Posts

Showing posts from July, 2017

Mutyalu Vasthava Song Manushulanta Okkate Movie Song by mee snehageetham

Image
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. ఊర్వశిలా ఇటు రావే వయారీ ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. ఊర్వశిలా ఇటు రావే వయారీ చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను.. తొందరపడితే లాభం లేదయో నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ... నీ కొంటే చూపు కోరికేస్తు ఉందీ నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ.. నీ కొంటే చూపు కోరికేస్తు ఉందీ.. కన్నూ కన్నూ ఎపుడో కలిసిందీ ఏదయ్యగోల.. సిగ్గేమి లేదా.. ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా ఏదయ్యగోల.. సిగ్గేమి లేదా.. ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా.. నిన్నూ నన్నూ చూస్తే నామరదా ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. ఊర్వశిలా ఇటు రావే వయారీ పరిమినెంటుగాను నిన్ను చేసుకొంటాను.. ఉన్నదంత ఇచ్చెసి నిన్ను చూసుకుంటాను ఇంటా బయటా పట్టుకునుంటానూ.. అహా... ఒహో.. ఏహే.. ఏ.. ఏరుదాటిపోయాక తెప్ప తగల ఏస్తేను.. ఊరంతా తెలిసాక వదలి పెట్టి పోతేను బండకేసి నిను బాదేస్తానయ్యో.. రేవులోన నిను ముంచేస్తానయ్యో ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. ఊర్వశిలా ఇటు రావే వయారీ చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను.. తొందరపడితే లాభం లేదయో చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976) సంగీతం :

abhimanyudu idi kalaa kalaa..aakundi pappundi by mee snehageetham

Image
ఇది కలా... కలా... కలా... మనమిలా.. ఇలా... ఇలా  గాలిలా పువ్వులా తావిలా... కలిసి ఉన్నాము కలవకనే కలుసుకున్నాము... తెలియకనే వెలుగుకు నీడకు చెలిమిలా... ఒక్కటైనాము కలవకనే ఒదిగి ఉన్నాము... కరగకనే  ఈ ప్రేమ పత్రము..ఈ జన్మకు చెల్లువేయుము ప్రతి జన్మజన్మకు..మరల తిరగ వ్రాసుకొందము ఎలా ఎలా ఎలా..ఆ ఆ ఆ ఇలా ఇలా ఇలా..ఇలా ఇలా ఇలా ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది..ఆశ ఉంది వెన్నెల కలువలా చెలువలా మందగించాము... జతలుగ విందులవుదాము... కథలుగా కన్నుల పాపలా... చూపులా.. చూచుకుందాము... సొగసులుగా పగలు రేయిగా... రేయి పగలుగా ఈ రాగసూత్రము... మూడుముళ్ళు వేసుకుందము ఈ మూగమంత్రము... దీవెనగా చేసుకుందము ఎలా ఎలా ఎలా..ఆ... ఆ... ఆ... ఇలా.. ఇలా.. ఇలా..ఇలా... ఇలా... ఇలా ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది..ఆశ ఉంది మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్.... మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మీ  స్నేహ గీతం  

