Posts

స్వరరాగ గంగా ప్రవాహమే swararaga ganga pravahame postby madhaviraju

Image
  "సరిగమలు" అనే చిత్రం కోసం వేటూరి గారు రాసిన పాట "స్వరరాగ గంగా ప్రవాహమే" ఇందులో వేటూరిగారు మొదటి చరణంలో "కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి" అన్నారు. ఇదేమీ సామాన్య సినిమా పాట లోని చరణం కాదు . శ్రీ ఆదిశంకరాచార్యుల వార్లు ప్రతిపాదించిన ఘటాకాశ సిద్ధాంతాన్ని ఇక్కడ వేటూరి గారు సందర్భోచితంగా వాడారు. "శరీరం ఒక మట్టి కుండ, అందరి శరీరాలు మట్టి కుండల వంటివే, లోపల ఉండే శూన్యం అంతా ఆకాశమే, కుండల వేరయినా ఆకాశం వేరు కాదు అలాగే దేహాలు వేరయినా ఆత్మలు వేరు కావు" అంటుంది ఘటాకాశ సిద్ధాంతం. మీ స్నేహగీతం , Madhavi Raju .

Harivarasanam by madhaviraju

Image
  కుంబకుడి కులతూర్ అయ్యర్-హరివరాసనం అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించారు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించారు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవారు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవారు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవారు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయారు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివారు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబ...

క్షణ క్షణం / జాము రాతిరి / rekindled / Madhavi Raju,మీ స్నేహగీతం,మాధవీయం

Image
  క్షణ క్షణం సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ‘జాము రాతిరి జాబిలమ్మా.. జోల పాడనా’ సాంగ్. ఆ పాట 1990 ఆగస్టు 13న రికార్డింగ్ చేశారు. మొన్నటి 2019 ఆగస్టు 13న 29 ఏళ్లు పూర్తయింది. దీంతో సింగర్స్ హేమచంద్ర, కాలభైరవ, మనీషా, దీపు, దామిని, మౌనిమ, శ్రుతి, నోయల్, పృథ్వీ చంద్ర ‘జాము రాతిరి జాబిలమ్మా..’ పాటను మరోసారి మనకు కళ్లకు కట్టేలా తీసుకొచ్చారు. గతంలో వచ్చిన ఒరిజినల్ సాంగ్ రికార్డ్ సమయంలో ఈ సింగర్స్ కొందరు పుట్టకపోవడం గమనార్హం. అయినా ఆ మ్యూజికల్ హిట్ కోసం వారు చేసిన ప్రయత్నాన్ని వీక్షిద్దామా? Madhavi Raju , మీ స్నేహగీతం , మాధవీయం

criminal / తరిమిన ఆరు కాలాలు / Madhavi Raju / మాధవీయం

Image
  ''తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో '' సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట అంటేనే ఆనందంగా వినటం,ఆయన రాసిన మాటల లోతును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం. తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో అనటంలో చాలా గొప్ప భావన, కవితాత్మక దృష్టి ఉన్నది. ముందుగా ఆరు కాలాలు అని ఎందుకన్నారు అంటే ఈ భూలోకంలోని వాతావరణాన్ని బట్టి రుతువులు ఉంటాయి. ఆ రుతువుల్ని బట్టే మనుషుల మనస్తత్వాలు ఉంటాయి. ప్రకృతికి తగ్గట్టే మనిషి ఉంటాడన్న వాస్తవం. అలాంటి ఆరు కాలాలూ, ఏడు లోకాలూ చేరలేని ఒడిలోకి చేరిపోదాం అనటంలో అనంతమైన ప్రేమలో ఐక్యం అయిపోదాం అన్న అద్వైత భావన కూడా కనబడుతుంది. దాంపత్య జీవితానికున్న అంతిమ లక్ష్యం ఆ పరబ్రహ్మ తత్వమైన జీవుడు పరమాత్మలోకి విలీనం అయిపోవటం అన్నదే కదా. ఆరు కాలాలు అంటే ఆరు రుతువులు అని. (వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర రుతువులు ఆరు) ఏడు లోకాలు అంటే ఊర్ధ్వ లోకాలు ఏడు అని. (భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం) కాలం మనిషి తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అలాగే మనిషి ఉండే లోకం కూడా తన ఆలోచనలకు కారణభూతం అవుతుంది. కాలానికి, లోకా...

Ladies Tailor / missed song / లేడీస్ టైలర్ / vamsy director

Image
  "లేడీస్ టైలర్" ఆ సినిమాలోని పాటలకి సాహిత్యం అందించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం అందించింది ఇళయరాజా గారు, దర్శకుడు వంశీ. కాబట్టి ఆ సినిమాలో పాటలకి ఒక్క స్థాయి ప్రజాదరణ పొంది ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు. అవును ఆ సినిమాలో చాలా పాటలు చాలా ప్రజాదరణ పొందాయి. ఇప్పటికి చాలా మంది వాటిని వింటూ పాడుతూ ఉంటారు కూడా. కానీ నేను చెప్పే పాట ఇప్పుడు మరుగున పడిపోయింది. ఆ సినిమా విడుదలయ్యిన కొత్తలో ఆ పాట ఏమైనా ప్రజాదరణ పొంది ఉంటది ఏమో కానీ ఆ విషయం నాకు తెలీదు. తరువాత కాలంలో రేడియోలో, టేప్ రికార్డర్లలో, ఆ సినిమాలో వేరే పాటలు జనం వినడం చూసా కానీ ఈ పాట మాత్రం అంతగా ప్రాచుర్యం పొందలేదు దానిలో "గోపి లోల నీ పాల పడ్డామురా", "ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందో లక్కులు తెచ్చే చుక్క", "అలవాటిది పొరపాటిది గుంజీలే తీసేయనా", "హాయమ్మ హాయమ్మ" ఈ పాటలు అన్ని హిట్ అయ్యాయి. కానీ చాలా మందికి "లేవరా లేవరా సుందర సుందర" అనే ఒక్క పాట ఉంది అని కూడా తెలీదు. ఆడియో టేప్ మీద కూడా నాలుగు పాటల గురించే ఇచ్చారు కానీ, ఈ పాట పాట లేదు ఆ పాటలో అంత గొప్ప సంగీతం కా...

valmiki / గగన వీధిలో / mickey j meyer / కవిత నీవే

Image
మిక్కీ జె మేయర్ అందించిన ఒక మంచి పాట.. గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల దీవిని వీడుతూ దిగిన వేళలో కలలొలికిన సరసుల అడుగేసినారు అతిథుల్లా అది చూసి మురిసే జగమెల్ల అలలాగా లేచి పడుతున్నారీవేలా కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల రమ్మని పిలిచాక కమ్మనిదిచ్చాక కిమ్మని ఆనదింకా నమ్మని మానసింకా కొసరిన కౌగిలింతక వయసుకు ఇంత వేడుక ముగిసిన ఆసకాంత గోల చేయకా కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే నాననాననా ననన నాననాననా ననన నాననాననా ననన నా నడిచిన దారంతా మన అడుగుల రాత చదవదా జగమంతా అది తెలిపే గాథ కలిపినా చేయిచేయినీ చెలిమిని చేయనీ అని తెలిపిన ఆ పదాల వెంట సాగనీ కవిత నీవే కథవు నీవే కనులు నీవే కళలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో మధుర రీతిలో ఎగసిన పదముల Madhavi Raju , మీ స్నేహగీతం , మాధవీయం

మీరా / o butterfly / asha bhonsle / ఆశా భోంస్లే

Image
 మీరా -  ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా నిజానికి ఇళయరాజా ఈ బటర్ ఫ్లై పాట మాత్రం తమిళ నాట మోగుతూనే ఉంటుంది ..మంద్రమైన సంగీతం, బాలు గారి గొంతులో..తమిళం లో పాడింది ఆశా భోంస్లే గారు,కానీ తెలుగు లో బహుశా చిత్ర గారు..డబ్బింగ్ సినిమా అవటం తో క్లారిటీ సరిగ్గా ఉండదు తెలుగు లో..కానీ బాలు గారి ట్రాక్ మాత్రం చాలా అద్భుతం గా ఉంటుంది . తమిళం లో  ఈ పాట మీకోసం   ↓ తెలుగు  లో  ఈ పాట మీకోసం  ↓