Posts

Showing posts from November, 2022

స్వరరాగ గంగా ప్రవాహమే swararaga ganga pravahame postby madhaviraju

Image
  "సరిగమలు" అనే చిత్రం కోసం వేటూరి గారు రాసిన పాట "స్వరరాగ గంగా ప్రవాహమే" ఇందులో వేటూరిగారు మొదటి చరణంలో "కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి" అన్నారు. ఇదేమీ సామాన్య సినిమా పాట లోని చరణం కాదు . శ్రీ ఆదిశంకరాచార్యుల వార్లు ప్రతిపాదించిన ఘటాకాశ సిద్ధాంతాన్ని ఇక్కడ వేటూరి గారు సందర్భోచితంగా వాడారు. "శరీరం ఒక మట్టి కుండ, అందరి శరీరాలు మట్టి కుండల వంటివే, లోపల ఉండే శూన్యం అంతా ఆకాశమే, కుండల వేరయినా ఆకాశం వేరు కాదు అలాగే దేహాలు వేరయినా ఆత్మలు వేరు కావు" అంటుంది ఘటాకాశ సిద్ధాంతం. మీ స్నేహగీతం , Madhavi Raju .

Harivarasanam by madhaviraju

Image
  కుంబకుడి కులతూర్ అయ్యర్-హరివరాసనం అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించారు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించారు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవారు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవారు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవారు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయారు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివారు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబ