Posts

Showing posts from September, 2017

Yuddham Sharanam - Adedo Maayalley - by mee snehageetham

Image
అదేదో మాయల్లె అలా అలా అల్లిందా ఎద ఏదో లోయల్లో ఇలా జారింది మెల్లగా ఆ .. ఆ ..ఆకాశం వాలీ కళ్ళలోన దాగింది చూపుల్లో చూపే అలాగే మెరుపు తీగాల్లె ఆ ..అందాలే మచి చూపిందా సూదల్లె గుండె గుచ్చి గుచ్చి చంపుతుంది కంగారే .. దాహoగా మారిందా గుటక వేసి చూస్తూనే మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం అయ్యో ఉహలతో సద్దుకుందిగా అయ్యో అయ్యో చెయ్యి జారుతున్న ప్రాణం తానే అందుకుందా ఏదో ఏదో హాయి చేరుతుందా తీరే కొత్తగా తోచిందా సైగలో దాగిన భావమే తెలియాలంటే భాషకే అందని విధంగా మనమే చేరి ఈ పెదవి పై తాకేలా మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం అయ్యో ఉహలతో సద్దుకుందిగా మొహమాటం అడ్డం వచ్చి ఆరాటం..ఏదో ఉహలతో సద్దుకుందిగా మీ  స్నేహ గీతం

Jai Lava Kusa -Tring Tring Video Song by mee snehageetham

Image
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ నరాల్లో మోగుతోంది క్లారినైట్ ఫిరంగి గుచ్చినట్టు రొమాన్స్ గుప్పు మంది పార్టు పార్టు ఫిరంగి పేలినట్టు హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పరెయ్యకే ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ ఓ.. ఇష్క్ శాండిలైట్ లా చుట్టుముట్టి తిరగనా ఇష్క్ మూన్ లైట్ లాంటి నిన్ను చూసి గాగ్ర చోళీ కట్టులా అందనంత ఎగరనా ఆవురావురన్న నిన్ను మాయచేసి జపాన్ ఎర్త్క్వెక్ మొదలైయిందే జవాని పొంగులోన పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే ఒకింత పంచుకోన థెర్మోమీటరే దాటుతోంది మేటరే ట్రింగ...

Spyder movie song - Boom Boom by mee snehageetham

Image
భూమ్ భూమ్ భం భం భూమ్ భూమ్ భం భం భూకంపాల శబ్దమే  కుట్ర గట్రా పుట్టేలోపే ఇట్టే కాదా అంతమే  గాల్లో కన్నై గస్తీ కాసే గూడాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ చేదిస్తాడులే S P Y వచ్చాడోయ్ రయ్యారై తయ్యారై S P Y వచ్చాడోయ్ రయ్యారై రై రై రై డోరి డోరి డోంట్ యూ వర్రీ హెర్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి వీడే ఉంటే భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి చట్టం షర్ట్ నలిగిపోతే చేసేస్తాడు ఇస్త్రీ పంతంపట్టి ఎదురొచ్చాడో ఎవడే అయినా హిస్టరీ S P Y వచ్చాడోయ్ రయ్యారై తయ్యారై S P Y వచ్చాడోయ్ రయ్యారై రై రై రై మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాశారేమో హార్వర్డ్స్ లో ఈ మొనగాడు పట్టాగాని పొందాడేమో మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాశారేమో హార్వర్డ్స్ లో ఈ మొనగాడు పట్టాగాని పొందాడేమో థీమ్ మ్యూజిక్ అక్కర్లేని మాస్సి హీరోనే వీడు పంచేది వెయ్యకుండా క్లాప్స్ కొట్టిస్తాడు భయమును బాంబ్ గా చేస్తాడు హృదయము లోపల పెడతాడు తెలివితో ఆడే పనివాడు గెలుపుకు వీడే తనవాడు వీడికి వినపడకుండానే చీమలు చిటెకలు వెయ్యవులే వీడిని అనుమతి అడగనదే క్రిములిక వ్యాపించవు అసలే భూమ్ భూమ్ భం భం భూమ్ భూమ్ భం భం భూకంపాల శబ్దమే కుట్ర గట్రా పుట్టేలోపే ఇట...

