Ladies Tailor / missed song / లేడీస్ టైలర్ / vamsy director
"లేడీస్ టైలర్" ఆ సినిమాలోని పాటలకి సాహిత్యం అందించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం అందించింది ఇళయరాజా గారు, దర్శకుడు వంశీ. కాబట్టి ఆ సినిమాలో పాటలకి ఒక్క స్థాయి ప్రజాదరణ పొంది ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు. అవును ఆ సినిమాలో చాలా పాటలు చాలా ప్రజాదరణ పొందాయి. ఇప్పటికి చాలా మంది వాటిని వింటూ పాడుతూ ఉంటారు కూడా. కానీ నేను చెప్పే పాట ఇప్పుడు మరుగున పడిపోయింది. ఆ సినిమా విడుదలయ్యిన కొత్తలో ఆ పాట ఏమైనా ప్రజాదరణ పొంది ఉంటది ఏమో కానీ ఆ విషయం నాకు తెలీదు. తరువాత కాలంలో రేడియోలో, టేప్ రికార్డర్లలో, ఆ సినిమాలో వేరే పాటలు జనం వినడం చూసా కానీ ఈ పాట మాత్రం అంతగా ప్రాచుర్యం పొందలేదు దానిలో "గోపి లోల నీ పాల పడ్డామురా", "ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందో లక్కులు తెచ్చే చుక్క", "అలవాటిది పొరపాటిది గుంజీలే తీసేయనా", "హాయమ్మ హాయమ్మ" ఈ పాటలు అన్ని హిట్ అయ్యాయి. కానీ చాలా మందికి "లేవరా లేవరా సుందర సుందర" అనే ఒక్క పాట ఉంది అని కూడా తెలీదు. ఆడియో టేప్ మీద కూడా నాలుగు పాటల గురించే ఇచ్చారు కానీ, ఈ పాట పాట లేదు ఆ పాటలో అంత గొప్ప సంగీతం కా...