Posts

Showing posts from June, 2017

Pranaamam Full Video Song Janatha Garage by mee snehageetham

Image
తోం.. ధిరననన ధిర ధిర న తోం.. ధిరననన ధిర ధిర న తోం. ధిరన తోం ధిరన ధీర ధీర నానా.. తోం.. ధిరననన ధిర ధిర న తోం.. ధిరననన ధిర ధిర న ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం ప్రయాణం ప్రయాణం విశ్వంతో మమేకం ప్రయాణం తోం.. ధిరననన ధిర ధిర న తోం.. ధిరననన ధిర ధిర న తోం. ధిరన తోం ధిరన ధీర ధీర నానా.. మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులు తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమె సంద్రం ఆశే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చుస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత అనుభవమే దాచింది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా తరములనాటి కధంతా మన తదుపరి మిగలాలంటా కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం కన్నెర్ర

Krishnagadi Veera Prema Gaadha Nuvvante Na Navvu by mee snehageetham

Image
నువ్వంటే నా నవ్వు నేనంటే నే నువ్వు నువ్వంటూ నేనంటూ లేమనీ అవునంటూ మాటివ్వు నిజమంటూనే నువ్వు నే రాని దూరాలె నువ్ పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానీను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్ అడుగు నిలుచున్నా నీవైపే చేరేనులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడిలేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామ ఈ వానలో ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా. నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వూ నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే వున్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే ఇది ఓ వేదం పద రుజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలగ

Love Failure Inthajare Inthajare song by mee snehageetham

Image
పాతికేళ్లు వ్యర్ధమేనా పేరుకైనా విలువలేదా ఈ పిల్లచెలిమిలో ఈ ఒక్క క్షణముకే సలాము కొట్టలా వయసు వట్టిపోయెనా వెనకడుగే ముందుచూపా నీ వైపే పిల్లా వెల్లువెత్తే నా అడుగులే నీలా మారిపోయే నా నడకలే ఏ నీడ లేని దేహం ఏంటో నీకు నాకు మధ్య అద్దంఅడ్డు ఉన్నా వీడిపోదేమిటో ఇంతజారే ఇంతజారే ఇంతలోపే ఎంత జోరే బిందువల్లె ఉన్ననన్నే జల్లు లాగ మార్చినావే ఇంతజారే ఇంతజారే వింత మైకం చెంత చేరే నిన్ను కలిసే వేలకోసం వెల్లివిరిసే ఈ హుషారే చిన్ని చిన్ని కవితలున్న పుస్తకంలా నీ జ్ఞాపకాలే నిండి ఉన్న మనసు నేడిలా హై కూలుతోటి కోవిలమ్మ కుహుకుహూలు నింపుతోందిలా నా నీ లు రాసి వయసు వాడ్ని బాణికట్టి పాడుతుందిలా ఈ పదీ రోజులే నీ పదీ ఆకలే నిన్నిలా పదే పదే జ్ఞాపకం చేస్తుంటే ఇంతజారే ఇంతజారే కాలి కింది నేల జారే తుళ్ళిపోయే ఉల్లి లాగా నువ్వు లేక నేనెలాగ ఇంతజారే ఇంతజారే ఇంత లోపే ఎంత మారే గుండె పిండే తేనె పట్టే చేదు నిండా తీపి పుట్టే నిన్న మొన్న కాలమంత ఏమయిందో రేపు అన్న భావమంత మాయమైందో నీ ఊహలోనే కాలమంత మైనమల్లె కరుగుతోందో నీ రూపు తప్

