Kinnerasani Vachindamma Video Song - Sitara Movie - By Mee Snehageetham
కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని కొండకోనల్లో ప్రారంభమై రమ్యమైన అటవీమార్గం గుండా కనువిందుచేసే ప్రయాణం చేసి గోదావరిలో విలీనమయ్యే వాగు. విశ్వనాథ సత్యనారాయణ ఆ నదిని తెలుగు ఇల్లాలిగా కల్పనచేసి కిన్నెరసాని పాటలు అనే గేయకావ్యాన్ని రచించారు. కిన్నెరసాని తెలుగు కవుల ఊహా సుందరి. పలు కవితలలో, పాటలలో ఈ నది ప్రస్తావన ఉంది. కిన్నెరసాని ప్రాంతం ప్రకృతి రమణీయతకు, పక్షుల కిలాకిలా రావాలకు పెట్టింది పేరు. చుట్టూ దట్టమై న అరణ్యం, అద్భుతమైన కొండలతో చూపరులను కట్టి పడేసే సొగసులు కిన్నెరసాని సొంతం. ఖమ్మం నుండి 104 కిలోమీటరు,్ల కొత్తగూడెం నుండి 24 కి.మీ., హైదరాబాదు నుంచి 304 కిమీ దూరం ఉన్న ఈ ప్రాంతం పర్యాటకుల సందర్శనకు అత్యంత అనువైన సుందర ప్రదేశం. తననననన తననననన... తననననన తననననన... తననననన తననననన... తననననన చమకు చమకు జింజిన జింజిన.. చమకు చమకు జిన్న జిన్న జిన్న.. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.. జమకు జమకు జింజిన జింజిన.. జమకు జమకు జిన్న జిన్న జిన్న.. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.. విశ్వనాధ పలుకై.. అది విరుల తేనెచినుకై.. కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై.. పచ్చని చేలా.. తనననన.. పావడగట్టి.. తనననన ప...