Nee Kallalona Video Song Promo - Jai Lava Kusa Video Songs

Image
నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా... నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా... నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా... ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా... తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ పోయా...  ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా... నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా... నా చెంత నువు చేరిక ఓ దారమల్లె లాగా... నీ నీలి కురుల నుండి ఓ పూల గాలి రాగా... నా ప్రేమ అన్న గాలి పటం చంద్ర మండలాన్ని చేరగా... తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ పోయా... అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద వాలిపోయా... అసుర అసుర అసుర అసుర రావణసూర... ధగ ధగ ధగ ధగా నీ సొగసులోని ధగా... భగ భగ భగ భగా పెంచింది పడుచు పగ... నీ పెదవిలోన ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే... మెడ వంపులోన నునుపు గాయానికి కారం పూస్తే... దారుణంగా దగ్గరయి ఉదృతంగా ఉప్పెనై... అందమైన ఔషధాన్ని తాగనా... ధగ ధగ ధగ ధగా నీ సొగసులోని ధగా... భగ భగ భగ భగా పెంచింది పడుచు పగ... అసుర అసుర అసుర అసుర రావణసూర... మీ స్నేహగీతం

Teliyaniragam palikindi - Mamatala Kovela - by mee snehageetham

Image
తెలియని రాగం పలికింది తీయని భావనలో తెలియని రాగం పలికింది తీయని భావనలో  మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలలో తెలియని రాగం పలికింది తీయని భావనలో ఆకాశ దీపానివై నా కోసమే రమ్మని నా గుండె గుడిగంటలో నాధానివే నీవని గోరంత పసుపెట్టి ఊరంత కబురెట్టే శ్రీవారే రావాలని కుంకుమతో కుశలమని పారాణే పదిలమని దీవించు దేవుల్లే మా ఇంటివారని తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలలో ఏ జన్మకే గమ్యమో తెలిసేది కాలానికే ఏ పువ్వు ఏ పూజకో తెలిసేది దైవానికే ఏ జన్మకేమైన ఈ జన్మలో నీకు ఖైదీనే అయ్యానుగా బ్రతుకైనా వెతలైనా జతగానే పంచుకునే శ్రీవారే కావాలి ఏ జన్మకైనా తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలలో తెలియని రాగం పలికింది తీయని భావనలో మీ  స్నేహ గీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Image
యాపిల్ పిల్లా నీవెవరో ఐస్‌క్రీం చెలియా నీవెవరో కళ్ళల్లోన మెదిలే కలవే నీవా యాపిల్ పిల్లా నీవెవరో ఐస్‌క్రీం చెలియా నీవెవరో కళ్ళల్లోన మెదిలే కలవే నీవా పుత్తడి పువ్వా నీవెవరో పచ్చని చిలక ౨ నీవెవరో మోహంలో నను ముంచిన మగువా రావా నవ్వుతూ మత్తు జల్లి దూరమై పోవద్దే ఇలా నీవెంట వస్తే ఎవరు నువు అనవద్దే ఏదో ఒక నాడు సఖియా నీ ప్రేమే దొరకునని౨ ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే మనసున తలచి కళ్ళను మూసి కల కన్నాను కనపడలా మౌనంగా నా గుండెను గిల్లా అయ్యో అయ్యో ౨ఎందుకిలా నన్నే తాకి అల్లరి పెట్టిన చిరుగాలెక్కడ దాగినదే తుంటరి పైటకి ౩ ముద్దులు పెట్టి నాలో విరహం రేపినదే అందాలూరే చిలకమ్మ శ్వాసలతో౩ నిను తడిపెయ్‌నా ఆకాశంలో దాగునా ఎన్నడు నిను వీడనమ్మ నిను చేరకపోతే జీవితమంతా ౨వ్యర్ధం అయిపోదా ఏదో ఒక నాడు సఖియా నీ ప్రేమే దొరకునని ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే యాపిల్ పిల్లా నీవెవరో ఐస్‌క్రీం చెలియా నీవెవరో కళ్ళల్లోన మెదిలే కలవే నీవా పిల్లా నీకై పరుగులు పెడితే లవ్యూ లవ్యూ అంటావా పాపం అయ్యో పిచ్చోడంటూ పక్కకు తిరిగి నవ్వుతావా ఊహల తలుపులు నువు తెరిచేస్తే ౩ఊపిరి నేనై వచ్చేయ్‌నా ముచ్చటగా నువు ఓకే అంటే ఒళ్ళో డేరా వేసేయ్‌నా యె...

