"ప్రేమించు పెళ్ళాడు" చిత్రానికి ఇళయరాజా స్వరపరిచిన "నిరంతరమూ వసంతములే" పాటలో ఋతువులనన్ని మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం వసంతం లాగే ఉంటోంది అనే ఉద్దేశంతో వేటూరి వ్రాసిన పాట అత్యద్భుతం.
ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు
నిరంతరమూ వసంతములే
నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగా పండే(2)
నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మేరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకసానికవి తరలా ఆశ కురుల విరి దారులా
ఈ సమయం ఉషోదయమై
మా హృదయం జ్వలిస్తుంటే(నిరంతరమూ)
అగ్ని పత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు రాసి మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోన అందమే అత్తరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా
మనసులోని మరు దివ్వెలా
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
మీ స్నేహగీతం
ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు
నిరంతరమూ వసంతములే
నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగా పండే(2)
నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మేరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకసానికవి తరలా ఆశ కురుల విరి దారులా
ఈ సమయం ఉషోదయమై
మా హృదయం జ్వలిస్తుంటే(నిరంతరమూ)
అగ్ని పత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు రాసి మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోన అందమే అత్తరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా
మనసులోని మరు దివ్వెలా
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
మీ స్నేహగీతం
Comments
Post a Comment