Maagha Maasam Song - Egire Paavurama Movie
మాఘ మాసం ఎప్పుడొస్తుందో....మౌన రాగాలెన్నినాళ్లో అని పెళ్లీడుకొచ్చిన ఓ కన్నెపిల్ల పాడిన పాట మన అందరికీ తెలిసిందే. ఒక్క పెళ్లి కావలసిన వారే కాదు యావత్ హైందవ జనం ఎంతో భక్తి భావంతో మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.మంచి ముహూర్తాలు ఉంటాయని ప్రతీతి .
మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా..!
తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు...
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు..
నా.. కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు..
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు..
ఓయమ్మో..ఆ..ఆ.. హాయమ్మా వలపులే తోలిరేయమ్మ వాటేస్తే..
చినవాడు నా సిగ్గు దాచేస్తే....
మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా..!
తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిల్లగాడు..
రాతిమనసున ప్రేమ అలికిడి చిలికాడే చినవోడు..
నా.. కంటిపాపకు కొంటె కలలను అలికాడే అతగాడు..
ఒంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో..
ఓయమ్మా.. ఆ... వళ్ళంతా మనసులే.. ఈ తుళ్ళింత తెలుసులే..
పెళ్ళాడే శుభలగ్నం ఏనాడూ..
మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌన రాగాలెన్నినాళ్లో..!
మంచు మబ్బు కమ్ముకొస్తుందో... మత్తు మత్తు ఎన్నియెల్లో..
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా...
చికుబుకు చికు చిన్నోడోయమ్మా..!
మీ స్నేహగీతం
Comments
Post a Comment