Posts

Showing posts from April, 2017

Ninnu Chudagaane Attarintiki Daredi Song మీ స్నేహగీతం

Image
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే ఏమిటో ఏం మాయో చేసినావే కంటి చూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావే మరదలా నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే ఏయ్.. అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే ఏయ్.. భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగరాసావే ఏయ్.. అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంటపడనా నావలా నువ్వు తూగుతూ నడుస్తుంటే కాపలాకి నేను వెంటరానా కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రావే మరదలా అత్త లేని కోడలుత్తమురాలు ఓరమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా పచ్చి పాల మీద మీగడేదమ్మా వేడి పాలల్లోన వెన్న ఏదమ్మా మోనలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాల సీస అందాన్ని చూడనేలేదు ఇంక ఏం లాభం కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళినోడు రాజైనా

pedavi daatani .thammudu video song మీ స్నేహగీతం

Image
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా మనసు నిన్నే తలచుకుంటోంది  వినపడదా దాని గొడవ తలుచుకుని అలసిపోతోందా  కలుసుకునే చొరవ లేదా ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా   ఇదిగిదిగో కళ్లలో చూడు  కనపడదా ఎవ్వరున్నారు  ఎవరెవరో ఎందుకుంటారు  నీ వరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా హే కోయిలా.. ఓ కోయిలా..  హే కోయిలా.. ఓ కోయిలా..  మీ స్నేహగీతం 

cheliya cheliyaa చెలియా చెలియా సాంగ్ kushi మీ స్నేహగీతం

Image
చెలియ చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాలా సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా వుండాలా చెలియ చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే ఐతే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా ఉలి తాకంగా వెలిసెనులే ఐతే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా కళ్ళల్లో కదిలేటి కలలంటా ఊహల్లో ఊగేటి ఊసంటా చెలియ చెలియా చిరు కోపమా నీలి మేఘాలు చిరుగాలిని ఢీ కొంటే మబ్బు వానల్లే మారునులే దీన్ని గొడవేననుకోమననా లేక నైజం అనుకోనా మౌనరాఘాలు రెండు కళ్ళని ఢీ కొంటే ప్రేమ వాగల్లే పొంగునులే దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా అధరాలు చెప్పేటి కథలంటా హృదయంలో మెదిలేటి వలపంటా చెలియ చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము మీ స్నేహగీతం 

Gulabi Puvvai Navvali Vayasu Annadammula Anubandham మీ స్నేహగీతం

Image
గులాబిపువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే ఇలాంటి వేళ ఆడాలి జతగా ఇలాగె మనము ఉండాలిలే మనసు దోచి మాయజేసీ చెలినే మరచిపోవొద్దోయి రాజా... రాజా గులాబిపువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది చలాకినవ్వు చిందించుచు హుషారు తెచ్చింది మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను వలపుపెంచి మమతపంచి విడిచిపోనని మాటివ్వాలి రాజా... రాజా గులాబిపువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను యుగాలకైనా నాదానివై నీవే వుంటావు అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను మనసు నీదే మమత నీదే.. రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ గులాబిపువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే ఇలాంటి వేళ ఆడాలి జతగా ఇలాగె మనము ఉండాలిలే లాలలా లాలలా లాలలా లాలలా చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : సినారె గానం : బాలు, సుశీల మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Image
ఒకటే ఎదగా ..ఒదిగే కథగా... ఒడిలోన ఊయలూగగా.. ............... 'మధుమంత్రం' ఇంతకంటే బాగుంటుందా...? గాలి ఎదను గిల్లుతూ.. పూలు సుధలు చల్లుతూ సాగే సాహిత్యంతో ఏదో స్వరం లిఖించగా.. మంచుకొండల్లోని అందాల్ని ఆస్వాదిస్తూ మనం మైమరచిపోవాల్సిందే.. ఈ గీతానికి 'బాలు' 'జానకి' గార్లు శృతించిన గమకాల గమ్మత్తులకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. __/\__ పలికే మౌనమా మౌనమే వేదమా పలుకే ప్రాణమా ప్రాణమే బంధమా ప్రియా పలికే మౌనమా మౌనమే వేదమా మదిని దేవి కొలువైన వేళ వచ్చెనో....ఆ ..ఆ ఆ.. ఆ ..ఆ మనసు నీదే అని మరులు పూలు విచ్చేనో ఏదో సుఖం శృతించగా .ఏదో స్వరం లిఖించగా ఏదో సుఖం శృతించగా..ఏదో స్వరం లిఖించగా ఒకటే ఎదగా ..ఒదిగే కధగా ఒడిలోన ఊయలూగగా.. పలికే మౌనమా ... పలుకే ప్రాణమా... కలలు కన్న నా కనులు మూసుకొనెనే కలిసిపోతే వయసింక మాటవినదే గాలే ఎదే గిల్లేనిలా..పూలే సుధే చల్లేనిలా గాలే ఎదే గిల్లేనిలా..పూలే సుధే చల్లేనిలా చొరవే విడవా.. మనవే వినవా మధు మంత్రమేదో పాడవా పలికే మౌనమా ... మౌనమే వేదమా పలుకే ప్రాణమా... ప్రాణమే బంధమా ప్రియా.. పలికే ఊ.. మౌనమా మౌనమే.. ఊ వేదమా.. ఆఆ చిత్రం: కర్ణ మ్యూజిక్ : విద్యా సాగర్ గానం