abhimanyudu tadisina korika by mee snehageetham

Image
తడిసిన కోరిక తాళం తడుతుంటే... ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే రారా చేసిపోరా... శివతాండవం... హోయ్.. హోయ్.. హోయ్... రారా చేసిపోరా... శివతాండవం... హాయ్ తడిసిన కోరిక తాళం తడుతుంటే... ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే రానా చేసిపోనా... శివతాండవం... హోయ్.. హోయ్.. హోయ్... రానా చేసిపోనా... శివతాండవం... హాయ్ సరిగంగ స్నానాలు చేసి...ఆహా తనువెల్ల తాపాలు మోసి... హయ్ హయ్ సరిగంగ స్నానాలు చేసి... తనువెల్ల తాపాలు మోసి తడితడి పైటా..అహా.. తాకిన చోట.. ఉడికెక్కిపోతుంటే తడితడి పైటా..అహా.. తాకిన చోట.. ఉడికెక్కిపోతుంటే అడుగడుగున గంగవెర్రులు అలజడి పెడుతుంటే.. శివతాండవం తడిసిన కోరిక తాళం తడుతుంటే... ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే రారా చేసిపోరా... శివతాండవం... రానా.. హాయ్... చేసిపోనా... శివతాండవం... హాయ్ పుడుతోంది గుండెల్లో ఉరుము... పడగెత్తి పోతోంది నడుము పుడుతోంది గుండెల్లో ఉరుము... పడగెత్తి పోతోంది నడుము పిడికిట్లోనా.. అహా.. పిల్లనడుమేమో... గిజగిజలాడుతుంటే పిడికిట్లోనా.. అబా.. పిల్లనడుమేమో... గిజగిజలాడుతుంటే పెదవుల్లు పెను దాహం ఉబికిఉబికి వస్తుంటే... శివతాండవం తడిసిన కోరిక తాళం తడుతుంటే... ముసిరే వయసుకు మువ్వల

abhimanyudu srungaara seemanthini by mee snehageetham

Image
ఆ.. ఆ.. ఆహ.. హా.. అహా..హా.. నిసనిస.. నిసనిగ.. సగ సమా.. ఆ.. ఆ.. శృంగార సీమంతిని... శృంగార సీమంతిని.. నా జీవన మందాకిని నీ కనుసన్న సైయ్యాటలో.. నను జీవించనీ.. మరణించనీ శృంగార సీమంతిని.. నా జీవన మందాకిని నీ కనుసన్న సైయ్యాటలో.. నను జీవించనీ.. మరణించనీ శృంగార సీమంతిని... సరిప.. గమ గమని సరిప.. పమ గపమ నిసనిస.. సమగమ నీ హృదయాన మ్రోగాలని రవళించు రాగాన్ని... నీ గుడిలోన వెలగాలని తపియించు దీపాన్ని నీ పాద కమలాల పారాణిని.. నీ ప్రయణ సన్నిద్ధి పూజారిని సురలోక వాసిని.. సుమ హాసిని చిరకాలం ఈ చెలిమి చిగురించి పూయని శృంగార సీమంతిని.. ఆ.. నా జీవన మందాకిని..మ్మ్.. నీ కనుసన్న సైయ్యాటలో.. ఆ.. నను జీవించనీ.. మరణించనీ... ఆ.. శృంగార సీమంతిని... పమగా.. మపగగమపగ సనిని... మా.. మపదమపద మా గా గా సనిని మాగగ నీ రాయంచ గమనానికి పరిచాను పూదారిని నువు రానున్న శుభవేళకై వేచాను ఒంటరిని విన్నాను నీ కాలి సవ్వడిని కన్నాను నీ కాళి కనుదోయిని కరుణాంతరంగిని... అనురాగిని నీ అలుకే నా పాళి వరముగా పండనీ... శృంగార సీమంతిని.. ఆ.. నా జీవన మందాకిని..మ్మ్.. నీ కనుసన్న సైయ్యాటలో.. ఆ.. నను జీవించనీ.. హహ.. మరణించనీ... ఆ.. శృంగార సీమంతిని... ఆ..

Vaana Vaana Velluvaye Video Song - Gang Leader Movie by mee snehageetham

Image
చిరంజీవి చాలా రెయిన్ సాంగ్స్ లో నటించారు కానీ వాటిలో ది బెస్ట్ అంటే ‘ గ్యాంగ్ లీడర్ ‘ (1991) లోని ఈ పాటే అని చెప్పాలి. చిరంజీవి, విజయశాంతిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ముఖ్యంగా డాన్స్ స్టెప్స్, బప్పీలహరి మ్యూజిక్, భువనచంద్ర లిరిక్స్ ఈ పాటను ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలబెట్టాయి. ప్రభుదేవా అప్పుడే కొరియోగ్రఫర్ గా ఎంటరైన సమయం అది. అతని టాలెంట్ ను చిరంజీవి బాగా ఉపయోగించుకున్నారు. ఇందులో చిరు వేసిన స్టెప్స్ చాలా రొమాంటిక్ గా, స్టైలిష్ గా అనిపిస్తాయి. ఈ పాటను ఇప్పుడు చూసినా ఒక ఫీల్ కలుగుత ుంది. స్టెప్స్ లో ఎక్కడా స్పీడ్ కనబడదు. చాలా లవ్లీగా ఉంటాయి. వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెల

Kurisindi vaana bullemma bullodu by mee snehageetham

Image
ప్రముఖ హాస్యనటుడు చలం హీరోగా నటించిన ‘ బుల్లెమ్మ బుల్లోడు ‘ (1972) సినిమాలోని సాంగ్ ఇది. సత్యం స్వరాలు, రాజశ్రీ పదాలు ఈ పాటను చిరంజీవిని చేసేశాయి. ఈ పాటనే ఆ మధ్య వాన సినిమా కోసం దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు రీమిక్స్ చేయించుకున్నారు. కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను చలి గాలి వీచె గిలిగింత తోచె కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుసలాడేను కథలను తెలిపే కాటుక కనులు కైపులు రేపేను ఉరకలు వేసే ఊహలు నాలో గుసగుసలాడేను బిగువు ఇంకేల దరికి రావేల కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా మీ స్నేహ గీతం  

abhimanyudu suryudu choosthunnaadu by mee snehageetham

Image
అభిమన్యుడు చిత్రమ్ కోసం మహదేవన్ గారు స్వరపరచిన ఒక చక్కని ఆత్రేయ రచన చిత్రం : అభిమన్యుడు (1984) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : ఆత్రేయ గానం : బాలు, సుశీల సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు మ్మ్..హు..నిన్ను ఎలా నమ్మను? హహహ..ఎలా నమ్మించను? ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ప్రేమకు పునాది నమ్మకము అది నదీసాగర సంగమము ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కడలికి ఎన్నో నదుల బంధము మనిషికి ఒకటే హృదయము అది వెలిగించని ప్రమిదలాంటిది వలచినప్పుడే వెలిగేది వెలిగిందా మరి?వలచావా మరి? వెలిగిందా మరి?వలచావా మరి? ఎదలొ ఏదో మెదిలింది అది ప్రేమని నేడే తెలిసింది సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు ఏయ్..వింటున్నావా? మ్మ్..ఏం వినమంటావ్? ఆ ఆ ఆ ఆ ఆ మనసుకు భాషే..లేదన్నారు మరి ఎవరి మాటలను..వినమంటావు? ఆ ఆఆఆ మనసు మూగగా..వినబడుతుంది అది విన్నవాళ్ళకే..బాసవుతుంది అది

Koyilapilupe song from Andala Raasi by mee snehageetham

Image
నారాయణరెడ్డి గారి ఆణిముత్యాలలో ఇదొకటి కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు...ఊ.. కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు... చరణం 1: ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ.. ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ.. నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ... గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ... నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ... గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ... పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా... పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా... పదే పదే పదే పదే ఒదిగి ఉండాలని... కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు... కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు... చరణం 2: కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ... వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ... కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ... వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ... హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది... హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది... ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ.... కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు... కోయిల పిలుపే కోనకు మెరుపు... మాయని వలపే మనసుకు మెరుపు.

