Madhura Murali Hrudaya Ravali - Oka Radha Iddaru Krishnulu - by mee snehageetham
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
మధుర మురళి హృదయ రవళి
యదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో
పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో
నాజూకులన్నీ నాకే దక్కేవేళల్లో
పగలో అవతారం రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ
రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం
మధుర మురళి హృదయ రవళి
యదలు పలకు ప్రణయ కడలి సాగే సుడిరేగే
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
హేమంత వేళల్లో లేమంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే
ముద్దే మందారం మనసే మకరందం
సిగ్గే సింధూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే
పాటే అనురాగము మన బాటే
ఓ అందాల అనుబంధం
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా
మీ స్నేహ గీతం
Comments
Post a Comment