Aalochana Vasthene Song from o my friend by mee snehageetham

Image
ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే నువ్వంటూ నాక్కనబడకుంటే ఏమయ్యేదో నిన్నటి దాక నేనే నువ్వు నా పక్కన లేన్దే ఉన్నానంటే నమ్మాలో లేదో.. ఏనాడైనా ఈమాట నీతో అనగలనో లేదో హో అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం హో ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం ప్రాయం ఉన్నా, పయనం ఉన్నా పాదం మాత్రం ఎటో పడదు దారీ నేనై, దరినీ నేనై, నడిపిస్తాగా ప్రతీ అడుగు బెదురుగా హా.. తడబడే మనసిదీ కుదురుగా హా.. నిలపవా జతపడి || హో అంటున్నది || నీ కన్నులతో చూసేదాకా, స్వప్నాలంటే తెలీవెపుడూ నా కల ఏదో గుర్తించగా నీ రూపంలో ఇలా ఇపుడూ చలనమే హా.. కలగని చెలియలో.. హా... సమయమే హా.. కరగని చెలిమిలో   || ఆలోచన వస్తేనే || మీ స్నేహగీతం

Koluvaithiva Rangasai Ananda Bhairavi Movie Song by mee snehageetham

Image
సాహిత్యానికి మాళవిక, భాగవతుల వెంకట రామశర్మ చేసిన నాట్యం, గురువుగా గిరీష్ కర్నాడ్ అభినయం అద్భుతంగా మేళవించిన ఈ పాట......... కొలువైతివా... రంగశాయి ! హాయి ! కొలువైతివా... రంగశాయి !! కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి కొలువైతివా... రంగశాయి ! సిరి మదిలో పూచి తరచి రాగము రేపి చిరునవ్వు విరజాజులేవోయి ! ఏవోయి ! కొలువైతివా... రంగశాయి ! సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట పరచేటి ఎలదేటులేవోయి ఏవోయి కొలువైతివా... రంగశాయి ! ఔరా.. ఔరౌరా ! ఔరా... ఔఔరా !! రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి ముజ్జగములు మోహంబున తిలకింపగ పులకింపగ శ్రీ రంగ మందిర నవసుందరా పరా ! // శ్రీ రంగ // // శ్రీ రంగ // కొలువైతివా... రంగశాయి ! హాయి ! కొలువైతివా... రంగశాయి !! కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి కొలువైతివా... రంగశాయి !! మీ స్నేహగీతం

Ananda Bhairavi Songs | Pilichina Muraliki Song by mee snehageetham

Image
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగం మురసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం మది ఆనంద భైరవి రాగం కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే.. కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే.. మనసే మురళీ ఆలాపనలో మధురానగరిగ తోచే... యమునా నదిలా పొంగినదీ స్వరమే వరమై సంగమమై మురసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం మది ఆనంద భైరవి రాగం పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగం !! ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మ్రోగే..... పదమే పదమై మదిలో వుంటే ప్రణయాలాపన సాగే... హౄదయం లయమై పోయినదీ లయలే ప్రియమై జీవితమై మురసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం మది ఆనంద భైరవి రాగం పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగం !! మీ స్నేహగీతం

ఆనంద భైరవి సాంగ్ బ్రహ్మాంజలి by mee snehageetham మీ స్నేహగీతం

Image
సంప్రదాయ సాహిత్యాన్ని కాచివడబోసిన వేటూరి, పూర్వ కవుల మార్గాన్ని అనుసరిస్తూ ఋతువర్ణన చేసిన అద్భుతమైన పాట ఇది.నవ్వులకు మారుపేరైన జంధ్యాల తనకు అత్యంత ఇష్టమైన పాట అని చెప్పిన పాట ఇది. సన్నివేశం ఊరు వెలివేసిన నాట్యకారుడు తన శిష్యురాలైన దొమ్మరి పిల్లకి పాఠం నేర్పటం. మొదట ప్రార్ధన: “బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు” – తాండవానికి ఆద్యుడైన పరమేశ్వరుడికి బ్రహ్మాంజలి. నిరంతరమూ లాస్యంలో మునిగితేలే పార్వతీ దేవికి దివ్యమైన నమస్కారం “దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు” నాట్యం కేవలం కళ కాదు , అది పార్వతీపరమేశ్వరుల ప్రతిరూపం. తాండవ నృత్య స్రష్టకు అనటం లో ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాగ్మయం ఆహార్యం చంద్ర తారాది, తమ్ వందే “సాత్వికం శివం” అన్న శ్లోకస్ఫురణ ఉంది. ఇదే భావాన్ని వేటూరి సాగరసంగమంలో “చంద్రకళాధర, సహృదయా, సాంద్రకళాపూర్ణోదయా ” అని వర్ణించారు. కళోపాసన ఈశ్వరస్వరూపం అని మన పూర్వుల అభిమతం. ఈ నృత్య కళకు (కూచిపూడికి) ఆద్యుడైన సిద్ధేంద్రయోగికి నమస్కారం – “భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి” కళని ప్రదర్శించే వారుంటే, యుక్తాయుక్తాలు గ్రహించి మెచ్చుకునే రసికులు ఉంటారు – “నృత్యాంజలి నాట్య కోవిద వరులకు ” విచ్చ

