Posts

Showing posts from 2021

క్షణ క్షణం / జాము రాతిరి / rekindled / Madhavi Raju,మీ స్నేహగీతం,మాధవీయం

Image
  క్షణ క్షణం సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ‘జాము రాతిరి జాబిలమ్మా.. జోల పాడనా’ సాంగ్. ఆ పాట 1990 ఆగస్టు 13న రికార్డింగ్ చేశారు. మొన్నటి 2019 ఆగస్టు 13న 29 ఏళ్లు పూర్తయింది. దీంతో సింగర్స్ హేమచంద్ర, కాలభైరవ, మనీషా, దీపు, దామిని, మౌనిమ, శ్రుతి, నోయల్, పృథ్వీ చంద్ర ‘జాము రాతిరి జాబిలమ్మా..’ పాటను మరోసారి మనకు కళ్లకు కట్టేలా తీసుకొచ్చారు. గతంలో వచ్చిన ఒరిజినల్ సాంగ్ రికార్డ్ సమయంలో ఈ సింగర్స్ కొందరు పుట్టకపోవడం గమనార్హం. అయినా ఆ మ్యూజికల్ హిట్ కోసం వారు చేసిన ప్రయత్నాన్ని వీక్షిద్దామా? Madhavi Raju , మీ స్నేహగీతం , మాధవీయం

criminal / తరిమిన ఆరు కాలాలు / Madhavi Raju / మాధవీయం

Image
  ''తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో '' సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట అంటేనే ఆనందంగా వినటం,ఆయన రాసిన మాటల లోతును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం. తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో అనటంలో చాలా గొప్ప భావన, కవితాత్మక దృష్టి ఉన్నది. ముందుగా ఆరు కాలాలు అని ఎందుకన్నారు అంటే ఈ భూలోకంలోని వాతావరణాన్ని బట్టి రుతువులు ఉంటాయి. ఆ రుతువుల్ని బట్టే మనుషుల మనస్తత్వాలు ఉంటాయి. ప్రకృతికి తగ్గట్టే మనిషి ఉంటాడన్న వాస్తవం. అలాంటి ఆరు కాలాలూ, ఏడు లోకాలూ చేరలేని ఒడిలోకి చేరిపోదాం అనటంలో అనంతమైన ప్రేమలో ఐక్యం అయిపోదాం అన్న అద్వైత భావన కూడా కనబడుతుంది. దాంపత్య జీవితానికున్న అంతిమ లక్ష్యం ఆ పరబ్రహ్మ తత్వమైన జీవుడు పరమాత్మలోకి విలీనం అయిపోవటం అన్నదే కదా. ఆరు కాలాలు అంటే ఆరు రుతువులు అని. (వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర రుతువులు ఆరు) ఏడు లోకాలు అంటే ఊర్ధ్వ లోకాలు ఏడు అని. (భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం) కాలం మనిషి తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అలాగే మనిషి ఉండే లోకం కూడా తన ఆలోచనలకు కారణభూతం అవుతుంది. కాలానికి, లోకా...

Ladies Tailor / missed song / లేడీస్ టైలర్ / vamsy director

Image
  "లేడీస్ టైలర్" ఆ సినిమాలోని పాటలకి సాహిత్యం అందించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం అందించింది ఇళయరాజా గారు, దర్శకుడు వంశీ. కాబట్టి ఆ సినిమాలో పాటలకి ఒక్క స్థాయి ప్రజాదరణ పొంది ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు. అవును ఆ సినిమాలో చాలా పాటలు చాలా ప్రజాదరణ పొందాయి. ఇప్పటికి చాలా మంది వాటిని వింటూ పాడుతూ ఉంటారు కూడా. కానీ నేను చెప్పే పాట ఇప్పుడు మరుగున పడిపోయింది. ఆ సినిమా విడుదలయ్యిన కొత్తలో ఆ పాట ఏమైనా ప్రజాదరణ పొంది ఉంటది ఏమో కానీ ఆ విషయం నాకు తెలీదు. తరువాత కాలంలో రేడియోలో, టేప్ రికార్డర్లలో, ఆ సినిమాలో వేరే పాటలు జనం వినడం చూసా కానీ ఈ పాట మాత్రం అంతగా ప్రాచుర్యం పొందలేదు దానిలో "గోపి లోల నీ పాల పడ్డామురా", "ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందో లక్కులు తెచ్చే చుక్క", "అలవాటిది పొరపాటిది గుంజీలే తీసేయనా", "హాయమ్మ హాయమ్మ" ఈ పాటలు అన్ని హిట్ అయ్యాయి. కానీ చాలా మందికి "లేవరా లేవరా సుందర సుందర" అనే ఒక్క పాట ఉంది అని కూడా తెలీదు. ఆడియో టేప్ మీద కూడా నాలుగు పాటల గురించే ఇచ్చారు కానీ, ఈ పాట పాట లేదు ఆ పాటలో అంత గొప్ప సంగీతం కా...

valmiki / గగన వీధిలో / mickey j meyer / కవిత నీవే

Image
మిక్కీ జె మేయర్ అందించిన ఒక మంచి పాట.. గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల దీవిని వీడుతూ దిగిన వేళలో కలలొలికిన సరసుల అడుగేసినారు అతిథుల్లా అది చూసి మురిసే జగమెల్ల అలలాగా లేచి పడుతున్నారీవేలా కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల రమ్మని పిలిచాక కమ్మనిదిచ్చాక కిమ్మని ఆనదింకా నమ్మని మానసింకా కొసరిన కౌగిలింతక వయసుకు ఇంత వేడుక ముగిసిన ఆసకాంత గోల చేయకా కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే నాననాననా ననన నాననాననా ననన నాననాననా ననన నా నడిచిన దారంతా మన అడుగుల రాత చదవదా జగమంతా అది తెలిపే గాథ కలిపినా చేయిచేయినీ చెలిమిని చేయనీ అని తెలిపిన ఆ పదాల వెంట సాగనీ కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల Madhavi Raju , మీ స్నేహగీతం , మాధవీయం

మీరా / o butterfly / asha bhonsle / ఆశా భోంస్లే

Image
 మీరా -  ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా నిజానికి ఇళయరాజా ఈ బటర్ ఫ్లై పాట మాత్రం తమిళ నాట మోగుతూనే ఉంటుంది ..మంద్రమైన సంగీతం, బాలు గారి గొంతులో..తమిళం లో పాడింది ఆశా భోంస్లే గారు,కానీ తెలుగు లో బహుశా చిత్ర గారు..డబ్బింగ్ సినిమా అవటం తో క్లారిటీ సరిగ్గా ఉండదు తెలుగు లో..కానీ బాలు గారి ట్రాక్ మాత్రం చాలా అద్భుతం గా ఉంటుంది . తమిళం లో  ఈ పాట మీకోసం   ↓ తెలుగు  లో  ఈ పాట మీకోసం  ↓

తాయే యశోద ..షబానా అజ్మి..మార్నింగ్ రాగా..

Image
 తాయే యశోద ..షబానా అజ్మి.. '' మార్నింగ్ రాగా '' ఈ సినిమా గురించి మీరు వినే ఉంటారు. నిజానికి ఈ చిత్రం లోని పాటలు అన్నీ కర్ణాటక సంప్రదాయం లో ,సాహిత్యం కూడా ఎక్కువగా ఆలాపనలు ,కీర్తనలు ఉంటాయి.సంగీత నేపధ్యం తో వచ్చిన సినిమా కాబట్టి.. కధ ఇంతవరకూ బాగానే ఉంది అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే రెగ్యులర్ గా సినిమాలలో పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్స్ సాహిత్యానికి అనుగుణం గా లిప్ సింక్ ఇవ్వటం రెగ్యులర్ గా జరిగే పద్ధతి..కానీ ఈ సినిమా సంగీత నేపధ్యం తో కూడినది కావున ఎక్కువగా కీర్తనలు, ఆలాపనలు ఉన్నాయి..ఇటు షబానా అజ్మి గారికి ఈ కన్నడ కీర్తనలపై పట్టు లేదు.లిప్ సింక్ కూడా ఇవ్వలేని పరిస్థితి .అప్పుడు వారి భర్త అయిన జావేద్  అఖ్తర్ గారు నీకు నీవు గా లిప్ సింక్ ఇవ్వలేకపోతే ఈ సినిమా నీవు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పారు.పైగా కొంత ఆయన కూడా నేర్పారు. ఇదే చిత్రం లోని ఈమె సాటి నటి రంజని గారు చాలా సహాయం చేసారు .కేవలం మహా గణపతిమ్ కె ఏకం గా 18 సిట్టింగ్స్ వేస్తే కానీ లిప్ సింక్ ఇవ్వలేకపోయారు..ఇక అసలు కష్టం అయిన తాయే యశోద కి ఏకంగా వారాల సమయం పట్టింది..షబానా అజ్మి గారు చాలా కష్టపడి కర్ణాటక సంగ...

అలై పొంగేరా కన్నా / సఖి / ఊత్తుక్కాడు వేంకట కవి / వేటూరి

Image
మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు తెలియకుండా కథనో, కధనం తోనో ముడిపడిపోయి ఉంటాము ..ఇలా ఫ్లో లో మనం కొట్టుకుని పోతున్నప్పుడు మన ముందు నుండి ఒక్కోసారి కొన్ని అద్భుతాలు మనకు తెలియకుండా జారిపోతాయి..కాస్త పాటల మీదనో , సంగీత సాహిత్యాభిలాష ఉంటె తప్ప మనలాంటి వారికి వాటిని పట్టుకోవటం సాధ్యం కాదు.. అలాంటి ఒక అద్భుతమే ఈ సఖి సినిమా లో ఉంటుంది.. ఈ సినిమా లో హీరో తన ఇంట్లో ఉన్న ఫంక్షన్ కి హీరొయిన్ ని రమ్మని పిలుస్తాడు కదా..ఆమె వస్తుంది..అప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట మాత్రం రెహ్మాన్ నో వైరముత్తు నో కాదు రాసి ట్యూన్ చేసింది... 18 శతాబ్దం లోని ఊత్తుక్కాడు వేంకట కవి అలియాస్ ఊత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్.. తమిళనాడు లోని దక్షిణ ద్వారకగా పేరుపొందిన మన్నార్ ‍ కుడి అనే ఊరిలో జన్మించారు. పుట్టినది తల్లిగారి స్వస్థలమైన మన్నారికుడి అయినా పెరిగినదంతా పాపనాశం సమీపానున్న దేనుజవాసపురం అనమ్బడే ఊత్తుక్కాడు గ్రామంలోనే.అందుకే ఆయన పేరు ఊత్తుక్కాడు వేంకట కవి గా పిలుస్తారు . వారి తమిళ కీర్తన ఇది, దానినే తమిళ సినిమాలో యథాతథంగా వాడుకున్నారు. అయితే తెలుగులో దీనిని వేటూరి గారు రాశారు, అసలు ఈ పాట ఏదో సినిమా కోసం రాస...

సిన్ని సిన్ని కోరికలడగ / "స్వయంకృషి" / సిరివెన్నెల

Image
 సిన్ని సిన్ని కోరికలడగ.. అద్భుతమైన ఈ సాహిత్యాన్ని చూసి చాలామంది  అన్నమయ్య గారిదేమో అనుకునే ఉద్దేశ్యం లేకపోలేదు, దానిలో ఉన్న సాహిత్యం అలాంటిది .నిజానికి ఈ పాట రాసింది సిరివెన్నెల గారు. పైగా తన పెళ్ళికి తనూ, వరుడిని వధువే ముస్తాబు చేసే సమయంలో వచ్చే పాట.ఇలాంటి సందర్భం లో మన తెలుగు పాటలు చాలా అరుదు. సమాజానికి ఈ  సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ మీకు తెలిసిందే .ఒక ఫుట్‌పాత్‌పై బ్యాగులు, చెప్పులు కుట్టే కార్మికుడు ఏలూరు లో తన దుకాణానికి "స్వయంకృషి" అని పేరు పెట్టుకునేంత .. ఇంకో విశేషం ఏమిటంటే సిరివెన్నెల గారు విశ్వనాధ్ గారితో ప్రయాణం చేస్తూ ఉండగా కోయంబత్తూర్ లో ఫ్లయిట్ లేట్ అవ్వటం తో ఈ పాట సందర్భం గురించి చెప్పగా చెన్నై లో ల్యాండ్ అయ్యే సరికి ఈ పాటని సిరివెన్నెల గారు అందించారు  సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటా కళల ఒరుపులే కస్తురిగా వలపు వందనపు తిలకాలూ..ఊఊ.. వలపు వందనపు తిలకాలు అంకము జేరిన పొంకాలే అంకము జేరిన పొంకాలే శ్రీవేంకటపతికికా వేడుకలు.. ఉహు.. ఉహూ... ఉ సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ అన్నులమిన్న అలమేలుమంగ...

‘నాంది పలకడం’ అంటే తెలుసా ? నాట్యం చేసే ముందు భూమికి ఎందుకు నమస్కరిస్తారో తెలుసా?

Image
‘నాంది పలకడం’ అంటే తెలుసా ? నాట్యం చేసే వారు తమ నాట్యాన్ని ప్రారంభించటానికి ముందు తల్లిదండ్రులకు గురువులకు, అతిథులకు నమస్కరిస్తారు. నాట్యం చేసే ముందు భూమికి ఎందుకు నమస్కరిస్తారో తెలుసా?- ఆ తర్వాత సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే | విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదఘాతం క్షమస్వమే|| అంటూ భూదేవికి నమస్కారం చేస్తారు. అంటే సాక్షాత్తు విష్ణు పత్ని అయిన అమ్మ వారిపైన పదఘట్టనలు చేస్తున్నందుకు క్షమాపణ కోరుకుంటారు. ఇది సాధారణంగా ప్రచారం లో ఉన్న విషయం. కానీ నాట్యానికి ముందు భూదేవికి నమస్కరించడానికి మరో ఆసక్తికరమైన అద్భుతమైన కారణం ఉంది. పరమ శివుడు సంధ్యా నాట్యం చేస్తున్నప్పుడు నంది తన వీపుని వేదికగా పరిచాడు. ఆ వేదికపై శివుడు మైమరచి నాట్యం చేసారు. ఆ నటరాజ పూజ అయిన నాట్యాన్ని చేసే ముందు, ఆయన నర్తించడానికి తన వీపును రంగస్థలం గా చేసిన నందికి ప్రథమ నమస్కారం చేస్తారు.శివపూజలో నందికి ప్రథమ నమస్కారం చేయడం అందరికీ తెలిసిన విషయమే. అందుకే దాన్ని ‘నాంది’ అంటారు. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ‘నాంది పలకడం’ అన్న మాట ఇక్కడినుంచే వచ్చింది. నాట్యం చేసేముందు భూమికి నమస్కరించడం వెనుక గల ప్రధాన కారణం ఇదే. Madhavi Raju , మీ స్నేహ...