Tholi Choopu Cheli Raasina Subhalekha మీ స్నేహగీతం

Image
ఈ పాట సాహిత్యం గమనిస్తే తెలుగు హిందీ బాషలు రెండూ వుంటాయి) చిత్రం : రాజ్ కుమార్ (1983) రచన : వేటూరి సంగీతం : ఇళయ రాజా గానం : బాలు, జానకి రాగం : కళ్యాణి ఆఆఆఆఆఆఆఆఆ.. ఆహాహ.. ఆహాహ.. ఆహాహ.. తొలి చూపు చెలి రాసిన శుభలేఖ తొలి చూపు చెలి రాసిన శుభలేఖ పలుకే లేనిది.. ప్రియ భాషా పలుకే లేనిది.. ప్రియ భాషా తొలి చూపు చెలి రాసిన శుభలేఖ తొలి చూపు చెలి రాసిన శుభలేఖ కన్నూ కన్నూ నవకళ్యాణి లో.. రాగాలెన్నో పలికే క్యా(क्या) అందాలన్నీ బిగి కౌగిళ్ళకే.. రావాలనీ అలిగే బనే మేరే ప్రాణ్ మన్ మధ్ కే తీర్ ఏహై ప్రేమ్ కా సార్ (बने मेरे प्राण मन मध् के तीर ऐहै प्रेम का सार) ప్రాణాలన్ని మరు బాణా లైదుగా చేసే ప్రేమ కావ్యం అఛ్చా(अच्चा) తొలి పాట చెలికంకితం.. చెలి నీడ నా జీవితం... ఆరారు కాలాల కిది కామితం నజరోం సే ఆహ దిల్ నే దియా నజరానా ఆహహ.. (नजरॊं सॆ ఆహ दिल नॆ दिया नजराना అహహ..) న హో సకా ఔర్ దేనా (न हॊ सका और दॆना) న హో సకా ఔర్ దేనా దేనా (न हॊ सका और दॆना.. देना) నజరోం సే ఉహూ.. దిల్ నే దియా నజరానా.. (नजरॊं सॆ ఉహూ.. दिल नॆ दिया नजराना) బృందావనీ సుమ గంధాలతో శృంగారాలే వలచీ ఫిర్(फिर) శిల్పావనీ లయ లాస్యాలతో సౌందర్యాలే తలచీ సా

Swara Kalpana Movie Songs - Sarigamapadani Song మీ స్నేహగీతం

Image
తెలుగు సినిమా చరిత్రలో కేవలం సప్త స్వరాక్షరాలతో మాత్రమే రూపు దిద్దుకున్న ఏకైక పాట..మీ కోసం ఈ పాట సాహిత్యం మొత్తం కేవలం ' స ' 'రి' ' గ' 'మ' 'ప' ద' ' ని' తోనే ఉంటుంది చిత్రం: స్వర కల్పన రచన: జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావు సంగీతం: గంగై అమరన్ గానం: ఎస్. పి. బాలు, ఎస్. జానకి పల్లవి: సరిగమ పదనిని నీ దానిని సరిగమ పదనిని నీ దానిని సరిగా సాగనీ నీదారిని సరిగమ పదనిని నీ దానిని దాగని నిగనిగ ధగధగమని దామరి మానిని సరిదారిని దామరి మానిని సరిదారిని చరణం సామ సాగరిని సాగనీ నీదరిని సామ సాగరిని సాగనీ నీదరిని పదమని మరినీ సగమని నీ దాపామని పాదని సాదని నీ దాపామని పాదని సాదని గరిమగ మగనిగ మరిమరి సాగనీ సరిగమ పదనిని నీ దానిని దామరి మానిని సరిదారిని చరణం నిగమాగమాపగ నీ సరిగగాగ నిగమాగమాపగ నీ సరిగగాగ సరిగమ పదనీ గనిగా దా సరిగమ పదనీ గనిగా దా నీ గరిమని గని నీ దరిని మనీ నీ గరిమని గని నీ దరిని మనీ సాగనీ సమపద సమాగమమనీ దాగని నిగనిగ ధగధగమని దామరి మానిని సరిదారిని దామరి మానిని సరిదారిని సరిగమ పదనిని నీ దానిని సరిగా సాగనీ నీదారిని సరిగమ పదనిని నీ దానిని మీ స్నేహగీత

Patti Techanule Video Song Aatma Bandhuvu మీ స్నేహగీతం

Image
జానపద ఛాయలుంటే చాలు ఆ పాట సొగసు చెప్పడానికి మాటలు దొరకవు అలాంటిది ఇక ఆ బాణి ఇళయరాజా గారిది ఐతే ఇదిగో ఈ పాటలా సొగసుగా తయారయి ఎన్ని ఏళ్ళైనా అలా గుర్తుండి పోతుంది. ఆత్మబంధువు చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పన లో వచ్చిన ఒక మధుర గీతాన్ని ,అందులోని పండు వెన్నెలనీ మీరూ ఓ సారి పలకరించి రండి. చిత్రం : ఆత్మబంధువు (1985) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు, జానకి పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహా నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహా నా మావ కోసం ఏది ఏది చూడనీవే దాన్ని కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని ఏది ఏది చూడనీవే దాన్ని కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహా నా మల్లి కోసం... మనసున సెగ యెగసే ఏ మాయో వెలుపల చలి కరిచే వయసుకు అదివరసా వరసైన పిల్లదానికది తెలుసా మాపిటికి చలిమంటేస్తా.. కాచుకో కాసంతా ఎందుకే నను ఎగదోస్తా.. అందుకే పడి చస్తా చింతాకుల చీర గట్టి పూచింది పూదోట కన్నేపువ్వు కన్ను కోడితే తుమ్మెదకూ దొంగాటా దోబూచిలే నీ ఆటా...ఊహూ.. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహా నా మల్లి కోసం ఏది ఏది చూడనీవా దాన్ని కళ్ళు మూయ్యి చూప

Sakhi Songs | Sakhiya Cheliya (Pachchadanamey) మీ స్నేహగీతం

Image
సఖియా... చెలియా... కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు సఖియా... చెలియా... నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే పచ్చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు ఎరమ్రుక్కులే పిల్ల వాక్కు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసి పాదం ఎరన్రి రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎరన్రి పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండబంతి గోరంత పచ్చ పచ్చా... పచ్చా... పచ్చా... మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం అలలే లేని సాగర వర్ణం మొయిలే లేని అంబర వర్ణం మయూర గళమే వర్ణం గుమ్మాడి పూవు తొలి వర్ణం ఊదా పూ రెక్కలపై వర్ణం ఎన్నో చేరేనే కన్నె గగనం నన్నే చేరే ఈ కన్నె భువనం రాత్రి నలుపే రంగు నలుపే వానాకాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లో కారునలుపే కన్నె కాటుక కళ్లు నలుపే విసిగి పాడే కోయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే తెల్ల