Naa Paadam Aagena Video Song - Yuvakudu - by mee snehageetham

Image
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా చెరిగిన శాంతి చెదిరిన కాంతి కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా కమ్మని జోలలతో చిననాటి ఆ కల కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా తీరని ఊహలా తీరని ఆశలా అలనాటి జ్ఞాపకాల కోవెల కోయిల పాటలా కోరిన కోటలా పిలిచింది నన్ను కోటి గొంతులా చెరిగిన శాంతి చెదిరినకాంతి కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా నీ కొనవేలితో మొదలైంది ఈ కదం నీ చనుబాలతో పదునైంది పౌరుషం నీ ఎదలో లయ వినపడనీయక నను ఆపకమ్మ కాలు తూలగా నీ కనుపాపలో కాంతిని ఈయక కరిగించకమ్మ కంటి నీరుగా చెరిగిన శాంతి చెదిరిన కాంతి కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా మీ  స్నేహ గీతం న్నా

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Image
శ్రీరంగ రంగ నాథుని అంటూ సాగే అద్భుత గీతమిది. ఈ సాహిత్యం  చూడండి... ఎంత అద్భుతంగా ఉంటుందో.... గంగా శంకాస కావేరి... శ్రీరంగేశ మనోహరి... కళ్యాణకారి కలుసాని... నమస్తేసు శుభాచరి... ఆ...... శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటి ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే గంగను మరపించు ఈ కృష్ణవేణి వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి పాపాల హరియించు పావన జలము పచ్చగ ఈ నెల పండించు ఫలము ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా సిరిలెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే కృష్ణాతీరాన అమరావతిలో.... శిల్పకళావాణి పలికిన శృతిలో అలలై పొంగేను జీవన గీతం కలలే పలికించు మధుసంగీతం చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా వెల్లువై గుండె పల్లె పదమల్లె పల్లవై పాడగా... శ్రీత్యాగరాజ కీర్తనై సాగే చల...

Sanna Jaji padaka Song - Kshatriya Putrudu -by mee snehageetham

Image
సన్నజాజి పడక పాట మొదట్లో జానకి గారు నోటితో వేసే మ్యూజిక్...... ఉత్త గాలే వస్తుంది అన్నచోట , ఎందుకే.. అన్న చోట తను రాగం తీసిన పద్దతి  చాలా అద్భుతం చిత్రం : క్షత్రియపుత్రుడు సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వెన్నెలకంటి గానం : జానకి, బాలు గారు సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా.. మాట వినకుందీ.. ఎందుకే.. ||3|| అడిగితే సిగ్గేసిందీ.. సిగ్గులో మొగ్గేసిందీ.. మొగ్గలా బుగ్గే కందీ పో..యేనే.. ||సన్నజాజి|| సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా.. మాట వినకుందీ.. ఎందుకే.. మనసులో ప్రేమేఉందీ.. మరువనీ మాటేఉందీ.. మాయనీ ఊసేపొంగి.. పాటై రావే.. ||సన్నజాజి|| కొండమల్లి పూవులన్నీ.. గుండెల్లోనీ నవ్వులన్ని.. దండే కట్టి దాచుకున్నా.. నీ కొరకే.. పండు వెన్నెలంటి ఈడు.. యెండల్లొన చిన్నబోతే.. పండించగ చెరుకున్నా.. నీ దరికే.. అండ దండ నీవేననీ.. పండగంత నాదేననీ.. ఉండి ఉండి ఊగింది నా మనసే... కొండపల్లి బోమ్మా ఇక.. పండు చెండూ దోచెయ్యనా.. దిండే పంచే వేళయినది రావే.. దిండే పంచే వేళయినది.. రా..వే.. ||సన్నజాజి|| మీ  స్నేహ గీతం

Cheli Raava Video Song - Mouna Ragam - by mee snehageetham

Image
ఆ....ఆ....ఆ....ఆ.... చెలీ రావా వరాలీవా... నిన్నే కోరే ఓ జాబిల్లీ నీ జతకై వేచేనూ నిలువెల్లా నీవే... చెలీ రావా వరాలీవా... ఈవేదన తాళలేనే మామా చందమామా వెన్నెల్లనే పూలు రువ్వీ చూడూ ఊసులాడూ చెప్పాలనీ నీతో ఏదో చిన్నమాటా చెయ్యాలనీ స్నేహం నీతో పూటపూటా ఊ అంటే నీ నోటా బ్రతుకే వెన్నెల తోటా చెలీ రావా వరాలీవా... వయ్యారాలా నీలినింగీ పాడే కధలు పాడే ఉయ్యాలగా చల్లగాలీ ఆడే చిందులాడే సుగంధాల ప్రేమా అందించగా రాదా సుతారాల మాటా చిందించగా రాదా ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా చెలీ రావా వరాలీవా... నిన్నే కోరే ఓ జాబిల్లీ నీ జతకై వేచేనూ నిలువెల్లా నీవే... చెలీ రావా వరాలీవా... నిన్నే కోరే ఓ జాబిల్లీ మీ  స్నేహ గీతం  