Ramachakkani sita ki - GODAVARI movie రామచక్కని సీతకి by mee snehageetham

Image
ఈ పాట తెలుగు సినీ చరిత్రలోని ఒక అధ్యాయం లోని చివరి పంక్తుల నుంచి జాలువారిన పాట. ఆ అధ్యయమే వేటూరి సుందర రామ మూర్తి గారు. ఒక గాయకుని గొంతు కైనా ఆయు: పరిమితి ఉంటుందేమో, ఒక దర్శకుని ప్రతిభకి నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుందేమో, ఒక సంగీత దర్శకుని కైనా పరిమితులు ఉంటాయేమో కాని, ఒక కవి భాష యొక్క పదునికి, కవి ఆలోచన/ఊహా శక్తికి వయో పరిమితి ఉండదు. అందుకు నిదర్శనమే వేటూరి గారు, ఆయన రాసిన ఈ పాట. ఈ పాట గొప్పతనం ఏమిటి అని అడిగితే ఒక్క మాటలో చెప్పలేము. ఖచ్చితం గా మనసును తాకి ఆహ్లాద పరిచే పాట, సీతా రాముల జంటని ఊహింప చేసే పాట. రామాయణం మొత్తం ఒక్క సారి స్పృశించే పాట, గోదావరి తో ఉన్న అనుభందం జ్ఞాపికకు వచ్చేలా చేసే పాట. ఒక కవి తన ఊహా శక్తి తో పదాలను తన గుప్పిట ఉంచుకొని ఎటు పడితే అటు అందంగా ఉపయోగించుకొనే పాట, విన్న శ్రోత తాదత్యం చెందే పాట. ఇలా అంతులేని అనుభూతుల్ని ఇచ్చి శ్రోత తో ఆనంద భాష్పాలు రాల్చే పాట. నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ మధుర వదన నలిన నయన మనవి వినరా రామా నీల గగన అంటే నీల ఆకాశ వర్ణం కలిగిన సీత, మనోహరమైన ( రమ ) ఘన విచలన అంటే నెమ్మది గా/ భారం గా నడిచేది అని, ఇక్కడ నెమ్మది  గా అంటే సున్నితంగా, వయ

Andamga Lenaa Song from Godavari by mee snehageetham

Image
అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడూ కాననా అలుసైపోయానా అస్సలేమీ కానా వేషాలు చాల్లే పొమ్మనా కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకే కలికిచిలకనాయే కలతనిదురలోయే మరవలేక నిన్నే మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్లుగా నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనులకబురు తెచ్చా తెలుసు నీకది తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటన ఏలది వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తరిమేసి పోలేదుగా మీ స్నేహగీతం

Meghama Dehama-Manchu Pallaki by mee snehageetham

Image
జీవనం” అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి – బ్రతుకు, నీళ్ళు . పల్లవిలో ‘ బ్రతుకు ‘ అనే అర్థం దేహానికి వర్తిస్తే, ‘ నీళ్ళు ‘అనే అర్థం మేఘానికి వర్తిస్తుంది. జీవనం అన్న పదాన్ని జీ-వనం అని విడదీసి పాడించారు రచయిత/స్వరకర్త. జీ అంటే ఆత్మ అని – వనం అంటే మేఘం అనీ అర్ధం! యమకాల్ని ప్రేమించే వేటూరి వారు తెలిసి చేసిన చిలిపి పని  అయ్యుండొచ్చు. చిత్రం : మంచుపల్లకి (1982) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : వేటూరి గానం : జానకి మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా .. కరుగునీ .. మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా .. కరుగునీ .. మెరిసినా కురిసినా కరుగు నీ జీ వనం మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం మెరుపులతో పాటు ఉరుములుగా.. దని రిస రిమ దని స దని ప గ మూగబోయే జీవస్వరములుగా వేకువ ఝామున వెన్నెల మరకలుగా రేపటి వాకిట ముగ్గులుగా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. స్మృతిలో మిగిలే నవ్వులుగా.. వేసవిలో మంచు పల్లకిగా.. మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం పెనుగాలికి పెళ్ళి చూపు.. పువ్వు రాలిన వేళా కల్యాణం.. అందాకా ఆరాటం