Ninnu Kori Telugu Movie Songs | Unnattundi Gundey Song With Lyrics by mee snehageetham మీ స్నేహగీతం

Image
నిన్ను కోరి చిత్రం నుండి '' ఉన్నట్టుండీ గుండే'' పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం. ఉన్నట్టుండీ గుండే ... వంద కొట్టుకుందే... ఎవ్వరంటా ఎదురైనదీ ... సంతోషాలే నిండే... బంధం అల్లుకుందే.... ఎప్పుడంటా ముడి పడినదీ ... నేనా...నేనా... ఇలా నీతో ఉన్నా... ఔనా?..ఔనా?.. అంటూ ఆహా అన్నా ... హేయ్ ..నచ్చిన చిన్నది మెచ్చిన తీరు.. ముచ్చటగా నను హత్తుకు పోయే... ఓయే ...ఓయే ..యే..యే..యే..హత్తుకు పోయే.. చుక్కలు చూడని లోకం లోకి ..చప్పున నన్ను తీసుకుపోయే... ఓయే ...ఓయే ..యే..యే..యే.తీసుకుపోయే.. ఉన్నట్టుండీ గుండే ... వంద కొట్టుకుందే... ఎవ్వరంటా ఎదురైనదీ ... సంతోషాలే నిండే... బంధం అల్లుకుందే.... ఎప్పుడంటా ముడి పడినదీ ... యే దారం ఇలా...లాగిందో..మరీ... నీ తోడై చెలీ ...పొంగిందే మదీ ... అడిగీ పొందినది కాదులే... తనుగా దొరికిన కానుక ఇకపై సెకనుకొక వేడుక.. కోరే నీలా ఇలా నా చెంత చేరుకుందిగా ... హేయ్ ..నచ్చిన చిన్నది మెచ్చిన తీరు.. ముచ్చటగా నను హత్తుకు పోయే... ఓయే ...ఓయే ..యే..యే..యే..హత్తుకు పోయే.. చుక్కలు చూడని లోకం లోకి ..చప్పున నన్ను తీసుకుపోయే... ఓయే ...ఓయే ..యే..యే..యే.తీసు

navami naati vennela nenu by mee snehageetham మీ స్నేహగీతం

Image
నవమి నాటి వెన్నెల నేను... .. రమేష్ నాయుడు గారి మరో ఆణిముత్యం ఈ పాట.  ముఖ్యంగా మధురమైన ఆ బాణి వింటూంటే ఎంత హాయిగా ఉంటుందో మాటలలో చెప్పడం కష్టం. ఇక వేటూరి గారి నవమి దశమి పద ప్రయోగం గురించి కూడా చాలా చర్చలు జరిగాయి ఆన్ లైన్ ఫోరమ్స్ లో. కొందరు "ఇద్దరూ గొప్పే... కానీ అసంపూర్ణం.. ఆఇద్దరూ కలిస్తేనే పున్నమి..." అనే స్ట్రెయిట్ అర్ధమే ఉంది అంటే, ఇంకొందరు "జయసుధ హీరో కన్నా వయసులో పెద్ద కనుక, ఆమెను ముందు పుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి వేటూరి వారు చమత్కరించారు" అని అన్నారు. వాస్తవమేమిటో వేటూరి వారికే తెలియాలి నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు నీ వయసే వసంత రుతువై నీ మనసే జీవన మధువై నీ వయసే వసంత రుతువై నీ మనసే జీవన మధువై నీ పెదవే నా పల్లవి గా నీ నగవే సిగ మల్లిక గా చెరిసగమై యే సగమేదో మరచిన మన తొలి కలయికలో నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న

