Posts

Showing posts from 2019

#AlaVaikunthapurramuloo - Samajavaragamana Full Song / by mee snehageetham/ madhaviraju

Image
ఈరోజు అలవైకుంఠపురంలో సామజవరగమనా సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.ఆ పాట సాహిత్యం మొదటిసారిగా మీకోసం మా బ్లాగ్ ద్వారా “నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు…,ఆ చూపులనాల్లా తొక్కుకువెళ్లకు దయలేదా అసలు…, అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుండి జాలువారిన చరణాలతో మొదలైన మెలోడీ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. విరహంతో ప్రియురాలి కోసం ప్రియుడి విరహవేదనను వివరించేలా రాసిన సిరివెన్నెల సాహిత్యానికి థమన్ మ్యూజిక్ తో సిద్ధ్ శ్రీరామ్ స్వరం తోడొవ్వడంతో ఈ పాట మరో స్థాయిలో ఉంది. సాహిత్యం:-- నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకు కావాలి కాస్త అయ్యే కాటుకలా నా కలలు నువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్ నెట్టేస్తె ఎలా నిట్టూర్చవటే నిష్టూరపువిలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా మల్లెల్ల మాసమా మంజుల హాసమా ప్రతి మలపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన ఫించమా విరుల ప్రపంచమా ఎన్నెన్న...

ఓ సొగసరి | Spb sir| Baby Singer | Raghu Kunche | Palasa 1978 Movie | Lyrical Video

Image
Mee Snehageetham  , Madhavi Raju పల్లెకోయిల బేబీ తొలిసారిగా , శ్రీ SP బాలసుబ్రమణ్యం గారితో కలిసిపాడిన డ్యూయెట్ ... చిత్రం - పలాస 1978. ఓ సొగసరి ప్రియ లాహిరి తొలకరి వలపుల సిరి ఓ గడసరి తెలిసెను మరి పరువపు శరముల గురి నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు కాని కవ్విస్తావు అదేంమరి వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో చలివేళలో చెలి ఏలనే సొగసుకు బిడియపు ముసుగూ ఈ వేళలో ఆగావని అతిగా ప్రణయం విసుగు విరహమంటాను నేను కసురుకుంటావు నువ్వు సరసమేలేదు సయ్యాటలో నేను వింటూనే ఉంటే ఏదో అంటావు నువ్వు నీతో తంటాలు సిగ్గాటలో... అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో చెలి కురులలో జలపాతమే తనువొక ధనువై మెరుపూ ప్రణయాలలో ఈమాటలే మనసుకు ముచ్చట గొలుపు వెండి వెన్నెల్లొ నువ్వునిండు జాబిల్లి నవ్వు కన్నెచెక్కిళ్ళు నాకోసమే ఎంతసేపంటు నన్ను పొగుడుతుంటావు నువ్వు ఆపు చాలింక నచ్చావులే.. అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో అహ్హహ హహ్హ ఆహాహా ఒహ్హోహ్హో హోహో ఓహోహో ఓ సొగసరి ప్రియలాహిరి తొలకర...

నువ్వొ రాయి నేనో శిల్పి//Nuvvo rai nenu shilpi //full song

Image
మనిషిని,మనసుని కదిలించే శక్తి సంగీత సాహిత్యానికి ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాట. ఒక్క పాటతో అన్ని వృత్తుల వాళ్లపైన గౌరవం వచ్చేలా చేశారు మాటలకందని మౌనరాగం... ఒక ప్రయివేట్ ఆల్బం లో ఇంత సులువైన పదాలతో ఇంకా సుతిమెత్తని దెబ్బ అంటరానితనం పై .. నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలు నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని కానీ మలిన పడినావాడివంటూ ...

Nee Uniki Video Song | Lakshmi's NTR Movie Songs | RGV | Kalyani Malik | Sira Sri | SPB

Image
త్వరలో రిలీజ్ కాబోతున్న ''లక్ష్మీస్ ఎన్టీఆర్ ''చిత్రం నుండి '' నీ ఉనికి జీవితానికి అర్థం '' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' చిత్రంలోని నీ ఉనికి నా జీవితానికి అర్థం అంటూ సాగే ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా, సిరా శ్రీ గారు  సాహిత్యాన్ని అందించ గా శ్రీ కల్యాణి మాలిక్ గారు సంగీతం సమకూర్చారు. సాహిత్యం :- నీ ఉనికి నా జీవితానికి అర్థం నీ రాకయే నాకు స్వర్గ తుల్యం. నీ కవితలే పూల గాలుల గంధం. నీ మాటలే నాకు స్నేహ గ్రంధం . విరిసే ఈ బంధం.. కురిసే మకరందం. వెలిగే దీపం.. మిగిలే నేస్తం.. నువు నా సర్వస్వం. విరిసే ఈ బంధం . కురిసే మకరందం. వెలిగే దీపం.. మిగిలే నేస్తం.. నువు నా సర్వస్వం. కిరణానికి ఉదయం లాగా కవనానికి భావం లాగా హృదయానికి చలనం నాకు నీవేలే కదనానికి విజయం లాగా , కధనానికి గమ్యం లాగా మనసుకి నీవే కదా విరిసే జీవితం ...ముగిసే సంగమం తుదే లేని ఓ సంబరం నువు నా సర్వస్వం ... Mee Snehageetham Madhavi Raju https://www.facebook.com/mee.sneha.37 https://www.facebook.com/madhavi.raju....

Subhodayam Movie/ Kanchiki Potaavaa Video Song/ mee snehageetham /madhaviraju

Image
“శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. దీని మాతృక ''వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట'' అయిన కంచికి పోతావా కృష్ణమ్మా! ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా? కంచిలో ఉన్నది అవ్వ; ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ. బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి యింటిది అప్పు; ఆ - అప్పు నాకు పెట్టు పప్పు. పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా? అనే పిల్లల పాట నుండి స్పూర్తిగా తీసుకుని మన వేటూరి గారు రాసిన పాట ఇది  కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మకాదు ముద్దుగుమ్మా! త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ రాగమేదో తీసినట్టు ఉందమ్మా! ముసిముసినవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ మువ్వగోపాలా..మువ్వగోపాలా అన్నట్టుందమ్మా! అడుగుల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా! రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా రాతిరేళ కంట నిదరరాదమ్మా ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా ముద్దు మ...