Swarna Kamalam Song - Ghallu Ghallu- మీ స్నేహగీతం


ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు..
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు..
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు..
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు..
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు!!
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు..
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు..
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు..
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు..
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు!!
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు..
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు..
లయకే నిలయమై నీ పాదం సాగాలి..ఆహ హహ హహహ
మలయానిల గతిలో సుమబాలగ తూగాలి..ఆహహ ఆహహ
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి??
సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ??
తిరిగే కాలానికీ..ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
తిరిగే కాలానికి తీరొకటుంది..అది నీ పాఠానికి దొరకను అంది!!
నటరాజ స్వామి జటాజూటాలోకి చేరకుంటె..విరుచుకుపడు సురగంగకు విలువేముంది??
విలువేముంది??
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు..
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు..
దూకే అలలకు ఏ తాళం వేస్తారు?ఆహ హహ హహహ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు?ఆహ హహహ..
అలలకు అందునా ఆశించిన ఆకాశం??
కలలా కరగడమా జీవితాన పరమార్దం?
వద్దని ఆపలేరూ..ఆ ఆ ఆ, ఆ ఆ ఆ...ఆ ఆ ఆ, ఆ ఆ ఆ ..
వద్దని ఆపలేరు ఉరికే ఊహని .. హద్దులు దాటరాదు ఆశల వాహిని!!
అదుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే..విరి వనముల పరిమళముల విలువేముందీ??
విలువేముందీ??
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు..
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు..
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు..
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు..
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు!!
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు..
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు..
మీ స్నేహగీతం 

Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham