criminal / తరిమిన ఆరు కాలాలు / Madhavi Raju / మాధవీయం
''తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో ''
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట అంటేనే ఆనందంగా వినటం,ఆయన రాసిన మాటల లోతును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం.
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో అనటంలో చాలా గొప్ప భావన, కవితాత్మక దృష్టి ఉన్నది.
ముందుగా ఆరు కాలాలు అని ఎందుకన్నారు అంటే ఈ భూలోకంలోని వాతావరణాన్ని బట్టి రుతువులు ఉంటాయి. ఆ రుతువుల్ని బట్టే మనుషుల మనస్తత్వాలు ఉంటాయి. ప్రకృతికి తగ్గట్టే మనిషి ఉంటాడన్న వాస్తవం.
అలాంటి ఆరు కాలాలూ, ఏడు లోకాలూ చేరలేని ఒడిలోకి చేరిపోదాం అనటంలో అనంతమైన ప్రేమలో ఐక్యం అయిపోదాం అన్న అద్వైత భావన కూడా కనబడుతుంది. దాంపత్య జీవితానికున్న అంతిమ లక్ష్యం ఆ పరబ్రహ్మ తత్వమైన జీవుడు పరమాత్మలోకి విలీనం అయిపోవటం అన్నదే కదా.
ఆరు కాలాలు అంటే ఆరు రుతువులు అని.
(వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర రుతువులు ఆరు)
ఏడు లోకాలు అంటే ఊర్ధ్వ లోకాలు ఏడు అని.
(భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం)
కాలం మనిషి తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
అలాగే మనిషి ఉండే లోకం కూడా తన ఆలోచనలకు కారణభూతం అవుతుంది.
కాలానికి, లోకానికి అతీతమైన ప్రేమగా ఈ పాటలోని వీరి ప్రేమను అభివర్ణించటంలోనే సీతారామ శాస్త్రి గారి భావుకత దాగుంది.
Comments
Post a Comment