Yamuna teerana Radha madilona - gouravam - By Mee Snehageetham
యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా..

హృదయం తెలుపు ఊహలలో.. రాగం నిలుపు ఆశలలో..
తేనెల తేటల తీయని భావన.. ఊరెను నా మనసులో..
యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా..
ఎదలో తలపే... వణికెనులే
అధరం మధురం... చిలికెనులే
రాధా హృదయం... మాధవ నిలయం
యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా..
మనసే నేడు వెనుకాడే.. హృదయం విరిసి కదలాడే
లోలో భయము తొణికేనే.. ఎదలో సుఖము విరిసేనే
పందిరిలో నిను పొందెద ఆ దినం.. ఆ దినమే పండుగ
యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా....
కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా..
Comments
Post a Comment