నీ నవ్వే హాయిగా వుంది - మీ స్నేహగీతం
నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హొ హొ
నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది
ప్రతిక్షణమూ మనసుపడీ
కలలుకనే నేనే అర్ధం కానా
రుస రుసలే చూపిస్తున్న
నను దూరం చేస్తూవున్నా
నాకోసం ఓ క్షణమయినా
ఆలోచిస్తే చాలన్నా
నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారన
నీతోడిలా నాతోడుగా వుంటే
హొ హొ హొ హొ హొ
నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది
తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా
చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో ఈ గాలిలా
నూరేళ్ళిలా నే వుండిపోతాలే
హొ హొ హొ హొ హొ
నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హొ హొ హోహో
Comments
Post a Comment