Posts

Showing posts from October, 2017

Mounamgane Yedagamani - Na Autograph -By Mee Snehageetham

Image
తెలుగు లో... మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది తమిళ్ లో... ఒవ్వొరు పూక్కలుమే సొల్గిరదే కన్నడ లో ...అరళువ హూవుగళే ఆళిసిరి .. భాష ఏదైనా ఆ పాట ఇచ్చే స్ఫూర్తి తరగని గని... ఒకో లైన్ జీవితాన్ని నిలబెట్టే అమృత గుళిక .. తెలుగు లో నాకు నచ్చిన లైన్లు .."చెమట నీరు చిందగా నుదుటరాత మార్చుకో మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో .. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో .. మారిపోని కధలే లేవని గమనించుకో .." తమిళ్ లో ... వాల్వెండ్రాల్ పోరాడుం పోర్కలమే (జీవితమన్నది పోరాడాల్సిన పోరాటం ) వలి తాంగుం ఉళ్ళం తానే నిలెయాన సుగం కాణుం ( బాధ తట్టుకున్న మనసే తర్వాత సుఖం అనుభవిస్తుంది) యారికిల్ల పోరాట్టం? (ఎవరి జీవితాలలో పోరాటం లేదు?..). కన్నిళ్ ఎన్న నీరోట్టం (కళ్ళలో నీళ్ళు రానిదెవ్వరికి ?) ఒరు కణవు కండాల్ .అదు దినముఇండ్రాల్ (కన్న కల నీ మనసులో నిలిపి ప్రయత్నం చేస్తే ) ఒరు నాళిల్ నిజమాగుం (ఏదో ఒక రోజు నిజమై తీరుతుంది ...) కన్నడ లో... నాళియ నమ్మిక ఇరలి నమ్మ బాళలి (రేపనే నమ్మకం జీవితం లో ఉండనీ ..) గెల్లువ భరవసయందే బెళకాగలి (గెలుపు మీద నమ్మకం తోనే తెలవారనీ ..) మలెయో బర సిడిలో నీ నడకదిరు (వానైనా,పిడుగైన...

Varaveena - Vinayakudu - by mee snehageetham

Image
వరవీణా మృదుపాణి ఈ గీతాన్ని  అంతే అద్భుతంగా వెస్ట్రన్ స్టైల్ లో చేసిన అద్భుతమైన పాట  కర్ణాటక సంగీతం నేర్చుకుకుంటున్నవిద్యార్థులు అందరూ 'మోహన' రాగం లోని "వరవీణా మృదుపాణి" గీతం తప్పని సరిగా నేర్చుకుంటారు. ఇది శ్రీ పురందర దాస రచన. కర్ణాటక సంగీతానికి 'మాయా మాళవ గౌళ' రాగాన్ని మౌలిక రాగంగా తీసుకుని సరళీ, జంట స్వరాల తో ప్రారంభించి అలంకారాలు, పిళ్ళారి గీతాలు మొదలయిన వాటిని పాఠ్య అంశాలు గా క్రమ పరచి అపారమైన సేవ చేసిన ఈ మహానుభావుడు "కర్ణాటక సంగీత పితామహుడు" అని జగద్విదితము. వరవీణా మృదుపాణి వనరుహ లోచను రాణి సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి నిరుపమ శు భగుణలోల నిరత జయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజాసన జనని జయ జయ జయ జయవాణి ప్రతి పదార్థము: వరవీణ = వరము గా గలిగిన వీణ; మృదు = సున్నితమైన; పాణి = చేతులు (దాల్చి); వనరుహ = [వన = వనము/నీరు + రుహ = పుట్టిన] పద్మం; లోచను (నయనాలు/కళ్ళు); రాణి (రాణి); సురుచిర = వంకీలు తిరిగిన; బంభర = తుమ్మెదల వంటి; వేణి = కురులు; సుర = దేవతలచే; నుత = స్తుతించబడ్డ; కల్యాణి = శుభ గుణములు కలది; నిరుపమ = (ఉపమ = సామ్యం; నిరుప...

