Sogasu Chooda Tarama Song -Mister Pellam - By Mee Snehageetham
సొగసు చూడతరమా ... సొగసు చూడతరమా
నీ సొగసు చూడతరమా ... నీ సొగసు చూడతరమా
నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు ఎర్రన్ని కోపాలు
ఎన్నెల్లో దీపాలు అందమే సుమా
సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా
అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వెన్నకు బేజారుగ వంగినపుడు
చిరు కోపం చీర గట్టి సిగ్గును చెంగున దాచి
ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెట్టినపుడు
ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా
పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించి కొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ
చెంగుబట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే
తడిబారిన కన్నులతో విడు విడు అంటున్నప్పుడు
విడు విడుమంటున్నప్పుడు
ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా
పసిపాపకు పాలిస్తూ పరవశించి ఉన్నపుడు
పెద పాపడు పాకి వచ్చి మరి నాకూ అన్నపుడు
మొట్టికాయ వేసి ఛి పోండి అన్నప్పుడు
నా ఏడుపు నీ నవ్వులు హరివిల్లై వెలసినపుడు
ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా
సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి
క్షణమే యుగమై వేచి వేచి
చలి పొంగులు తొలి కోకల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులు వాచి
నిట్టూర్పున నిశి రాత్రిలో నిదరోవు అందాలతో
త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి
సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా
Comments
Post a Comment