నువ్వొ రాయి నేనో శిల్పి//Nuvvo rai nenu shilpi //full song



మనిషిని,మనసుని కదిలించే శక్తి సంగీత సాహిత్యానికి ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాట.
ఒక్క పాటతో అన్ని వృత్తుల వాళ్లపైన గౌరవం వచ్చేలా చేశారు
మాటలకందని మౌనరాగం...
ఒక ప్రయివేట్ ఆల్బం లో ఇంత సులువైన పదాలతో ఇంకా సుతిమెత్తని దెబ్బ అంటరానితనం పై ..
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు
ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని
నేనో అంటరానివాడిని
నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు
ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని
నేనో అంటరానివాడిని
నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి
అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి
నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని
కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని
నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు
సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు
కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు
ఏంటయ్యా మా రాతలు
నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని
కానీ మలిన పడినావాడివంటూ దూరంగా ఉండాలంటివి
నీ ముందు వెలిగే దీపంతలు నాచెమటతో చేస్తిని
కానీ ఎందుకో మా మట్టి బతుకున ఏ దీపం పెట్టవైతివి
నోరే లేని మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగలి ఇస్తివి
ఇపుడు వాటికి మాకూ ఏ తేడాలే లేవన్నట్టు సులనకగా వెనకబడేస్తివి
తల్లిపాలవంటి తాటి కళ్ళు గీసే నా గోసలు చుడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్లకు నిన్నే మోసే
భాగ్యాన్నే ఇవ్వవైతివి
నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికి నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తివి
మా పుట్టుకమాట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి
కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి
Mee Snehageetham,
Madhavi Raju
lyirics-Singer-Music : Charan Arjun


Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham