తాయే యశోద ..షబానా అజ్మి..మార్నింగ్ రాగా..
తాయే యశోద ..షబానా అజ్మి..
'' మార్నింగ్ రాగా ''
ఈ సినిమా గురించి మీరు వినే ఉంటారు.
నిజానికి ఈ చిత్రం లోని పాటలు అన్నీ కర్ణాటక సంప్రదాయం లో ,సాహిత్యం కూడా ఎక్కువగా ఆలాపనలు ,కీర్తనలు ఉంటాయి.సంగీత నేపధ్యం తో వచ్చిన సినిమా కాబట్టి..
కధ ఇంతవరకూ బాగానే ఉంది అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే రెగ్యులర్ గా సినిమాలలో పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్స్ సాహిత్యానికి అనుగుణం గా లిప్ సింక్ ఇవ్వటం రెగ్యులర్ గా జరిగే పద్ధతి..కానీ ఈ సినిమా సంగీత నేపధ్యం తో కూడినది కావున ఎక్కువగా కీర్తనలు, ఆలాపనలు ఉన్నాయి..ఇటు షబానా అజ్మి గారికి ఈ కన్నడ కీర్తనలపై పట్టు లేదు.లిప్ సింక్ కూడా ఇవ్వలేని పరిస్థితి .అప్పుడు వారి భర్త అయిన జావేద్ అఖ్తర్ గారు నీకు నీవు గా లిప్ సింక్ ఇవ్వలేకపోతే ఈ సినిమా నీవు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పారు.పైగా కొంత ఆయన కూడా నేర్పారు. ఇదే చిత్రం లోని ఈమె సాటి నటి రంజని గారు చాలా సహాయం చేసారు .కేవలం మహా గణపతిమ్ కె ఏకం గా 18 సిట్టింగ్స్ వేస్తే కానీ లిప్ సింక్ ఇవ్వలేకపోయారు..ఇక అసలు కష్టం అయిన తాయే యశోద కి ఏకంగా వారాల సమయం పట్టింది..షబానా అజ్మి గారు చాలా కష్టపడి కర్ణాటక సంగీతం , కొన్ని కీర్తనలు, ఆలాపనలు నేర్చుకుంటే కానీ ఈ సినిమా పాటల చిత్రీకరణ జరగలేదు.అంత డెడికేషన్ గా నేర్చుకుని కష్టపడి చేస్తేనే కానీ సినిమా చిత్రీకరణ లో నిజం గా ఆమె పాడుతున్నట్లు ఉంటుంది.
Comments
Post a Comment