Chinni Chinni koyilalle Song - Mouna Ragam Movie - by mee snehageetham

Image
లాలలాల లాలలాల లాలలాల లాలలాల లలలాల లలలాల లలలాల లలలాల లలలాల లలలాల లాలా లాలాలాలా.. చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా మల్లెల బాటలోన పాటలే కోరుకుందీ మన్మథుని పాటలోన గాధలే పాడుకుంది ఊహలే జీవితం చిందెనే మాటలే సాగెనే ఆశలే రేగెనే ఊసులే మనసు ఊగి.. మ్.మ్.మ్.మ్ మరులు రేగి.. మ్.మ్.మ్.మ్ మనసు ఊగి.. మ్.మ్.మ్.మ్ మరులు రేగి.. మ్.మ్.మ్.మ్ అందరాని సన్నిధి నేనే.. నేనే.. నేనే.. చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా వెచ్చని సందె వేళ బాసలే ఆడెనులే పచ్చని కన్నెవయసు గంగలా పొంగెనులే కమ్మని తేనెలే గుండెలో తేలెనే చీకటే వచ్చినా ఊహలే ఊరేనే జీవితాంతం.. మ్.మ్.మ్.మ్ స్నేహరాగం.. మ్.మ్.మ్.మ్ జీవితాంతం.. మ్.మ్.మ్.మ్ స్నేహరాగం.. మ్.మ్.మ్.మ్ పరువ రాగ కీర్తనం పాడె.. పాడె.. పాడె చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరిం...

Pranaya RagaVahini Song - Maya Machindra - by mee snehageetham

Image
ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని.. ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని.. మదిలో ఏవో సుధలే కురిసే మధుర మధుర యామినీ.. ప్రణయ రాగజీవనా...ప్రియా...వసంత మోహనా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని.. మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని.. పొదరింట లేడు..పూవింటి వాడు.. పొదరింట లేడు..పూవింటి వాడు..ఎదురుగా వున్నాడనీ.. ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని.. లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ.. లలిత శారద చంద్రికలు..అలలై పాడేను ఏమనీ.. పదునారు కళలా.. పరువాల సిరులా పదునారు కళలా.. పరువాల సిరులా పసిడి బొమ్మవు నీవనీ.. ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని.. మదిలో ఏవో సుధలే కురిసే మధుర మధుర యామినీ.. ప్రణయ రాగజీవనా...ప్రియా...వసంత మోహనా.. మీ  స్నేహ గీతం  

Magaraya Pantha melara Song - Maya Machindra - by mee snehageetham

Image
మగరాయ పంతామేలరా.. నే మరుబారి తాళజాలరా.. నా వన్నెలు చిన్నెలు నిన్నే కోరెరా.. చిగురాకు బాకూ ఆ వలరాజు దూసే  సెగలాటి వెలుగు ఆ నెలరాజు కాసే  ఎలదేటి మనసూ దులిచేను రారా ఎదమదనాగ్ని రేగేను మారాములేలా.. మగరాయ పంతామేలరా.. నే మరుబారి తాళజాలరా.. నిను చూడగానే నా నెమ్మేను పొంగే.. నిను చేర అందాల కెమ్మోవి ఊరే.. చెమరించె కన్నూ నన్నేల రారా అనురాగాల భోగాల లాలన శాయా మగరాయ పంతామేలరా.. నే మరుబారి తాళజాలరా.. మనకోసమేగా ఈ పొదరిల్లు పూచే.. ఆఅ పొదరింటిలోనా విరిపాన్పు వేసే వలచింది వనితా అలుసేల రా నీనగుమోము కనలేని నా బతుకేలా మగరాయ పంతామేలరా.. నే మరుబారి తాళజాలరా.. నా వన్నెల చిన్నెలు నిన్నే కోరెరా.. ఓ మగరాయ పంతామేలరా.. నే మరుబారి తాళజాలరా.ఆఆఆ.. మీ  స్నేహ గీతం