స్వరరాగ గంగా ప్రవాహమే swararaga ganga pravahame postby madhaviraju
"సరిగమలు" అనే చిత్రం కోసం వేటూరి గారు రాసిన పాట "స్వరరాగ గంగా ప్రవాహమే" ఇందులో వేటూరిగారు మొదటి చరణంలో "కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి" అన్నారు. ఇదేమీ సామాన్య సినిమా పాట లోని చరణం కాదు . శ్రీ ఆదిశంకరాచార్యుల వార్లు ప్రతిపాదించిన ఘటాకాశ సిద్ధాంతాన్ని ఇక్కడ వేటూరి గారు సందర్భోచితంగా వాడారు. "శరీరం ఒక మట్టి కుండ, అందరి శరీరాలు మట్టి కుండల వంటివే, లోపల ఉండే శూన్యం అంతా ఆకాశమే, కుండల వేరయినా ఆకాశం వేరు కాదు అలాగే దేహాలు వేరయినా ఆత్మలు వేరు కావు" అంటుంది ఘటాకాశ సిద్ధాంతం. మీ స్నేహగీతం , Madhavi Raju .