సిన్ని సిన్ని కోరికలడగ / "స్వయంకృషి" / సిరివెన్నెల
సిన్ని సిన్ని కోరికలడగ..
అద్భుతమైన ఈ సాహిత్యాన్ని చూసి చాలామంది అన్నమయ్య గారిదేమో అనుకునే ఉద్దేశ్యం లేకపోలేదు, దానిలో ఉన్న సాహిత్యం అలాంటిది .నిజానికి ఈ పాట రాసింది సిరివెన్నెల గారు. పైగా తన పెళ్ళికి తనూ, వరుడిని వధువే ముస్తాబు చేసే సమయంలో వచ్చే పాట.ఇలాంటి సందర్భం లో మన తెలుగు పాటలు చాలా అరుదు.
సమాజానికి ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ మీకు తెలిసిందే .ఒక ఫుట్‌పాత్‌పై బ్యాగులు, చెప్పులు కుట్టే కార్మికుడు ఏలూరు లో తన దుకాణానికి "స్వయంకృషి" అని పేరు పెట్టుకునేంత ..
ఇంకో విశేషం ఏమిటంటే సిరివెన్నెల గారు విశ్వనాధ్ గారితో ప్రయాణం చేస్తూ ఉండగా కోయంబత్తూర్ లో ఫ్లయిట్ లేట్ అవ్వటం తో ఈ పాట సందర్భం గురించి చెప్పగా చెన్నై లో ల్యాండ్ అయ్యే సరికి ఈ పాటని సిరివెన్నెల గారు అందించారు
సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
కళల ఒరుపులే కస్తురిగా
వలపు వందనపు తిలకాలూ..ఊఊ..
వలపు వందనపు తిలకాలు
అంకము జేరిన పొంకాలే
అంకము జేరిన పొంకాలే
శ్రీవేంకటపతికికా వేడుకలు..
ఉహు.. ఉహూ... ఉ
సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా.
Comments
Post a Comment