Posts

Showing posts from July, 2019

నువ్వొ రాయి నేనో శిల్పి//Nuvvo rai nenu shilpi //full song

Image
మనిషిని,మనసుని కదిలించే శక్తి సంగీత సాహిత్యానికి ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాట. ఒక్క పాటతో అన్ని వృత్తుల వాళ్లపైన గౌరవం వచ్చేలా చేశారు మాటలకందని మౌనరాగం... ఒక ప్రయివేట్ ఆల్బం లో ఇంత సులువైన పదాలతో ఇంకా సుతిమెత్తని దెబ్బ అంటరానితనం పై .. నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటరానివాడిని నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతలు నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని కానీ మలిన పడినావాడివంటూ