Posts

Showing posts from January, 2018

Bhaagamathie - Mandaara Song with Lyrics - By Mee Snehageetham

Image
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా ఒహ్… నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా సుందర… మందార… కళ్లారా… సుందర.. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందే ఇలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా… కడలై నాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలనే మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమై నా గమ్యానివై నా నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలగా కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారా సరికొత్త స్నేహం దరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా Mee Snehageetham

Sogasu Chooda Tarama Song -Mister Pellam - By Mee Snehageetham

Image
సొగసు చూడతరమా ... సొగసు చూడతరమా  నీ సొగసు చూడతరమా ... నీ సొగసు చూడతరమా  నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు ఎర్రన్ని కోపాలు  ఎన్నెల్లో దీపాలు అందమే సుమా  సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా  అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళ చేజారిన దువ్వెన్నకు బేజారుగ వంగినపుడు చిరు కోపం చీర గట్టి సిగ్గును చెంగున దాచి ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెట్టినపుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించి కొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ చెంగుబట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే తడిబారిన కన్నులతో విడు విడు అంటున్నప్పుడు విడు విడుమంటున్నప్పుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా పసిపాపకు పాలిస్తూ పరవశించి ఉన్నపుడు పెద పాపడు పాకి వచ్చి మరి నాకూ అన్నపుడు మొట్టికాయ వేసి ఛి పోండి అన్నప్పుడు నా ఏడుపు నీ నవ్వులు హరివిల్లై వెలసినపుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి క్షణమే యుగమై వేచి వేచి చలి పొంగులు తొలి కోకల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులు వాచి నిట్టూర్పున నిశి రాత్రిలో నిదరోవు అందాలతో త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి సొగసు చూడతరమా నీ సొగసు చూడ

MOUNAMELA EE - PARUGO PARUGU - By Mee Snehageetham

Image
మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం నీలికొండల్లో నీరెండై సోకింది కన్నెప్రేమ రాగవీథుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ కల్యాణి అందం కాశ్మీరగంధం కోరింది నేడే కల్యాణబంధం ఎన్నో జన్మాల బంధాలే ఎదలో సన్నాయి పాడే సంధ్యారాగాల వర్ణాలే చెలితో దోబూచులాడే కన్నుల్లో వెన్నెల్లు కున్న వేళల్లో గుండెల్లో గుమ్మెక్కె ఏముందో ఏమో ప్రేమల్లో ఒయ్యారి మాట వలపు మంత్రం చిన్నారి చెంత చిలిపి తంత్రం మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం కన్నె పూబంతి ఊహల్లో పెళ్లి మద్దెళ్లు మోగె నిండు నూరేళ్ళ కౌగిళ్ళు   శాంతి సౌఖ్యాలు కోరె. సందెల్లో సింగారి సిందూరపూల చెక్కిళ్లు పొద్దంతా ముద్దాడి వర్ధిల్లమంది వెయ్యేళ్లు సయ్యాటలాడే సరసరాగం ఉయ్యాలలూగే ప్రేమహృదయం మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం Mee Snehageetham  

Rangulalo Kalavo - Abhinandana Songs - By Mee Snehageetham

Image
రంగులలో కలవో యద పొంగులలో కళవో  నవశిల్పానివో రతిరూపానివో తొలి ఊహల ఉయలవో రంగులలో కలవో యద పొంగులలో కళవో కాశ్మీర నందన సుందరివో  కైలాస మందిర లాస్యానివో ఆమని పూచే యామినివో మధుని బాణమో మదుమాస గానమో నవ పరిమళాల పారిజాత సుమమో రంగులలో కలనై యద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా రంగులలో కలనై ముంతాజు అందాల దానివో షాజాను అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో ప్రణయ దీపమో నా విరహ తాపమో నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో రంగులలో కలనై యద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా రంగులలో కలనై యద పొంగులలో కళనై Mee Snehageetham

Laayi Laayi Video Song - Yeto Vellipoyindhi Manasu - By Mee Snehageetham

Image
ఈ పాట గురించి చెప్పాలి అంటే కొంచెం కష్టమే..కాని మీకోసం ఈ పాట గురించి మొన్న ఒక ఇంటర్వ్యూ లో చూసి అద్భుతంగా అనిపించి మీ కోసం.. ఈ సినిమాని దాదాపు అందరూ చూసి వుంటారు.పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అసలు సంగతి చెప్పనా ? ఈ పాట పాడింది స్వయానా మన లయరాజా ''ఇళయరాజా ''గారు..నమ్మలేకపోతున్నారు కదా! ఇళయరాజా గారు చాలా అరుదుగా పాడుతుంటారు. ఈ యుగళగీతాన్ని ఆయన బేల శండేతో కలిసి పాడారు .ఇళయరాజా మార్కు ‘కోరస్’తో మొదలయ్యే ఈ పాటలో గానం, నేపథ్యసంగీతం అవిభాజ్యమన్నట్టు పరస్పర ఆధారంగా అల్లుకుపోయి వీనుల విందు చేస్తాయి. చరణాల్లో బాణీ తీరు - ఒక వృత్తాన్ని చుట్టుముట్టి తిరుగుతున్న భావన కలిగిస్తుంది. గాయని పాడిన భాగంలో ‘హాయి నీదే సుమా’ లో ‘నీదే’ అన్నచోట మాధుర్యం ప్రత్యేకం. ‘మనదే సరదా సరదా’ అనేమాటలు త్వరత్వరగా తరుముకొచ్చినట్టు గమ్మత్తుగా వినిపిస్తాయి. మీకోసం సాహిత్యం తో సహా ఇస్తున్నాను ..విని ఆనందించండి. లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేమి మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా లేత లేత చేతిలో చేతులేసి చేరుకో ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే

Yamuna teerana Radha madilona - gouravam - By Mee Snehageetham

Image
యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా....  కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా..  యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా....  కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా..  హృదయం తెలుపు ఊహలలో.. రాగం నిలుపు ఆశలలో..  తేనెల తేటల తీయని భావన.. ఊరెను నా మనసులో.. యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా.... కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా.. ఎదలో తలపే... వణికెనులే అధరం మధురం... చిలికెనులే రాధా హృదయం... మాధవ నిలయం యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా.... కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా.. మనసే నేడు వెనుకాడే.. హృదయం విరిసి కదలాడే లోలో భయము తొణికేనే.. ఎదలో సుఖము విరిసేనే పందిరిలో నిను పొందెద ఆ దినం.. ఆ దినమే పండుగ యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా.... కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా.. Mee Snehageetham

Vaana Jallu-Yamudiki Mogudu - By Mee Snehageetham

Image
వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా సన్నతొడిమంటి నడుముందిలే .. లయలే చూసి లాలించుకో ఓ.. వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ.. వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో .. వద్దు లేదు నా భాషలో మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో .. హద్దు లేదు ఈ హాయిలో కోడె ఊపిరి తాకితే.. ఈడు ఆవిరే ఆరదా కోక గాలులే హోయ్ సోకితే.. కోరికన్నదే రేగదా? వడగట్టేసి బిడియాలనే .. ఒడి చేరాను వాటేసుకో.. వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా... నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా... చీరకట్టు తానాగునా పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా... జారుపైట తానాగునా క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా తొడగొట్టేసి జడివానకే .. గొడుగేసాను తలదాచుకో వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ.. Mee Snehageetham

Swathi Muthyapu Jallulalo - Prema Yuddham Movie - By Mee Snehageetham

Image
హంసలేఖ గారి సంగీత దర్సకత్వం లో వచ్చిన ఒక మరపు రాని మధురమైన పాట మీ కోసం . స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహాహా ఓ ఒహొహొ ముసురేసిందమ్మా కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే తడిపేసిందమ్మ తనువు తనువు కలిపి తనతో సగమే చెరిపి చలిగాలేం చేస్తుంది చెలికాడే తోడుంటే ఆ మెరుపులకే మెలి తిరిగే సొగసులతో ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో కురిసింది వాన తొలిగా పరువాన స్వాతిముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే మతిపోయిందమ్మా మనసు మనసూ కలిసి, కథలు కళలు తెలిసి జలపాతం నీవైతే అల గీతం నేనేలే కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసి, దివిన