Posts

Showing posts from May, 2017

Gudilo Badilo Madilo Vodilo 1Min Video Song by mee snehageetham మీ స్నేహగీతం

Image
అస్మైక యోగ త‌స్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకమార సుందరం ఆ చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృందా విహార మందార సా...గరం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీతలపే శశి వదనా.... గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజ గమనా ..... ఆశ గా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవర లో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల తమలపాకల్లే తాకుతుంది తమకం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీతలపే శశి వదనా.... గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజ గమనా అస్మైక యోగ త‌స్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకమార సుందరం ఆ చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృందా విహార మందార సా...గరం... నవ లలనా నీ వలన కలిగె వింత చలి నా లోనా... మిసమిసలా నిశి లోనా కసి ముద్దులిచ్చుకోనా... ప్రియ జఘనా శుభ లఘనా... తల్లకిందులౌతూ తొలి జగడానా ఎడతెగని ముడిపడని రస కౌగిలింతలోనా కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం వానలా వచ్చి వరదలా మారి వలపు నీ

Sathmanam Bhavati Song From Radha Gopalam by mee snehageetham, మీ స్నేహగీతం

Image
ఆశీర్వాద మంత్రం లోని ఓం శతమానం భవతి ఆశీర్వ పదాన్ని ఇప్పటివరకు నాకు తెలిసీ ఇంతకుముందు కేవలం రెండు పాటలలో వాడారు. 1 )  మాటే మంత్రము..మనసే బంధము ( సీతాకోకచిలుక ) , 2 ) రాధా గోపాళం  ఇప్పుడు కొత్తగా వచ్చిన శతమానం భవతి చిత్రానికి ఏకం గా పేరే పెట్టటం కాకుండా టైటిల్ లీడ్ సాంగ్ గా కూడా పెట్టటం జరిగింది . చిత్రం : రాధాగోపాళం (2005) సంగీతం : మణిశర్మ సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి గానం : బాలు, చిత్ర శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతి శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతి శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి వేదం నాదంలా వెలుగూ దీపంలా హారం దారంలా క్షీరం నీరంలా మాటా అర్ధం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలుమగలు మొగుడు పెళ్ళాం భార్యా భర్తలకీ శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి తాళి కట్టే వేళ్ళు తడిమే

SAMAJAVARAGAMANA LAWER SUHASINI ,by mee snehageetham మీ స్నేహగీతం

Image
‘‘ప్రతి లైను చివరా ‘సామజవరగమనా’ ఉండేలా ఓ డ్యూయట్ కావాలని సీతారామశాస్త్రిగారిని అడిగితే, చాలా అవలీలగా ఈ పాట రాసిచ్చేశారు. ఆ సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అత్యద్భుతంగా బాణీ కట్టారు. ఈ సినిమా పేరు చెబితే అందరికీ ఈ పాటే గుర్తుకొస్తుంది.’’ - వంశీ ఆ... ఆ... ఆ... సామజవరగమనా దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా కలిమి చెలిమ ి మరువగలన ...సామజవరగమనా దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా అరవిరిసిన చిరునగవుల... సామజవరగమనా ఇల కురిసెను సిరివెలుగులు... సామజవరగమనా అరవిరిసిన చిరునగవుల... సామజవరగమనా ఇల కురిసెను సిరివెలుగులు... సామజవరగమనా సొగసులమణి నిగనిగమని... సామజవరగమనా మెరిసిన గని మురిసెనుమది... సామజవరగమనా వెలసెను వలపుల మధువని... సామజవరగమనా దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా మమతల ఉలి మలచిన

