స్వరరాగ గంగా ప్రవాహమే swararaga ganga pravahame postby madhaviraju
"సరిగమలు" అనే చిత్రం కోసం వేటూరి గారు రాసిన పాట "స్వరరాగ గంగా ప్రవాహమే"
ఇందులో వేటూరిగారు మొదటి చరణంలో "కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి" అన్నారు.
ఇదేమీ సామాన్య సినిమా పాట లోని చరణం కాదు .
"శరీరం ఒక మట్టి కుండ, అందరి శరీరాలు మట్టి కుండల వంటివే, లోపల ఉండే శూన్యం అంతా ఆకాశమే, కుండల వేరయినా ఆకాశం వేరు కాదు అలాగే దేహాలు వేరయినా ఆత్మలు వేరు కావు" అంటుంది ఘటాకాశ సిద్ధాంతం.
Comments
Post a Comment