Swathi Muthyapu Jallulalo - Prema Yuddham Movie - By Mee Snehageetham
హంసలేఖ గారి సంగీత దర్సకత్వం లో వచ్చిన ఒక మరపు రాని మధురమైన పాట మీ కోసం .
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ ముసురేసిందమ్మా కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మ తనువు తనువు కలిపి తనతో సగమే చెరిపి చలిగాలేం చేస్తుంది చెలికాడే తోడుంటే ఆ మెరుపులకే మెలి తిరిగే సొగసులతో ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో కురిసింది వాన తొలిగా పరువాన స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే మతిపోయిందమ్మా మనసు మనసూ కలిసి, కథలు కళలు తెలిసి జలపాతం నీవైతే అల గీతం నేనేలే కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసి, దివిని భువిని కలిపి విరితారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో కురిసింది వాన తొలిగా పరువాన స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ
Comments
Post a Comment