Mooga Manasulu Lyrical - Mahanati Songs - by mee snehageetham
''మహా నటి ''చిత్రం నుండి ''మూగ మనసులూ..మూగ మనసులూ.. పాట సాహిత్యం మొట్ట మొదటిసారిగా మా బ్లాగ్ ద్వారా మీకోసం.. మూగమనసులూ... మూగమనసులూ.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయం అన్న జాడ లేని హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా కుహూ.. కుహూ.. కుహూ.. స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ మూగమనసులూ.. మూగమనసులూ.. ఊహల రూపమా, ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమా, పూల పరాగమా నా గత జన్మల రుణమా.. ఊసులు, బాసలు ఏకమైన శ్వాసలో నిన్నలు, రేపులు, లీనమైన నేటిలో ఈ నిజం కథ అని తర తరాలు చదవనీ ఈ కథే నిజమని కలలలోనె గడపనీ వేరే లోకం చేరే వేగం పెంచే మైకం మననిలా తరమని తారా తీరం తాకే దూరం ఎంతో ఏమో అడగకేం ఎవరినీ మూగమనసులూ.. మూగమనసులూ.. Mee Snehageetham