Oosupodu Full Song Fidaa by mee snehageetham

Image
ఊసుపోదు ఊరుకోదు  ఉండనీదు వెల్లనీదు  ఇంత ఖైదు నాకిలేమిటో సోయి లేదు సోలనీదు  వీడిపోదు చేరి రాదు  చింతపోదు నాకిలాగేమిటొ ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెల్లనీదు ఇంత ఖైదు నాకిలేమిటో సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరి రాదు చింతపోదు నాకిలాగేమిటొ నా నుండి నా ప్రానమే ఇలా జారుతోందె తప్పేన ఈ యాతనా నీ వైపు రావాలనే అలా ఉరికుతోందె ఆగేదేన అరె ఈ ఆలోచనా నీ తలపులే వొదలవే నన్ను నిదురలోను ఆ మలుపులే తెలియక నన్నే వెతికినాను నా గుండెలో తొందరే నన్నే నిలువనీదె ఏదొనాడు నీతో చెప్పెయనా... నీ చినుకులే కలలుగా నన్ను తరుముతాయే ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే నా గుండెలో తొందరే నన్నే నిలువనీదె ఏదొనాడు నీతో చెప్పెయనా... నీ తలపులే వొదలవే నీ తలపులే వొదలవే ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెల్లనీదు ఇంత ఖైదు నాకిలేమిటో మీ స్నేహగీతం 

Fidaa Song Hey Pillagaada by mee snehageetham

Image
హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి హే మొనగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిరగిర తిల్లే నీలోన.. బిరబిర సుడులై తిరిగేనా నిలవదా నువ్వేమ్ చేస్తున్నా దొరకను అందా నీకైనా హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి హే మొనగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి కదిలే కదిలే చినుకే కదిలే ముసిరే ఒక ముసురై ఇలకాల ఇకాటే ఉరికే ఉరికే జతగా ఉరికే మనసే నిను మరిచి తనకాల ఇకాటే సోయి లేని హాయిలోన కమ్ముకొన్నది గాలివాన ఏమి అవుతుందో ఏమో లోన నీకు తెలిసేనా నీలోని హైరానా నన్ను కూల్చేలా నాలోన జడివాన హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి హే మొనగాడా సంపకోయ్ మొరటోడా నా మనసును గిల్లి గిరగిర తిల్లే నీలోన బిరబిర సుడులై తిరిగేనా నిలవదా నువ్వేం చేస్తున్నా దొరకను అందా నీకైనా మీ స్నేహగీతం

Neevu Leni Nenu Lenu Video Song | Manchi Manushulu by mee snehageetham

Image
శోభన్‌బాబుగారి కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే ఆయన నటజీవితంలో అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది. జీవన్‌ప్రభ దేశాయ్‌ రాసిన ఒక హిందీ కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఆ గలే లగ్‌ జా’(1973) చిత్రం ఆధారంగా ‘మంచిమనుషులు’ చిత్రం తయారైంది. శశికపూర్‌, షర్మిలాఠాగూర్‌ హిందీలో పోషించిన పాత్రలను తెలుగులో శోభన్‌బాబు, మంజుల నటించారు ‘పడకు పడకు వెంట పడకు’, ‘నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు’, ‘విను నా మాట విన్నావంటే’, ‘నిన్ను మరచి  పోవాలని అన్ని విడిచి వెళ్లాలని’, ‘పెళ్లయ్యింది ప్రేమ విందుకు వేళయింది’... ఇలా సినిమాలో ప్రతి పాటా హిట్టే. ఆత్రేయ, ఆరుద్ర రాసిన పాటలకు మామ మహదేవన్‌ మధురమైన బాణీలు సమకూర్చారు. అలాగే ప్రేక్షకుల్ని కలల తీరంలోకి తీసుకువెళ్లేలా దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ ఈ పాటల్ని చిత్రీకరించారు. చిత్రం : మంచి మనుషులు (1974) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు, సుశీల ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆహ..ఆహ..ఆహా..ఆహ...ఆ..ఆ.. నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు నేనే నువ్వు.. నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో.

Enthavaraku Video Song gamyam movie by mee snehageetham

Image
జీవిత పరమార్థం ఏంటో ఈ ఒక్క పాట చూస్తే తెలుస్తుంది..నాకెంతో ఇష్టమైన "గమ్యం" సినిమాలోని సిరివెన్నెల సీతారామశాస్త్రీ గారు అద్భుతంగా రచించిన super song.. ఎంతవరకు...’ అనే పాటలో ప్రతి అక్షరం మనల్ని మనకి పరిచయం చేస్తుంది.  చాలా ప్రశ్నలు. చాలా జవాబులు. ఔననిపించే విషయాలు ఇందులో ఎన్నో ఉంటాయి. వేదం చెప్పే మొదటి మాట వెలుగు. ‘నీ ఉనికిని చాటే ఊపిరిలో లేదా గాలీ వెలుతురు’ అని ఆయన మనల్ని ప్రశ్నిస్తారు. పంచభూతాలు నువ్వే కదా అని చెప్పకనే చెబుతారు. పురిటి నొప్పులు తల్లివైతే పోయినప్పుడు కన్నీళ్లు చుట్టూ ఉన్నవాళ్లవి. ఈ రెండిటిలోనూ నీకు బాధ ఉండదనీ, ఆలోచించినప్పుడల్లా ‘అవును’ అనే నిజం తట్టిలేపుతూ ఉంటుంది.  ‘‘సరిగా చూస్తున్నదా నీ మది  మదిలో నువ్వే కదా ఉన్నది  చుట్టూ అద్దాలతో విడి విడి రూపాలతో  నువ్వే కాదంటున్నది’’ అనే వాక్యాలు ఆ లైన్‌ను ప్రతిబింబిస్తాయి.   వేదం చెప్పే మొదటి మాట వెలుగు. ‘నీ ఉనికిని చాటే ఊపిరిలో లేదా గాలీ వెలుతురు’ అని ఆయన మనల్ని ప్రశ్నిస్తారు. పంచభూతాలు నువ్వే కదా అని చెప్పకనే చెబుతారు. పురిటి నొప్పులు తల్లివైతే పోయినప్పుడు కన్నీళ్లు చుట్టూ ఉన్నవాళ్లవి. ఈ రెండిటిలోనూ నీకు బాధ ఉ

Shiva Poojaku Song - Swarna Kamalam Movie Song by mee snehageetham

Image
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా.. “చివురించిన మువ్వ” ??????? మువ్వ అంటే పువ్వు కాదు కదా! మరి మువ్వని పువ్వు అని సమర్థించడం ఎలా అంటే అడుగడుగునా మువ్వకి సర్వలక్షణాల్లోనూ పువ్వుతో సారూప్యం కనిపిస్తుంది. పువ్వు చిగురిస్తుంది – ఒక లతకి, ఒక కొమ్మకి. మరి మువ్వ మృదువైన, అందమైన (మంజుల) పాదాలు అనే లతకి (మంజరి) చిగురించిన పువ్వు. పువ్వుకి పరిమళం ఉంటుంది. మరి మువ్వకి జతిస్వరములు. అయితే ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని రెండు వస్తువుల్ని అంత బలవంతంగా, విచిత్రంగా ఎందుకు పోల్చాలి? ఎందుకూ  అంటే నాదమూర్తి, నటరాజు అయిన పరమేశ్వరుడి పాదపూజకి మామూలు పూలు కాకుండా, నాట్యానికి సంబంధించిన పూలు అయితే ధర్మంగా ఉంటుంది. కనుక “శివపూజకి చివురించిన సిరిసిరి మువ్వా”. అదే విధంగా వాసన, జతిస్వరాలు ఒకటి కాదు. కనుకనే యతిరాజు అని వాడడం జరిగింది. యతిరాజు అంటే సన్యాసులకి రాజు అని. సర్వసంగ పరిత్యాగి అయిన యోగి, సుగంధ ద్రవ్యాల్ని, సువాసనల్ని స్వీకరిస్తాడా? కానీ శివుడే ఒక విచిత్రమైన యోగి. ఇద్దరు భార్యలున్న సన్యాసి. అర్ధనారీశ్వరుడైన విరాగి. అతడు సంసారి కనుక పరిమళాలు కావాలి. సన్యాసి కనుక పరిమళాలు కూడదు. ఈ రెండూ కలిసొచ్చి “య