Kannanule Video Song - Bombay Movie by mee snehageetham మీ స్నేహగీతం

Image
ఇది నిజమా కల నిజమా, గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా పాట ఆఖరి లైన్లు చూడండి.. తరచి చూస్తే ఇదంతా కలా నిజమా అని ఆ అమ్మాయికి అనిపిస్తోంది. లేకపోతే తానేమిటి ఇలా అయిపోవడం ఏమిటి? ఈ ప్రేమని జయించి తీరకపోతే బ్రతుకు వృథా అనిపించేంత మాయ ఎలా జరిగింది? స్పృహలో ఉన్నామా కలలో ఉన్నామా తేల్చుకోడానికి చేతిని గిల్లి చూసుకుంటాం. అయితే ఆ అమ్మాయి తన బ్రతుకుని గిల్లి అడిగిందట! “గిల్లుకున్న జన్మనడి గా” – ఎంత అద్భుతమైన ప్రయోగం! ఇంకా ఈ తీయని ఊహల మైమరపులో భాషనే మరిచిపోయిందిట! ఈ భావాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి – “నీ నమాజుల్లో ఓనమాలు మరిచా”. “నమాజు” అనడం ద్వారా అమ్మాయి ముస్లిం అన్న విషయం గుర్తు చేస్తూ, తనది కేవలం తీయని ఊహ కాదు, ఓ ఆరాధన, ఓ ప్రార్థన అని తెలియజేస్తున్నాడు! ఓనమాలు – అంటే అక్షరాలు అనే కాదు, “ఓం నమః” ని గుర్తుచెయ్యడం ద్వారా అబ్బాయి హైందత్వాన్ని కూడా స్ఫురింపజెయ్యడం. అంటే ఈ మతాల వైషమ్యాలు మరిచి, ఈ అడ్డుగోడలు దాటి ప్రేమని సాధించుకుందాం అని చెప్పడం! ఈ రెండు వాక్యాలకీ వేటూరిగారికి నమస్కరించ వచ్చు అనిపిస్తుంది కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందా

Ee Velalo Neevu Video Song,gulabi song,by mee snehageetham, మీ స్నేహగీతం

Image
“ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. అనుకుంటు ఉంటానూ.. ప్రతీ నిముషమూ నేను..” చాలామందికి ఇష్టమైన పాట…  ప్రేమిస్తున్నామన్న ఫీలింగ్‌ , తను అక్కడ ఎలా వుందనే  ఫీలింగ్ నే ఎంత  థ్రిల్లింగ్‌గా ఉంటుందో ఈ పాట చూసి తెలుసుకోవచ్చు  ఈ  వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ!! ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను నడిరేయిలో నీవు నిదరైన రానీవు గడిపేదెలా కాలము...గడిపేదెలా కాలము పగలైన కాసేపు పనిచేసుకోనీవు నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువు కాక వేరేది కనిపించనంటుంది ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనె ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో నను నిలవనీకుంది మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను మీ స్నేహగీతం

chelimi lo valapu,Mouna Geetham song,by mee snehageetham, మీ స్నేహగీతం

Image
మౌనగీతం సినిమాలోని “చెలిమిలో వలపు రాగం” అన్న ఈ పాట వినేఉంటారు కానీ చెవుల ద్వారా సూటిగా మన మెదడుకు చేరుకుని ఆపై మత్తును తనువంతా ప్రవహింప చేసి మనిషిని తన స్వాధీనంలోకి తెచ్చుకునే ఒక మత్తుమందుని నింపిన పాటే... పాటకి ముందు నిముషం పాటు వచ్చే మ్యూజిక్ బిట్ కానీ పపపపా అంటూ తీసే ఆలాపన కానీ పాట మూడ్ లోకి అలా తీస్కెళిపోతే పాట ముగిసేంతవరకూ ఆత్రేయ గారి సాహిత్యం, బాలు జానకిల గాత్రం ఇళయరాజా స్వరాలతో కలిసి మిమ్మల్ని మరోలోకంలో విహరింప చేస్తుంది. చిత్రం : మౌనగీతం (1981) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, జానకి పపపపా.. పపపపాపా.. పపపపా.. పపపపాపా.. చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. రాగం భావం కలిసే ప్రణయగీతం పాడుకో.. పాప పపా పాడుతూ.. పాప పపా ఆడుకో.. పాప పపా చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. ఉయ్యాలలూగినానూ... నీ ఊహలో నెయ్యాలు నేర్చినానూ.. నీ చూపులో ఆరాధనై గుండెలో.. ఆలాపనై గొంతులో.. అలల లాగా కలల లాగా.. అలల లాగా కలల లాగా.. కదలి రాగా... చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. నులివెచ్చనైన తాపం... నీ స్నేహము ఎదగుచ్చుకున్న భావం.. నీ రూపము తుదిలేని ఆనందమూ..

paruvama chilipi parugu,by mee snehageetham,మీ స్నేహగీతం

Image
మౌనగీతం సినిమాలోని “పరువమా చిలిపి పరుగు తీయకు” బాలు గారు , జానకి గారు ఆలపించిన అద్భుతమైన 'మౌన గీతం' ఇది ... ఆత్రేయ గారు రచనలో ఇళయరాజా స్వరాలు మురిపించి మైమరపిస్తాయి మణిరత్నం దర్సకత్వం లో అందంగా చిత్రీకరించిన ఈ గీతాన్ని ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే గీతం..!!  పరువమా చిలిపి పరుగు తీయకు అంటూ ......... పరుగులో పంతాలు పోవకు అంటూ ప్రియురాలు చెప్పగా ఏ ప్రేమ కోసమో చూసే చూపులు ఏ కౌగిలింతకో చాచే చేతులు అంటూ దొరికితే హ జత కలుపుకో రాదా చిన్నగా ప్రియుడు ..........ఆ ఆ ఆ ................ఆహా అంటూ మీరూ ఆస్వాదించండి మరి..!! పరువమా చిలిపి పరుగు తీయకు పరువమా చిలిపి పరుగు తీయకు పరుగులో పంతాలు పోవకు పరుగులో పంతాలు పోవకు పరువమా చిలిపి పరుగు తీయకు ఏ ప్రేమ కోసమో చూసే చూపులు ఏ కౌగిలింతకో చాచే చేతులు తీగలై హో చిరు పూవులై పూయా గాలిలో హో రాగాలుగా మ్రోగా నీ గుండె వేగాలు తాళం వేయా పరువమా చిలిపి పరుగు తీయకు ఏ గువ్వా గూటిలో స్వర్గం ఉన్నదో ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో వెతికితే హో నీ మనసులో లేదా దొరికితే హ జత కలుపుకో రాదా అందాక అందాన్ని ఆపేదేవరూ పరువమా చిలిపి పరుగు తీయకు మీ స్నేహగీతం

Ninnu Kori Varnam Song,by mee snehageetham మీ స్నేహగీతం

Image
మోహన రాగంలో ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయ రాజా గారు చేసిన అనేక ప్రయోగాల్లో, మొదటిది “నిన్ను కోరి వర్ణం..” అన్న ఘర్షణ సినిమాలోని పాట. నిజానికి శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో “నిన్ను కోరి వర్ణం..” అన్న మోహనం రాగం వర్ణం ఉన్నా, ఈ సినిమా పాట కొంచెం శాస్త్రీయ సంగీతానికి కొంచెం భిన్నంగా కనపడుతుంది. కానీ, పూర్తిగా మోహన రాగం, ఆది తాళంలో స్వరపరచబడ్డ ఈ పాట వింటే, తెలిసిన మోహన రాగంలో ఎంతటి విలక్షణత తీసుకురావచ్చో ఇళయ రాజా గారు నిరూపించాడు. ఇలాంటి ప్రయోగాలు మన శాస్త్రీయ సంగీతం మీద మాత్రమే కాకుండా, వెస్టర్న్‌ మ్యూజిక్‌ మీద కూడా మంచి పట్టు ఉన్న ఇళయ రాజా గారి లాంటి వారు మాత్రమే చెయ్యగలరు. చిత్రం : ఘర్షణ గాత్రం: చిత్ర నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం కురికిన వాగల్లే తోలకరి కవితల్లే తలపులు కధిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసెనే నీతో పొందు కోరనే ఉండాలని

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Image
సినిమాలో కానీ నిజంగా కానీ ప్రేమికుల మనసులో భావాలను ఒకరికొకరు తెలియచేసుకునే ప్రేమలేఖ స్థానం మొదటిది, ముఖ్యమైనది కూడా .. "నిన్ను ఎలా వర్ణించాలో తెలియదు కానీ నువ్వు నా ప్రాణమంటూ" ప్రేమికుడు పాడే ఈ పాట సంగీత ప్రపంచంలో ప్రేమలేఖ పాటల్లో మొదటిది బాలు గారిస్వరం మాత్రం గమనిస్తూ వినండి ప్రారంభంలో ఆ ఆలాపనా, అక్కడక్కడ అల్లరినవ్వు, ప్రేమా అని ఒక్కోసారి ఒక్కోవిధంగా పలికేతీరు అన్నీ ఖచ్చితంగా ఎంజాయ్ చేయచ్చు. మీకోసం ఈ పాట చిత్రం : స్వప్న సంగీతం : సత్యం సాహిత్యం : వేటూరి గానం : బాలు ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు బాష చేతకాక.. తెలుపుటకు బాష చేతకాక.. ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు బాష చేతకాక.. తెలుపుటకు బాష చేతకాక.. మెరుపనీ పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం.. పూవనీ పిలావాలంటే..ఆ సొగసు ఒక్క దినం.. ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ.. ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ!! తెలిసింది ఒక్కటే.. నువ్వు నా ప్రాణమనీ!! ప్రేమా..ప్రేమా..ప్రేమా.. ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాసాను నీకు చెప్పలేక.. ఎదుటపడి మన

Maate Mantramu Video Song - Seethakoka Chiluka Movie మీ స్నేహగీతం ,by mee snehageetham

Image
మాటే మంత్రము...మనసే బంధము 1981 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఇలాంటి ప్రేమకథల ట్రెండ్ అప్పట్నించే మొదలయింది. ఈ సినిమాకి దర్శకత్వం భారతీ రాజా గారు. సంభాషణలు హాస్యబ్రహ్మ జంధ్యాల గారు రాసారు. ఈ సినిమాకి అత్యద్భుతమైన సంగీతాన్ని ఇళయరాజా గారు అందించారు. ఇళయరాజా గారి ఆణిముత్యాల్లో ఈ సినిమా పాటలు ముందువరుసలో ఉంటాయి. సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి గారు చాలా అర్ధవంతంగా, మధురంగా రాసారు. ఈ పాటని SP బాలు, SP శైలజ పాడారు. ఈ పాట మొదలవగానే అందరు గుర్తు పట్టేస్తుంటారు ఎందుకంటే పాట మొదట్లో హిందూ మంత్రాలు, చర్చి సంగీతం వస్తాయి. ఈ సినిమాలో హీరో హిందువు, హీరోయిన్ క్రైస్తవురాలు. అందుకే అలా సింబాలిక్ గా పెట్టారన్నమాట. ఈ పాట వినడానికి వీనుల విందుగా ఉంటుంది. మాటలు నిజంగా మనసుకి హత్తుకునే లాగ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ పాటను గుర్తు తెచ్చుకుని విని ఆనందించండి. ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుశ్శేవేంద్రియే ప్రతిదిష్టతి..... మాటే మంత్రము... మనసే బంధము... ఈ మమతే.. ఈ సమతే.. మంగళ వాద్యము... ఇది కల్యాణం... కమనీయం... జీవితం... మాటే మంత్రము... మనసే బంధము... ఈ మమతే.. ఈ

Aresukoboyi Paresukunnanu Song | Adavi Ramudu by mee snehageetham,మీ స్నేహగీతం

Image
1977లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్ - కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. ..... అత్యదిక వసూలు రాబట్టిన సినిమా, అప్పట్లో కోటి రూపాయల పాటగా పేరు తెచ్చుకున్న పాట...రాఘవేంద్రరావు గారి పుట్టిన రోజు సందర్భంగా మనందరి కోసం.... ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి కోకెత్తుకె ళ్ళింది కొండగాలి నువ్వు కొంటేచూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి ఆరేసుకోవాలని ఆరేసుకున్నావు హరి హరి హరి హరి నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తి పోతొంది హరి హరి హరి హరి హరి హరి నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ నా చేతి చలి మంటా కావాలి నువ్వింకా కవ్వించకే కాగిపోవాలి నీ కౌగిలింతలోనే దాగిపోవాలి ఆరేసుకోబోయి పారేసుకున్నాను నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు నీ రాకా నా వలపు ఏరువాకా నీ తాకా నీలిమబ్బు నా కోకా నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు నీ

సిరిమల్లె పువ్వల్లె నవ్వు సాంగ్, జ్యోతి తెలుగు మూవీ ,by mee snehageetham మీ స్నేహగీతం

Image
కమర్షియల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు గారు తీసిన ఒక చక్కని చిత్రం జ్యోతి లోని ఈ పాట చాలా బాగుంటుంది. సగంపాట నవ్వుతోనే లాగించేసినా జానకి గారు ఈ పాటతో మన మనసుపై వేసే ముద్ర మామూలుది కాదు. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరు కూడా ఆస్వాదించండి. సిరిమల్లె పువ్వల్లె నవ్వు హ్హ...హ్హ..హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు.. నా నువ్వు.. హ్హ...హ్హ..హ్హ..హ్హ..హ్హ.. సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లె నవ్వూ..నవ్వూ ప ని స ...హ్హ..హ్హ...హ్హ.. స గ మ ...హ్హ...హ్హ...హ్హ... గ మ ప ...ఆ...హ్హ...హ్హ.. ని ని ప మ గ గ మ ప హ్హ ..హ్హ..హ్హ..హ్హ...ఆ..ఆ..ఆ.. ఆ..ఆ.. చిరుగాలి తరగల్లె మెలమెల్లగా... సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిరుగాలి తరగల్లె మెలమెల్లగా... సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిననాటి కలలల్లె తియతియ్యగా... ఎన్నెన్నో రాగాలు రవళించగా..రవళించగా ఉహూ..హ్హ..హ్హ..హ్హ.. సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లె నవ్వూ... నవ్వూ నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా... ఆ వెలుగులో నేను పయనించగా నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా... ఆ వెల

DJ Saranam Bhaje Bhaje Full Song With English Lyrics.#DJ Movie Starring #AlluArjun,…

Image
DJ Saranam Bhaje Bhaje Full Song With English Lyrics.#DJ Movie Starring #AlluArjun,…

Saptapadi Movie Govullu Tellana Video Song,by mee snehageetham మీ స్నేహగీతం

Image
'' సప్తపది'' చిత్రం లో 'గోవుల్లు తెల్లన' పాటలో 'తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ... కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా' అని రాశారు వేటూరి గారు , కదుపు' అంటే సమూహం. 'కడుపు' అంటే అందరికీ తెలిసినదే. తెల్లటి ఆవులున్న మందలో నల్లటి ఆవులుండవా , నల్లటి ఆవు కడుపున ఎర్రటి ఆవు పుట్టదా అన్నది దాని అర్ధం. ఆ సినిమా వర్ణ వివక్షతకు సంబంధించిన చిత్రం కాబట్టి వేటూరి ఆ వాక్యాలను అంత నర్మగర్భంగా వాడేరు. ఇది తెలుసుకుని పాడేవాళ్ళు ఎంతమంది ?  అర్ధం తెలుసుకొని పాడే వారి పట్ల సంగీత దర్శకులు చూపించే గౌరవం ఎంతో గొప్పగా వుంటుంది. ఇవేవీ పట్టించుకోకుండా 'తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా ... కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా' అని పాడేస్తున్నారు చాలా మంది. 'కదుపు - కడుపు' అనే పదాల్లోని శబ్ద సారూప్యాన్ని తెలివిగా వాడుకోగలగటం వేటూరి చమత్కారం. ఇలాంటివి తెలుసుకోవాలి కదా ? గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా