Naruda O Naruda Video Song - Bhairava Dweepam Movie - By Mee Snehageetham
‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడు సృష్టించిన నాతి (లక్ష్మీకాంత) చేసిన నృత్యం ఒకటుంది. ‘వగలోయ్.. వగలూ తళుకు బెళుకు వగలూ’ అనే జిక్కీగారు పాడిన పాట. మధ్య మధ్య ‘‘లలలూ లలలూ లలలు లలలు లలలూ ..’’ అనే హమ్మింగ్ వినిపిస్తుంది. ఈ హమ్మింగ్ ఆ చిత్రంలో తరచూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వినిపిస్తుంది కూడా. అంత ఆకర్షణీయంగా బాణీ కట్టారు ఘంటసాలగారు. ‘లలలూ లలలూ ...’ హమ్మింగ్ చేస్తుంటే ‘నరుడా .. ఓ నరుడా ... ఏమికోరికా’ అనే మాటలు తట్టాయి. ‘పాతాళభైరవి’లో గిరిజ టైటిల్ రోల్ పోషించారు. ఆమె మాట్లాడేది ఒకే మాట. ‘నరుడా ఏమి నీ కోరిక?’. ఆ మాటని లలలూ లలలూ బాణీలో పెట్టినప్పుడు పుట్టిన పాట ఇది. సింధుభైరవి రాగంలోని ఈ బిట్‌ని మొదట వేటూరి గారికి వినిపించారు మాధవ పెద్ది సురేష్ గారు. ఆయన మెచ్చుకుని అరపూటలో పాట మొత్తం రాసేశారు.
నరుడా ఓ నరుడా ఏమి కోరికా ...
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా ...
రా దొర ఒడి వలపుల చెరసాలరా
లే వరా ఇవి దొరకని సరసాలురా
దోర దోర సోకులేవి దోచుకో సఖా
ఋతువే వసంతమై పువ్వులు విసరగా
ఎదలే పెదవులై సుధలే కొసరగా ..
ఇంత పంతమేల బాలకా ..
‘నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి
నీ కసి స్వర మెరుగని ఒక జావళి
లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయా
రగిలే వయసులో రసకత నాదిరా
పగలే మనసులో మసకలు కమ్మెరా
ఇంక బింకమేల బాలకా ... ’
జానకిగారు ఎంత గొప్పగా పాడారో అంత గొప్పగా చిత్రీకరణ కూడా జరిగింది.
ఈ పాట బిబిసి వారి పరిశీలనలో 1994 వ సంవత్సరానికిగాను మోస్ట్ పాపులర్ సాంగ్‌గా ఎన్నికవడం విశేషం.
Comments
Post a Comment