మెల్లగా తెల్లారిందోయ్ అలా-మీ స్నేహగీతం Mellaga Tellarindoi
మెల్లగా తెల్లారిందోయ్ అలా
వెలుతురే తెచ్చేసిందోయ్ ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో
చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించి
అందించు హృదయంలా
చలిమంటలు ఆరేలా
గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా..ఆఆ..
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా..ఆఆ..
పొలమారే పొలమంతా
ఎన్నాళ్లో నువ్వు తలచీ
కళమారే ఊరంతా
ఎన్నేళ్లో నువ్వు విడచి
మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన
పసి తనమే గుర్తొస్తుందా...
ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయనా..
నువ్వూగిన ఉయ్యాలా..
ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడకా..ఆఆ..
నువ్వాడిన దొంగాట
బెంగల్లే మిగలాలా
తన్నెవరూ వెతికే వీల్లేకా..ఆఅ..
కన్నులకే తియ్యదనం
రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయెళ్లే
పూల చెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే
అందం మాటాడే భాష
పలకరింపే పులకరింపై
పిలుపునిస్తే పరవశించడమే
మనసుకి తెలిసిన భాష
మమతలు పంచే ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరూ..ఊఊ
ప్రేమలు పుట్టిన ఊరు
అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ..ఊఊ
మీ స్నేహగీతం
Comments
Post a Comment