Pilla Zamindar - Oopiri aadadu by mee snehageetham

Image
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే కొనఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే కొనఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే నా మనసే నన్నే వదిలి వెళుతుందే నీతో ఎటువైపో ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవరపెడుతుందే తడబడి తడబడి రా తేనె పలుకై రా కనపడి కలబడినా ప్రేమే ముడిపడునా మధురం మధురం మధురం ఈ పరువం మధురం ఊపిరి ఆడదా నీకు ఎదురు నువ్వైతే నేనేం చేశా నేరం ప్రాణం తీయకే ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుక రావే రావే నీ కోసమా.... మధురం మధురం పరువం గడసరి మగసిరి నిన్ను కోరింది సొగసిరి ఎద మరి తీరే మారింది గుప్పెడు మనసే అలా ఎలా కొట్టేశావే కనికట్టేదో కథాకళి కట్టిస్తుందే మరువం మరువం పరువం చేసే గాయాలే ఊపిరి ఆడదు నాకు ఎదురు నే రానా కొనఊపిరితో ఉన్నా ప్రాణం నేనవనా ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుక రావే రావే నా కోసమే... మధురం మధురం పరువం చినుకునై చిలిపిగా నిన్ను తడిమైనా గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయనా వయసొక నరకం వాంఛలే వేధిస్తుంటే తీయని తమకం అమ్మో భయం ఏం చేస్తుందో మరువం మరువం పరువం చేసే గాయాలే ఊపిరి ఆడదు నాకు ఎదురు నే రానా క...

Nene Raju Nene Mantri -Sukhibhava Full Song -by mee snehageetham

Image
సుఖీభవ అన్నారు దేవతలంతా సుమంగళి ఉండాలి ఈ జన్మంతా ఊపిరి అంత నువ్వే నువ్వే ఊహలోనా నువ్వే నువ్వే ఉన్నదంతా నువ్వే... బంధమా... కంటిలోనే నువ్వే నువ్వే కడుపులోన నీ ప్రతిరూపే జన్మకి అర్ధం నువ్వే ప్రాణమా కలోలోనా కథలోనా నువ్వే నీ జతలో నూరేళ్ళు ఉంటానే నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నీతోనే జీవితం నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నీకేనే అంకితం సుఖీభవ అన్నారు దేవతలంతా సుమంగళి ఉండాలి ఈ జన్మంతా నీ పేరే సుప్రబాతం అడుగున అడుగే ప్రదక్షిణం నీ మాటే వేద మంత్రం మనసుకు మనసే సమర్పణం నీకేగా.... నా తలపు నా గెలుపు నీకోసం నాదేహం నా ప్రాణం నీదే తనువంత పులకిరింత రోజూ నువు ధరి చేరితే వయస్సంత వలుపు సంత నీ ఊపిరి వెచ్చగా తాకితే నీ మాయే కన్నులతో వెన్నెలనే కురిపించే ఓ మణి కౌగిలలోో దాచాలే నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నీతోనే జీవితం నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నీకే నే అంకితం మీ  స్నేహ గీతం  

Mahanubhavudu Title Song - మహానుభావుడవేరా by mee snehageetham

Image
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా అడగందే కాలైన కదలొద్దు అంటూనే అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా కనులను కడిగే కలగను వాడే చినుకలనైనా వలగడుతాడే అడుగుకు ముందే తుడుచును నేలే కడిపితె కాలే పరుచును పూలే ముసుగేసే ముత్యానివో... మరకుంటే మారేడు మునుపూస బారేడు మచ్చసలే లేనోడు చందురుడే మావాడు ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే ఎడముగ ఉండే ఎదసడి వీడే కుదరదు అన్నా కుదురుగ ఉండే కలబడు తున్నా కదలడు చూడే అరుదైన అబ్బాయిరో... పెదవైన తాకిందో తెగ సిగ్గు అద్దేడు కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మీ  స్నేహ గీతం  

