Subhodayam Movie/ Kanchiki Potaavaa Video Song/ mee snehageetham /madhaviraju
“శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు.
దీని మాతృక ''వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట'' అయిన
కంచికి పోతావా కృష్ణమ్మా!ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ;
ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.
బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి యింటిది అప్పు;
ఆ - అప్పు నాకు పెట్టు పప్పు.
పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా?
అనే పిల్లల పాట నుండి స్పూర్తిగా తీసుకుని మన వేటూరి గారు రాసిన పాట ఇది
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా!
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా!
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా!
ముసిముసినవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా..మువ్వగోపాలా అన్నట్టుందమ్మా!
అడుగుల సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా!
రాగమేదో తీసినట్టు ఉందమ్మా!
ముసిముసినవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా..మువ్వగోపాలా అన్నట్టుందమ్మా!
అడుగుల సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా!
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళ కంట నిదరరాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా
ముద్దు మురిపాల..మువ్వగోపాలా..నీవు రావేలా..అన్నట్టుందమ్మా!
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా!
రాతిరేళ కంట నిదరరాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా
ముద్దు మురిపాల..మువ్వగోపాలా..నీవు రావేలా..అన్నట్టుందమ్మా!
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా!
Mee Snehageetham,
Comments
Post a Comment