Vellipomaake Full Video Song | Saahasam Swaasaga Saagipo Full Video Songs | NagaChaitanya, Manjima
కాలం నేడిలా మారెనే, పరుగులు తీసెనే
హృదయం వేగం వీడదే, వెతికే చెలిమే నీడై నన్ను చేరితే
కన్నుల్లో… నీవేగా… నిలువెల్లా
స్నేహంగా తోడున్న నీవే, ఇక గుండెలో ఇలా
నడిచే…క్షణమే…
యెద సడి ఆగే, ఊపిరి పాడే, పెదవిని వీడే….పదమొక కవితై
మది నీ వశమై, నువ్వు నా సగమై
యెదలో… తొలి ప్రేమే కడలై యెగిసేవేళ
పసివాడై, కెరటాలే ఈ క్షణం
చూడనా, చూడనా
యెగిరా నింగి దాక ఊహల్నే రెక్కల్లా చేసిందె ఈ భావం
ఓ! కాలాన్నే కాజేసే కళ్ళ కౌగిల్లో కరిగే… కలలే…ఓ!
వెన్నెల్లో వేధించే వెండి వానల్లో వెలిగే… మనమే
మౌనంగా, లోలోనే, కావ్యంగా మారేకలే
పన్నీటి ఝల్లై… ప్రాణమే తాకే, ఊపిరే పోసే
ఇది తొలి ప్రణయం…. మనమాపినా ఆగదే
యెన్నడూ వీడదే…
వెళ్ళిపోమాకే, యెదనే, వొదిలెళ్ళి పోమాకే
మనసే, మరువై, నడవాలి ఎందాకే
వెళ్ళిపోమాకే, యెదనే, వొదిలెళ్ళి పోమాకే
మనసే, మరువై, నడవాలి ఎందాకే
భాషె తెలియందే, లిపి లేదే, కను చూపే చాలందే
లోకాలంతమైనా, నిలిచేలా, మన ప్రేమే ఉంటుందే
ఇది వరమే….
మనసుని తరిమే, చెలిమొక వరమే
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే
ప్రణయపు కిరణం, యెదకిది అరుణం
కనులకి కనులని యెర వేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే
యే అనుమతి అడగక కురిసే
నీలో నాలో…. హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడవే
మనసిక పరుగే ఆపదే
నీలో నాలో….
మీ స్నేహగీతం
Comments
Post a Comment