తుక్కాడు గ్రామంలోనే.అందుకే ఆయన పేరు ఊత్తుక్కాడు వేంకట కవి గా పిలుస్తారు .
వారి తమిళ కీర్తన ఇది, దానినే తమిళ సినిమాలో యథాతథంగా వాడుకున్నారు. అయితే తెలుగులో దీనిని వేటూరి గారు రాశారు, అసలు ఈ పాట ఏదో సినిమా కోసం రాసిన పాటలాగే అనిపించదు, నిజంగా ఎవరో వాగ్గేయకారుడే రాసినట్టు ఉంటుంది, అంత అద్భుతంగా సాహిత్యాన్ని అందించారు వేటూరి గారు.
అలై పొంగేరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
అలై పొంగేరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
అలై కన్నా..
నిలబడి వింటూనే చిత్తరువైనాను - నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొర - ప్రాయమున యమున మురళీధర
యవ్వనమలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ
కన్నుల వెన్నెల పట్టపగలు పాల్చిలుకుగా - కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నెమోమున కనుబొమ్మలటు పొంగే - కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే - కన్నెవయసు కళలోలికే వేళలో
కన్నెసొగసు ఒక విధమై ఒరిగేలే - అనంతమనాది వసంతపదాల
సరాగ సరాల స్వరానివా - నిశాంత మహీజ శకుంతమరంద
మెడారి గళాన వర్షించవా!
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన - వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కథాకళి కళలిడు - శశికిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు - రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలే ఆవేదననో - ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో - ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా
(పోస్ట్ సహకరణ బాలు )
Comments
Post a Comment