yekantha vela song,anveshana,by mee snehageetham మీ స్నేహగీతం

Image
ఏకాంత వేళ.. ఈ కాంత సేవ ఏకాంత వేళ.. కౌగిట్లో ఈ కాంత సేవ.. ముచ్చట్లో పడుచమ్మ దక్కే.. దుప్పట్లో దిండల్లె ఉండు.. నిద్దట్లో కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై ఏకాంత వేళ.. కౌగిట్లో ఈ కాంత సేవ.. ముచ్చట్లో ఏకాంత వేళా.... ముద్దు సాగిన.. ముచ్చట్లో పొద్దు వాలదు.. ఇప్పట్లో ముద్దు సాగిన.. ముచ్చట్లో పొద్దు వాలదు.. ఇప్పట్లో కమ్ముకున్న ఈ కౌగిట్లో.. కాటుకంటి.. నా చెక్కిట్లో నన్ను దాచుకో.. నా ఒంట్లో పడకు ఎప్పుడూ.. ఏకంట్లో నన్ను దాచుకో.. నా ఒంట్లో పడకు ఎప్పుడూ.. ఏకంట్లో ఆ చప్పట్లు.. ఈ తిప్పట్లు నా గుప్పెట్లోనే ఏకాంత వేళ.. కౌగిట్లో ఈ కాంత సేవ.. ముచ్చట్లో పడుచమ్మ దక్కే.. దుప్పట్లో దిండల్లె ఉండు.. నిద్దట్లో కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై ఏకాంత వేళ.. గుబులు చూపుల.. గుప్పిట్లో ఎవరు చూడని.. చీకట్లో గుబులు చూపుల.. గుప్పిట్లో ఎవరు చూడని.. చీకట్లో చిక్కబోములే.. ఏకంట్లో ఎదలు కలుపుకో.. సందిట్లో దేవుడొచ్చిన.. సందట్లో ఎదురులేదులే.. ఇప్పట్లో దేవుడొచ్చిన.. సందట్లో ఎదురులేదులే.. ఇప్పట్లో ఆ.. చెక్కి

Edhuta Neeve ,abhinanandana by mee snehageetham మీ స్నేహగీతం

Image
ఎదుటా నీవే యదలోనా నీవే ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాడ్ని కానీదు ఆహహా ఓహోహో ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ... ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యం ఐతే వింత సత్యం స్వప్నం అయ్యేదుందా ప్రేమకింత బలముందా ఆహహా ఓహోహో ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ... ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే మీ స్నేహగీతం 

Yenno Yenno : Malli Malli Idi Rani Roju,by mee snehageetham ,మీ స్నేహగీతం

Image
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలే మబ్బులోని జాబిల్లె నా చెలి నగుమోమై విరిసెలే గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసే చలి చలి ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు నాకు నీవే నీవే.. వేవేల ముందూ జన్మల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హోయలె.. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలే మబ్బులోని జబిల్లె నా చెలి నగుమోమై విరిసెలే నీ కోసమే ఎదనే గుడిలో ఇలా మలిచే నా మనసే నీ కానుకై నిలిచే తనువే నవరసమే నీవంత పరవశమై జన్మంతా  పరిచయమే పండాలంట ప్రేమే ఇంకా ఇంకా.. మరి మరి నీ కవ్వింత విరియగా నా వొళ్ళంతా  కలిగేనుల ఓ పులకింత ఎంతో వింత.. నువ్వువిన జగమున నిలుతున ప్రియతమ వేవేల ముందు జన్మల బంధాలన్నీ నీవేలే యెదలో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్నీ నీ హోయలె.. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలే మబ్బులోని జాబిల్లె నా చెలి నగుమోమై విరిసెలే గుండెలు ప్రాణంగా నీవే నిండంగ మండే ఎండల్లో వేసే చలి చలి ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే