Posts

Showing posts from April, 2018

Mooga Manasulu Lyrical - Mahanati Songs - by mee snehageetham

Image
''మహా నటి ''చిత్రం నుండి ''మూగ మనసులూ..మూగ మనసులూ.. పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. మూగమనసులూ... మూగమనసులూ.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయం అన్న జాడ లేని హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా కుహూ.. కుహూ.. కుహూ.. స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ మూగమనసులూ.. మూగమనసులూ.. ఊహల రూపమా, ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమా, పూల పరాగమా నా గత జన్మల రుణమా.. ఊసులు, బాసలు ఏకమైన శ్వాసలో నిన్నలు, రేపులు, లీనమైన నేటిలో ఈ నిజం కథ అని తర తరాలు చదవనీ ఈ కథే నిజమని కలలలోనె గడపనీ వేరే లోకం చేరే వేగం పెంచే మైకం మననిలా తరమని తారా తీరం తాకే దూరం ఎంతో ఏమో అడగకేం ఎవరినీ మూగమనసులూ.. మూగమనసులూ.. Mee Snehageetham

Naruda O Naruda Video Song - Bhairava Dweepam Movie - By Mee Snehageetham

Image
‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడు సృష్టించిన నాతి (లక్ష్మీకాంత) చేసిన నృత్యం ఒకటుంది. ‘వగలోయ్‌.. వగలూ తళుకు బెళుకు వగలూ’ అనే జిక్కీగారు పాడిన పాట. మధ్య మధ్య ‘‘లలలూ లలలూ లలలు లలలు లలలూ ..’’ అనే హమ్మింగ్‌ వినిపిస్తుంది. ఈ హమ్మింగ్‌ ఆ చిత్రంలో తరచూ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌గా వినిపిస్తుంది కూడా. అంత ఆకర్షణీయంగా బాణీ కట్టారు ఘంటసాలగారు. ‘లలలూ లలలూ ...’ హమ్మింగ్‌ చేస్తుంటే ‘నరుడా .. ఓ నరుడా ... ఏమికోరికా’ అనే మాటలు తట్టాయి. ‘పాతాళభైరవి’లో గిరిజ టైటిల్‌ రోల్‌ పోషించారు. ఆమె మాట్లాడ ేది ఒకే మాట. ‘నరుడా ఏమి నీ కోరిక?’. ఆ మాటని లలలూ లలలూ బాణీలో పెట్టినప్పుడు పుట్టిన పాట ఇది. సింధుభైరవి రాగంలోని ఈ బిట్‌ని మొదట వేటూరి గారికి వినిపించారు మాధవ పెద్ది సురేష్‌ గారు. ఆయన మెచ్చుకుని అరపూటలో పాట మొత్తం రాసేశారు. నరుడా ఓ నరుడా ఏమి కోరికా ... కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా ... రా దొర ఒడి వలపుల చెరసాలరా లే వరా ఇవి దొరకని సరసాలురా దోర దోర సోకులేవి దోచుకో సఖా ఋతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధలే కొసరగా .. ఇంత పంతమేల బాలకా .. ‘నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ కసి స్వర మెరుగని ఒక జావళి