Hey Pillagada Movie - Oo Chandrudaaa Song - by mee snehageetham

Image
చిత్రం : హే పిల్లగాడా (2017) సంగీతం : గోపీ సుందర్ సాహిత్యం : సురేంద్ర కృష్ణ గానం : సింధూరి ఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గేనా అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం చిరునవ్వుతో ప్రతి గుండెనీ గెలిచేయ్ ఒక్కసారి నీకోపం మీద కోపం చూపి నవ్వరా అందుకోసం నే ఎన్నిసార్లు చూస్తుంటానో అడగరా నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు నీ ఎదురుగ నిలిచిన మనసుని నువ్వు గాయం చెయ్యొద్దు సహనంతో నీకన్నీ సాధ్యం చిరునవ్వే నీ గెలుపుకి మంత్రం అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం మిన్నే విరిగి నీ మీద పడ్డట్టు ఇంకేదో ఐనట్టు గొడవెందుకు నువ్వే పలికే ఖర్చేమి లేదంట తప్పేమి కాదంట నవ్వచ్చుగా నీ అందం నీ ఆనందం నీ చేతుల్లో ఉండాలంటే నువ్వింకా వదిలెయ్యాలి కోపం సంతోషం నీ దాసోహం అవ్వాలంటే సూత్రం పెదవులపై చిరునవ్వుంటే ఛాలురా.. ఎంత పెద్ద బాధకైన పలకరింపే మంచి మందు చిరునవ్వుతో ప్రతిగుండెనీ గెలిచేయ్ ఒక చూపుతో చిరుకాంతినే పంచేయ్ పిల్లగాడా నువ్వు నవ్వావంటే నాలో వీణే మోగురా నీ నవ్వుకోసం నే ఎన్నిసార్లు చూశ్తున్నానో అడగరా నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్...

Madhura Murali Hrudaya Ravali - Oka Radha Iddaru Krishnulu - by mee snehageetham

Image
మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగె యద పొంగె ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా  మధుర మురళి హృదయ రవళి యదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడి రేగే ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో నాజూకులన్నీ నాకే దక్కేవేళల్లో పగలో అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికీ రాగాలెన్నైనా వేణువు ఒకటేలే రూపాలెన్నైనా హృదయం ఒకటేలే నాదే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం మధుర మురళి హృదయ రవళి యదలు పలకు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృందా విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా ఈ బృందా విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా హేమంత వేళల్లో లేమంచు పందిట్లో నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే ముద్దే మందారం మనసే మకరందం సిగ్గే సింధూరం శ్రీదేవికీ అందాలెన్నైనా అందేదొకటేలే ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే పాటే అనురాగము మన బాటే ఓ అందాల అనుబంధం మధుర మురళి హృదయ రవళి అధర సుధల యము...

Pongi Porale Andalenno song - Kotha Jeevithalu movie song - by mee snehageetham

Image
పొంగి పొరలే ...అందాలెన్నో పొంగి పొరలే... కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే... కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే... కోనల్లోనా.. లోయల్లోనా నేల పైన నింగి కదలే... వన్నెకాడు నన్ను కలిసే... పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా పవనాలే జిల్లనగా...హృదయాలే ఝల్లనగా పొంగి పొరలే అందాలెన్నో ..పొంగి పొరలే కోనల్లోనా... లోయల్లోనా...నేల పైన నింగి కదలే వన్నెకాడు నిన్ను కలిసే.... కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా మ్రోగిందీ.. రాగం..మ్రోగిందీ.. రాగం.. ఆడిందీ తాళం...అది నీ కోసం...హా.హా.హా కన్నెమదిలో అందాలెన్నో..పొంగి పొరలే.. కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదిలే... వన్నెకాడు నన్ను కలిసే పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా కన్నుల్లో... మౌనం ...కన్నుల్లో... మౌనం... నవ్వుల్లో గానం..అది నా కోసం...హా.హా.హా.. పొంగి పొరలే అందాలెన్నో..పొంగి పొరలే కోనల్లోనా.. లోయల్లోనా..నేల పైన నింగి కదలే వన్నెకాడు నిన్ను కలిసే... మీ  స్నేహ గీతం

Andamayna Na Oohala Song - Aahuthi Movie - by mee snehageetham

Image
అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం మల్లెపూల కన్నా మంచు పొరల కన్నా నా చెలి ముసి ముసి నవ్వులు అందం... ఆ... నెమలి హొయలకన్నా... సెలయేటి లయల కన్నా... నా చెలి జిలిబిలి నడకలు అందం అపురూపం ఆ నవ లావణ్యం... అపురూపం ఆ నవ లావణ్యం అది నా మదిలో చెదరని స్వప్నం... అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం పైడిబొమ్మ లాంటి ఆమె పక్కనుంటె పగలే వెన్నెల నే కురిపిస్తా... ఆ... నీడ లాగ నాతో... ఏడడుగులు సాగితే... ఇలలో స్వర్గం నే సృష్టిస్తా... రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ.. రస రమ్యం ఆ రాగ విలాసం వసి వాడదు అది ఆజన్మాంతం అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం మీ  స్నేహ గీతం