Naa Inti Mundunna Song | Gentleman Movie | By Mee Snehageetham
'' జెంటిల్మేన్ '' చిత్రం రెహ్మాన్‌కి ఎంత పేరు తెచ్చిందో మనందరికీ తెలిసినదె.
ఈ చిత్రంలోని ఒక మధురమైన పాట నా ఇంటిముందున్న పూదోటనడిగేవో అన్న దానిలో హంసధ్వని అందాలు తొంగి చూస్తాయి. పల్లవికీ మొదటి చరణానికి మధ్యలో వాయిద్యాన్ని వినండి. వాతాపి గణపతిం గుర్తుకొస్తుంది.
నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో..
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే..
నువ్వేనా ప్రాణమే..
నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట..
మనసార చేరే వేళ మౌనాలే తగదంట..
సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట..
వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట..
ఆషాఢం పోయిందో గోదారి పొంగెనో..
వైశాఖం వచ్చిందో అందాలే పూచేనో..
ఈడే సద్దు చెసెనో..
నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో..
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే..
నేనే నీ ప్రాణమే..
గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది..
మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది..
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేను..
చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను..
ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి..
కలలన్ని పండించే ముద్దుల్లో తేలాలి..
మ్ హుమ్ మ్..పరవశమే..ఈ చిత్రంలోని ఒక మధురమైన పాట నా ఇంటిముందున్న పూదోటనడిగేవో అన్న దానిలో హంసధ్వని అందాలు తొంగి చూస్తాయి. పల్లవికీ మొదటి చరణానికి మధ్యలో వాయిద్యాన్ని వినండి. వాతాపి గణపతిం గుర్తుకొస్తుంది.
Comments
Post a Comment