Varaveena - Vinayakudu - by mee snehageetham




వరవీణా మృదుపాణి ఈ గీతాన్ని  అంతే అద్భుతంగా వెస్ట్రన్ స్టైల్ లో చేసిన అద్భుతమైన పాట 
కర్ణాటక సంగీతం నేర్చుకుకుంటున్నవిద్యార్థులు అందరూ 'మోహన' రాగం లోని "వరవీణా మృదుపాణి" గీతం తప్పని సరిగా నేర్చుకుంటారు. ఇది శ్రీ పురందర దాస రచన. కర్ణాటక సంగీతానికి 'మాయా మాళవ గౌళ' రాగాన్ని మౌలిక రాగంగా తీసుకుని సరళీ, జంట స్వరాల తో ప్రారంభించి అలంకారాలు, పిళ్ళారి గీతాలు మొదలయిన వాటిని పాఠ్య అంశాలు గా క్రమ పరచి అపారమైన సేవ చేసిన ఈ మహానుభావుడు "కర్ణాటక సంగీత పితామహుడు" అని జగద్విదితము.
వరవీణా మృదుపాణి వనరుహ లోచను రాణి
సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
నిరుపమ శుభగుణలోల నిరత జయాప్రదశీల
వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జనని జయ జయ జయ జయవాణి
ప్రతి పదార్థము:
వరవీణ = వరము గా గలిగిన వీణ; మృదు = సున్నితమైన; పాణి = చేతులు (దాల్చి); వనరుహ = [వన = వనము/నీరు + రుహ = పుట్టిన] పద్మం; లోచను (నయనాలు/కళ్ళు); రాణి (రాణి); సురుచిర = వంకీలు తిరిగిన; బంభర = తుమ్మెదల వంటి; వేణి = కురులు; సుర = దేవతలచే; నుత = స్తుతించబడ్డ; కల్యాణి = శుభ గుణములు కలది; నిరుపమ = (ఉపమ = సామ్యం; నిరుపమ = సామ్యం లేని); శుభ = మంచి; గుణ = లక్షణాలు; లోల = కలిగినది (స్త్రీ); నిరత = ఎల్లప్పుడూ; జయ = విజయమును; ప్రద = ప్రసాదించే; శీల = స్త్రీ; వరద = వరములిచ్చు అంటే విష్ణువు; ప్రియ = ఇష్టసఖియైన; రంగనాయకి = శ్రీ రంగనాథుని సతి అయిన లక్ష్మీ దేవి; వాంఛిత = కోరిన; ఫల = ఫలములు; దాయకి = ఇచ్చునది (స్త్రీ); సరసీజాసన = [(సరసిజ + ఆసన; సరసిజ = సరసులో పుట్టినది, పద్మం; పద్మం ఆసనంగా గలవాడు అంటే బ్రహ్మ; జనని = తల్లి; బ్రహ్మ తల్లి అంటే లక్ష్మి; జయ = విజయము; వాణి = వాక్కు గలది.
తాత్పర్యము: వర వీణను తన మృదువైన చేతుల దాల్చిన పద్మలోచనుని (విష్ణుని) రాణియై, తుమ్మెదల వంటి వంపులు తిరిగిన కురులు గలిగి, దేవతలచే స్తుతించ బడిన, శుభ గుణములు గలది, సామ్యం లేని మంచి లక్షణాలు గలిగి, ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే స్త్రీ, వరదుని (విష్ణుని) ఇష్ట సఖియైన రంగనాయకి (శ్రీ రంగని పత్ని) అయి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే బ్రహ్మకు తల్లి అయిన లక్ష్మీ దేవి జయాన్ని ప్రసాదించు గాక!


Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham