Teliyaniragam palikindi - Mamatala Kovela - by mee snehageetham
తెలియని రాగం పలికింది తీయని భావనలో
తెలియని రాగం పలికింది తీయని భావనలో
మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో
ఈ మమతల కోవెలలలో
తెలియని రాగం పలికింది తీయని భావనలో
ఆకాశ దీపానివై నా కోసమే రమ్మని
నా గుండె గుడిగంటలో నాధానివే నీవని
గోరంత పసుపెట్టి ఊరంత కబురెట్టే శ్రీవారే రావాలని
కుంకుమతో కుశలమని పారాణే పదిలమని
దీవించు దేవుల్లే మా ఇంటివారని
తెలియని రాగం పలికింది తీయని భావనలో
మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో
ఈ మమతల కోవెలలలో
ఏ జన్మకే గమ్యమో తెలిసేది కాలానికే
ఏ పువ్వు ఏ పూజకో తెలిసేది దైవానికే
ఏ జన్మకేమైన ఈ జన్మలో నీకు ఖైదీనే అయ్యానుగా
బ్రతుకైనా వెతలైనా జతగానే పంచుకునే శ్రీవారే కావాలి ఏ జన్మకైనా
తెలియని రాగం పలికింది తీయని భావనలో
మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో
ఈ మమతల కోవెలలలో
తెలియని రాగం పలికింది తీయని భావనలో
మీ స్నేహ గీతం
Comments
Post a Comment