Nee Vaalu Jada Song - Radha Gopalam మీ స్నేహగీతం

Image
చందమామ లాంటి మోము నువ్వు పూవ్వు లాంటి ముక్కు దొండ పండు లాంటి పెదవి కలువపూల వంటి కళ్ళు జామపండులాంటి బుగ్గ బెల్ల ముక్క లాంటి గడ్డం వలపు శంఖమంటి కంఠం ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివే వెనకనెందుకు ఉన్నావే జడా? ఆ...ఆ బుగ్గలు సాగదీస్తావ్ ముక్కుని పిండుతావ్ పెదవులు జుర్రుకుంటావ్ గడ్డాన్ని కొరుకుతావ్ ముద్దులు గుద్దులు గిచ్చుళ్లు నొక్కుళ్లు అదేమిటంటే ఆరళ్లు గీరళ్ళు శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావనే ఇలా.. వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్క కనిపెడుతున్నా అవసరమైతే పని పడుతున్నా ఓ వాలు జడా మల్లెపూల జడా ఓ పాము జడా సత్యభామ జడా నువలిగితే...నాకు దడా ఓ పట్టు జడా రసపట్టు జడా బుసకొట్టు జడా నసపెట్టు జడా ఇప్పుడేందుకే ఈ రగడా.... ఓ వాలు జడా మల్లెపూల జడా ఓ పాము జడా సత్యభామ జడా వీపుకి మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడా ఈ తగవులేలనే జడా కులుకుల నడుముకి వెనకన తిరుగుతు కళకళలాడే జడా నను కనికరించవే జడా పిరుదుల బిరుదుల జడగంటలతో జగతికి చాటే జడా నా పొరపాటేమే జడా అత్తరి ఇత్తర అనుమానాల తత్తర బిత

Ayyo Ayyo Full Video Song HD Oopiri మీ స్నేహగీతం

Image
అయ్యో అయ్యో అయ్యో అయ్యో చందమామ కింది కొచ్చి ముద్దు పెట్టే అయ్యో అయ్యో అయ్యాయ్యయ్యో ఎండ వేళ ఎన్నెలొచ్చి కన్ను గొట్టే పంచదార పాకమేదో దొరికిందే కంచె దాటి చిట్టి చీమ ఎగిరిందే కుండపోత మల్లె వాన కురిసిందే ఊపిరంతా ఉక్కపోత పెరిగిందే సీతాకోక చిలకల గుంపు నడు ఒంపుల్లో కితకితలాడే శీతాకాలం పిల్లడి వైపు పరిగెడుతోంది ఎదిగిన ఈడే హే సడి లేని జడి వానై నను చుట్టుముట్టి సూది గుచ్చినావే పొగ లేని సెగ నువ్వై నాతొ అంటుగట్టి మంట పెట్టినావే అరె నా ఒంటి తీగకు ఇన్నేసి మెలికలు నేర్పింది నువ్వే పిల్ల రంగు పిట పిటా చెంగు చెంగు చిట పటా కంటి ముందే అట్ట ఇట్ట తిప్పుకుంటూ తిరుగుతున్నదే ఒంపు సొంపు కిట కిట చెప్పలేని కట కటా చూపు తోనే గట గటా దప్పికేమో తీరకున్నదే సీతాకోక చిలకల గుంపు నడుం ఒంపుల్లో కితకితలాడే... అయ్యో అయ్యో అయ్యో అయ్యో చందమామ కింది కొచ్చి ముద్దు పెట్టే యాడికేల్తే ఆడికొచ్చి వెంట వెంట పడకు ఆశ పెట్టి అందనని అనకూ గాలి సైగలేవో చేసి అవ్వి ఇవ్వి అడ్డక్కు కత్తిపీటతో నా గుండె తరక్కూ హయ్యోరామ అందం చిగురాకు అంత పని చేస్తుందనుకోకు చ

Vaana Vaana Velluvaye Video Song మీ స్నేహగీతం

Image
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి        మీ స్నేహగీతం