Swarabhishekam Songs - Adhi Needhani - By Mee Snehageetham
ఇది నాదనీ, అది నీదనీ, ఇది నాదనీ, అది నీదనీ, చెప్పలేనిది ఒక్కటి ఈ ఒక్కటి , ఏమది ? అది ఇది అని చెప్పలేనిది , ఆ చెప్పలేనిది ఏమది? అది మనసున పుట్టి మమతల పెరిగి మధువై పూచేది అది ఇది అని చెప్పలేనిది, అది ఇది అని చెప్పలేనిది వెన్నెలమ్మ రాతిరిదా, వేకువమ్మ పొద్దుటిదా కోకిలమ్మ ఆమనిదా? ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత ఈ జన్మకు చాలనంత పరవశమంతా మనదే మన ఇద్దరిదే, పదే పదే వినిపించే ప్రియదేవుడి అష్టపది, అది ఇది అని చెప్పలేనిది మొగ్గిన వలపుల ముంగిటా, వయసు ముగ్గు వేయనా నిగ్గులు పొంగిన చెక్కిటా, సిగ్గుల ఎరుపులు తాకనా వయ్యారంగా పార్వతి, శృంగారంగా శైలపతీ ఓంకారంగా కలిసి, ఏకాక్షరమై మురిసే పరవశమంతా మనదే మన “ఒక్కరిదే” ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపది అది ఇది అని చెప్పలేనిది Mee Snehageetham